మోడ్రన్ వర్క్‌ప్లేస్...ఆధునిక నైపుణ్యాలు
Sakshi Education
ఆఫీసు వాతావరణం రోజురోజుకూ మారిపోతోంది. టెక్నికల్, డిజిటల్ పరంగా వస్తున్న మార్పులతో సాంకేతిక సొబగులు అద్దుకుని మోడ్రన్‌వర్క్ ప్లేస్‌గా రూపాంతరం చెందుతోంది.
అందుకే ఇప్పుడు కెరీర్‌లో స్థిరపడేందుకు విభిన్నమైన జాబ్‌స్కిల్స్ అవసరం ఏర్పడుతోంది. సాంకేతికంగా వస్తున్న మార్పులను గమనిస్తూ.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయితేనే కోరుకున్న జాబ్‌లో స్థిరపడగలం. ఈ నేపథ్యంలో మోడ్రన్ వర్క్‌ప్లేస్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం...
అందరితో కలసి పనిచేయగలగడం మోడ్రన్ వర్క్ ప్లేస్‌కి సంబంధించిన కీలక నైపుణ్యం. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం.. నలుగురిలో బెరుకు లేకుండా మాట్లాడటం.. బృంద వాతావరణంలో పనిచేయడం.. క్లయింట్లను మెప్పించడం.. నెగోషియేషన్ స్కిల్స్‌ను ప్రదర్శించడం.. అలాగే ఎదుటివారిని ఆకట్టుకోవడానికి అవసరమైన లక్షణాలు, చాతుర్యం, సామర్థ్యం కలిగి ఉండటం.. పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవడం.. విశాల దృక్పథం వంటివి పీపుల్ మేనేజ్‌మెంట్ కిందకు వస్తాయి. ఆఫీసు వ్యవహారాలను చక్కదిద్దడం, క్లయింట్స్, సహోద్యోగులు తదితరులతో చర్చించడానికి ఈ నైపుణ్యాలు ఎంతో అవసరం.
భావోద్వేగ నియంత్రణ :
సంస్థలు ప్రాధాన్యమిస్తున్న మరో ముఖ్య నైపుణ్యం.. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. లక్ష్య సాధనలో విజయం సాధించాలంటే.. ప్రజ్ఞా గుణకం (ఐక్యూ) చాలా ముఖ్యం. దీంతోపాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. వ్యక్తిగత భావోద్వేగాలతో పాటు చుట్టూ ఉన్నవారి భావోద్వేగాలను గుర్తించే సామర్థ్యం చాలా అవసరం. మనవైపు నుంచి ఏదైనా పొర పాటు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం.. టీంలో వర్క్ పరంగా సహోద్యోగులు, సిబ్బంది చేసే పొరపాట్లను సున్నితంగా తెలియజేయడం.. ఎప్పటికప్పుడు తమను తాము ఆత్మావలోకనం చేసుకోవడం.. క్లిష్ట విషయాలు, చేదు నిజాలను ఓపిగ్గా వినగలగడం.. వంటివి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి.
సత్వర నిర్ణయ సామర్థ్యం :
ఇది ప్రస్తుత సంక్లిష్ట ఆధునిక వర్క్‌ప్లేస్‌ని ప్రభావితం చేసే మరో కీలకాంశం. వేగంగా ఆలోచించడం, సత్వర నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీగా ఉండటం, సమస్యకు అత్యుత్తమ పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడం వంటివి ఈ స్కిల్స్ పరిధిలోకి వస్తాయి. నేటి సాంకేతిక యుగంలో రాణించాలంటే.. ఈ స్కిల్స్ తప్పనిసరి.
రిస్క్ టేకింగ్ :
చాలామంది ఓటమి భయంతో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కెరీర్‌లో పైకి రావాలంటే.. కొత్త బాధ్యతలు, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఓటమి ఓ గుణపాఠాన్ని నేర్పుతుందని గుర్తుంచుకోవాలి. ఉన్నత శిఖరాలను చేరే క్రమంలో ఓటమిని ఎంతో విలువైన అనుభవంగా మలచుకోవాలి.
సేవా దృక్పథం :
చాలా సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)పై దృష్టిసారిస్తున్నాయి.ముఖ్యంగా ప్రకృతిని నేరుగా ప్రభావితం చేసే మైనింగ్, తయారీ, విద్యుదుత్పత్తి తదితర రంగాలకు చెందిన చాలా సంస్థలు ఇందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి అనుగుణంగా తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సేవాదృక్పథం ఉండాలని భావిస్తున్నాయి. సర్వీస్ ఓరియెంటేషన్ అనేది వ్యక్తిగత వ్యవహారం కాదు.. సమష్టిగా, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే సంస్థ ఆశించిన ఫలితాలు వస్తాయి.
కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ :
రాబోయే కాలంలో ఉద్యోగార్థుల నుంచి సంస్థలు ఆశించే నైపుణ్యాల్లో అత్యంత కీలకమైంది.. కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ. ఏకకాలంలో అనేక అంశాల గురించి ఆలోచించే సామర్థ్యాన్ని కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఫలితాలను సాధించే క్రమంలో వినియోగించే వివిధ పద్ధతులు, నియమాలను సమ్మిళితం చేసే సామర్థ్యానికి ఇది ప్రతీక. కొత్త ఆలోచనలు, విధానాలు, వ్యవస్థ, మెటీరియల్స్, డేటా వంటి వాటిని సమ్మిళితం చేయడంలో ఈ నైపుణ్యం కీలకపాత్ర పోషిస్తుంది.
సాంస్కృతిక భిన్నత్వం :
ప్రస్తుతం మన దేశంతో సహా అన్ని దేశాల్లో ఎంఎన్‌సీల హవా నడుస్తోంది. వీటిలో స్వదేశీయులతోనే కాకుండా.. వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు, విభిన్న సంస్కృతులు, పరిస్థితులు, విభిన్న పనివేళల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసేచోట అందరితో కలిసిపోవాలంటే.. సాంస్కృతిక భిన్నత్వాన్ని అర్థం చేసుకోవడం ప్రధానం. ఇందుకోసం సహచర ఉద్యోగులతో కలుపుగోలుగా ఉండటం, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా వ్యవహరించడం, అందరి ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకుసాగడం చాలా ముఖ్యం!!

Published date : 10 Apr 2018 02:16PM