పది,ఇంటర్,డిగ్రీ అర్హతతో..‘నిఫ్ట్-2020’ అడ్మిషన్‌కు మార్గాలు ఇవే..
Sakshi Education
ఫ్యాషన్ రంగం.. విస్తృత అవకాశాలకు వేదిక. ఆసక్తి, క్రియేటివిటీ ఉన్న యువతకు ఈ రంగం ఎర్ర తివాచీ పరుస్తోంది. ఉజ్వల కెరీర్ అవకాశాలు అందించే ఫ్యాషన్ ప్రపంచంలోకి ప్రవేశ మార్గాలు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) క్యాంపస్‌లు! నిఫ్ట్లోచేరి ఫ్యాషన్ కోర్సులు పూర్తిచేస్తే.. కార్పొరేట్ కొలువులు ఖాయమన్న అభిప్రాయముంది! అందుకే నిఫ్ట్‌లో ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతోంది. తాజాగా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘నిఫ్ట్-2020 అడ్మిషన్స్’ ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో... నిఫ్ట్ ప్రత్యేకత.. అందిస్తున్న కోర్సులు.. ప్రవేశ ప్రక్రియ.. పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం...
నిఫ్ట్ ప్రత్యేకత :
కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా సంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్). ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్ అందించే కోర్సుల ద్వారా సంబంధిత నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 నిఫ్ట్ క్యాంపస్‌ల్లో పలు బ్యాచిలర్, మాస్టర్ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్ అడ్మిషన్స్-2020 షెడ్యూల్ విడుదలైంది.
కోర్సులు :
దేశవ్యాప్తంగా ఏర్పాటైన నిఫ్ట్ క్యాంపస్‌ల సంఖ్య 16. వీటిల్లో యూజీ, పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న మొత్తం కోర్సులు పది. ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రవేశం కల్పించే బ్యాచిలర్ స్థాయి కోర్సులు ఏడు.. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ప్రవేశం కల్పించే పీజీ కోర్సులు మూడు.
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ డీఎస్) :
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ :
బ్యాచిలర్ స్థాయిలో.. ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(బీ ఎఫ్ టెక్). ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ ప్రోగ్రామ్‌లు :
మూడంచెల ఎంపిక ప్రక్రియ :
నిఫ్ట్-అడ్మిషన్ ప్రక్రియ మూడంచెల్లో జరుగుతుంది. తొలిదశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్; జనరల్ ఎబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఆ తర్వాత దశలో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ నిర్వహించి.. ప్రతిభ చూపిన విద్యార్థులకు సీటు ఖరారు చేస్తారు.
తొలిదశ జీఏటీ :
తొలిదశలో జీఏటీ(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ని బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులు ఇద్దరికీ నిర్వహిస్తారు. ప్రశ్నల క్లిష్టత మాస్టర్ కోర్సుల్లో కొంత ఎక్కువగా ఉంటుంది. జీఏటీలో పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; అనలిటికల్ ఎబిలిటీ; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్‌లో ఆయా విభాగాల నుంచి అడిగే ప్రశ్నల సంఖ్య..
ఆ కోర్సులకు ప్రత్యేకంగా జీఏటీ :
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీని మరింత ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఇందులో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా బీ ఎఫ్టెక్, ఎం ఎఫ్టెక్లకు సంబంధించిన జీఏటీ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి.
రెండో దశ.. సీఏటీ :
నిఫ్ట్ ప్రవేశాల ప్రక్రియలో రెండో దశ పరీక్ష.. సీఏటీ (క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్). అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా సీఏటీ ఉంటుంది.
మూడో దశ.. సిట్యుయేషన్ టెస్ట్ :
సిట్యుయేషన్ టెస్ట్ పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఉంటుంది. అభ్యర్థుల సృజనాత్మకతను పరీక్షించేలా ఈ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని అడుగుతారు. (లేదా) ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని.. దానికి తగ్గట్టు ఊహా చిత్రం గీయమంటారు.
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ :
నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్లోని తొలి మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. భావ వ్యక్తీకరణ సామర్థ్యం, ఆయా అంశాలపై స్పష్టత, పరిజ్ఞానం, ఆలోచన సామర్థ్యాలను పరీక్షించే విధంగా గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రధానం ఉద్దేశం.. ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తిని పరిశీలించడం. ఇందులోనూ విజయం సాధిస్తే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు.
సన్నద్ధత ఇలా :
నిఫ్ట్ అడ్మిషన్లో పేర్కొన్న జీఏటీ, సీఏటీ, సిట్యుయేషన్ టెస్టుల్లో రాణించేందుకు ప్రధానంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ :
ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ నుంచి ఉంటాయి. కాబట్టి ఇందులో మంచి స్కోర్ చేసేందుకు వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి.
కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ :
ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా మంచి స్కోర్ సాధించే వీలుంది.
అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ :
విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి నిర్దిష్టంగా ఆయా టాపిక్కు సంబంధించిన కీలకాంశాలపై ఫోకస్ చేయడంతోపాటు,వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ :
ఈ విభాగంలో రాణించేందుకు హైస్కూల్ స్థాయి సోషల్ స్టడీస్‌ను చదువుకోవాలి. అలాగే ముఖ్యమైన తేదీలు-సందర్భాలు వంటి వాటిపైనా దృష్టిపెట్టాలి. తాజా పరిణామాలపైనా అవగాహన పెంచుకోవాలి.
కేస్ స్టడీ :
బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సు అభ్యర్థులకు నిర్వహించే పరీక్ష.. కేస్ స్టడీ. ఇది కొంత వినూత్నంగా ఉంటుంది. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి దానికి పరిష్కారం చూపమంటారు. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు వాస్తవ అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం తప్పనిసరి.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: అక్టోబర్ 23, 2019-డిసెంబర్ 31, 2019
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: జనవరి 10, 2020
రాత పరీక్ష తేది: జనవరి 19, 2020
ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి, మార్చి 2020
సిట్యుయేషన్ టెస్ట్/గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ: ఏప్రిల్- మే 2020
తుది ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్: మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం.
తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nift.ac.in

- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్
- బ్యాచిలర్ ఆఫ్ లెదర్ డిజైన్
- బ్యాచిలర్ ఆఫ్ యాక్ససరీ డిజైన్
- బ్యాచిలర్ ఆఫ్ టెక్స్టైల్ డిజైన్
- బ్యాచిలర్ ఆఫ్ నిట్వేర్ డిజైన్
- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ :
బ్యాచిలర్ స్థాయిలో.. ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(బీ ఎఫ్ టెక్). ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ ప్రోగ్రామ్‌లు :
- పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) స్థాయిలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు.. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.
- బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత (లేదా) నిఫ్ట్/నిడ్ నుంచి డిప్లొమా (లేదా) అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు.. డిజైన్, ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఊ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుకు బీటెక్ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు.
మూడంచెల ఎంపిక ప్రక్రియ :
నిఫ్ట్-అడ్మిషన్ ప్రక్రియ మూడంచెల్లో జరుగుతుంది. తొలిదశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్; జనరల్ ఎబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఆ తర్వాత దశలో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ నిర్వహించి.. ప్రతిభ చూపిన విద్యార్థులకు సీటు ఖరారు చేస్తారు.
తొలిదశ జీఏటీ :
తొలిదశలో జీఏటీ(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ని బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులు ఇద్దరికీ నిర్వహిస్తారు. ప్రశ్నల క్లిష్టత మాస్టర్ కోర్సుల్లో కొంత ఎక్కువగా ఉంటుంది. జీఏటీలో పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; అనలిటికల్ ఎబిలిటీ; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
కోర్సు | పేపర్ | ప్రశ్నలు | సమయం |
బీడిజైన్ | జీఏటీ | 100 | 2 గంటలు |
ఎండిజైన్ | జీఏటీ | 120 | 2 గంటలు |
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్‌లో ఆయా విభాగాల నుంచి అడిగే ప్రశ్నల సంఖ్య..
విభాగం | బీడిజైన్ ప్రశ్నల సంఖ్య | ఎండిజైన్ ప్రశ్నల సంఖ్య |
క్యాంటిటేటివ్ ఎబిలిటీ | 20 | 20 |
కమ్యూనికేషన్ ఎబిలిటీ | 25 | 30 |
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ | 25 | 30 |
అనలిటికల్ ఎబిలిటీ | 15 | 25 |
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ | 15 | 15 |
మొత్తం ప్రశ్నలు | 100 | 120 |
ఆ కోర్సులకు ప్రత్యేకంగా జీఏటీ :
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీని మరింత ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఇందులో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా బీ ఎఫ్టెక్, ఎం ఎఫ్టెక్లకు సంబంధించిన జీఏటీ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి.
రెండో దశ.. సీఏటీ :
నిఫ్ట్ ప్రవేశాల ప్రక్రియలో రెండో దశ పరీక్ష.. సీఏటీ (క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్). అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా సీఏటీ ఉంటుంది.
మూడో దశ.. సిట్యుయేషన్ టెస్ట్ :
సిట్యుయేషన్ టెస్ట్ పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఉంటుంది. అభ్యర్థుల సృజనాత్మకతను పరీక్షించేలా ఈ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని అడుగుతారు. (లేదా) ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని.. దానికి తగ్గట్టు ఊహా చిత్రం గీయమంటారు.
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ :
నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్లోని తొలి మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. భావ వ్యక్తీకరణ సామర్థ్యం, ఆయా అంశాలపై స్పష్టత, పరిజ్ఞానం, ఆలోచన సామర్థ్యాలను పరీక్షించే విధంగా గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రధానం ఉద్దేశం.. ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తిని పరిశీలించడం. ఇందులోనూ విజయం సాధిస్తే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు.
సన్నద్ధత ఇలా :
నిఫ్ట్ అడ్మిషన్లో పేర్కొన్న జీఏటీ, సీఏటీ, సిట్యుయేషన్ టెస్టుల్లో రాణించేందుకు ప్రధానంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ :
ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ నుంచి ఉంటాయి. కాబట్టి ఇందులో మంచి స్కోర్ చేసేందుకు వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి.
కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ :
ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా మంచి స్కోర్ సాధించే వీలుంది.
అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ :
విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి నిర్దిష్టంగా ఆయా టాపిక్కు సంబంధించిన కీలకాంశాలపై ఫోకస్ చేయడంతోపాటు,వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ :
ఈ విభాగంలో రాణించేందుకు హైస్కూల్ స్థాయి సోషల్ స్టడీస్‌ను చదువుకోవాలి. అలాగే ముఖ్యమైన తేదీలు-సందర్భాలు వంటి వాటిపైనా దృష్టిపెట్టాలి. తాజా పరిణామాలపైనా అవగాహన పెంచుకోవాలి.
కేస్ స్టడీ :
బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సు అభ్యర్థులకు నిర్వహించే పరీక్ష.. కేస్ స్టడీ. ఇది కొంత వినూత్నంగా ఉంటుంది. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి దానికి పరిష్కారం చూపమంటారు. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు వాస్తవ అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం తప్పనిసరి.
ట్రెండీగా ఉండాలి.. ఫ్యాషన్ టెక్నాలజీ రంగం విస్తృతం అవుతోంది. వీటికి సంబంధించిన కోర్సులు పూర్తి చేసిన వారికి భవిష్యత్‌లో ఉజ్వల అవకాశాలు అందుబాటులో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నిఫ్ట్ క్యాంపస్‌ల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే.. సృజనాత్మకత, ఫ్యాషన్ ట్రెండ్స్‌పై నిరంతర అవగాహన అవసరం. కేవలం ఉద్యోగం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసమే చేరితే ఆశించిన స్థాయిలో రాణించలేరు. - ప్రొ.వి.శివలింగం, ఇంచార్జ్ క్యాంపస్ డెరైక్టర్, నిఫ్ట్, హైదరాబాద్. |
ముఖ్య తేదీలు :
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: అక్టోబర్ 23, 2019-డిసెంబర్ 31, 2019
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: జనవరి 10, 2020
రాత పరీక్ష తేది: జనవరి 19, 2020
ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి, మార్చి 2020
సిట్యుయేషన్ టెస్ట్/గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ: ఏప్రిల్- మే 2020
తుది ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్: మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం.
తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nift.ac.in
Published date : 14 Nov 2019 06:15PM