Skip to main content

ఒకే పరీక్షతో తెలంగాణలోని ఏడు యూనివర్సిటీల్లో ప్రవేశం పొందొచ్చు..

తెలంగాణలోని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), ఇంటిగ్రేటెడ్ పోస్టు గ్రాడ్యుయేషన్ (ఇంటిగ్రేటెడ్ పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్ (సీపీజీఈటీ)-2020కు నోటిఫికేషన్ విడుదలైంది.

 ఈ నేపథ్యంలో.. సీపీజీఈటీ ద్వారా ప్రవేశం కల్పించే కోర్సులు, అర్హతలు, పరీక్ష విధానం 

 తదితర వివరాలు...

  1.  ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలు..
  2.     ఉస్మానియా విశ్వవిద్యాలయం
  3.     కాకతీయ విశ్వవిద్యాలయం
  4.     తెలంగాణ విశ్వవిద్యాలయం
  5.     మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
  6.     పాలమూరు విశ్వవిద్యాలయం
  7.     శాతవాహన విశ్వవిద్యాలయం
  8.     జేఎన్‌టీయూహెచ్.

కోర్సులు..

  1.     సైన్స్: ఎంఎస్సీ-బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, జియోఇన్ఫర్మాటిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైకాలజీ. 
  2.     ఆర్ట్స్: ఎంఏ-ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ (ఏఐహెచ్‌సీఏ), అరబిక్, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మరాఠి, పర్షియన్, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్.
  3.     సోషల్ సెన్సైస్: ఎంఏ-ఎకనామిక్స్, జనరల్ స్టడీస్, హిస్టరీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(రెండేళ్లు)/బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(సంవత్సరం), మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(సంవత్సరం), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్(ఎంఎస్‌డబ్ల్యూ), మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఆర్‌ఎం), మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్ (ఎంటీఎం).
  4.     కామర్స్: ఎంకాం
  5.     ఎడ్యుకేషన్: ఎంఈడీ, ఎంపీఈడీ.
  6.     పీజీ డిప్లొమా కోర్సులు: చైల్డ్ సైకాలజీ, జియోగ్రాఫికల్ కార్టోగ్రఫీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, సెరికల్చర్.
  7.     ఇంటిగ్రేటెడ్ కోర్సులు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎంబీఏ.

  అర్హతలు..

  1.     పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ఎంఈడీ కోర్సుకు బీఈడీలో 55 శాతం, ఎంపీఈడీ కోర్సుకు బీపీఈడీ లేదా బీపీఈ కోర్సుకు 55 శాతం ఉత్తీర్ణత ఉండాలి. వీటికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
  2.     పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ కోర్సుకు డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు; పీజీ డిప్లొమా ఇన్ జియోగ్రాఫికల్ కార్టోగ్రఫీ కోర్సుకు బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ, ఐదేళ్ల డిప్లొమా ఇన్ ఫైనార్ట్స్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు; పీజీ డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సెలింగ్ కోర్సుకు బీఏ సైకాలజీ, బీఈడీ, డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ, బీఏస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోర్సుల విద్యార్థులు; పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సెరికల్చర్ కోర్సుకు బీఎస్సీ(బీజెడ్‌సీ) విద్యార్థులు అర్హులు. 
  3.     ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు (ఎంపీసీ/బీపీసీ/ఎంబీపీసీ గ్రూపులు) ఉత్తీర్ణులు, ఎంఏ అప్లయిడ్ కెమిస్ట్రీ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకు ఇంటర్ లేదా తత్సమాన గ్రూపు విద్యార్థులు అర్హులు. 

ఇంకా చ‌ద‌వండి: part 2: తెలంగాణలో ఏడు యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పించే పరీక్ష.. సీపీజీఈటీ విధానం ఇదీ!

Published date : 30 Sep 2020 06:00PM

Photo Stories