మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్.. ఎంపికైతే నెలకు రూ.60 వేల వరకూ స్టయిపెండ్..
ఇది దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐఎంలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్) అందించే సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్!! రెండేళ్ల ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన విద్యార్థులు.. గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా స్థాయిలో జీవనోపాధి, ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతిని పెంచడంలో ఎదురవుతున్న సమస్యలను, ఆటంకాలను గుర్తించి, పరిష్కరించే మార్గాలపై అవగాహన పొందుతారు..
ఎంజీఎన్‌ఎఫ్ అనేది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు అందించే పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. దీనిని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రిన్యూర్‌షిప్ (ఎంఎస్‌డీఈ) కలిసి రూపొందించాయి. ఐఐఎం బెంగళూర్, కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖతో కలిసి మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని తొమ్మిది ఐఐఎంలు (ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం జమ్మూ, ఐఐఎం కోజికోడ్, ఐఐఎం లఖ్‌నవూ, ఐఐఎం నాగ్‌పూర్, ఐఐఎం రాంచీ, ఐఐఎం ఉదయ్‌పూర్, ఐఐఎం విశాఖపట్నం) ఈ ఫెలోషిప్ అవకాశం కల్పిస్తున్నాయి. ఐఐఎం బెంగళూర్.. ఉమ్మడి ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తుంది.
ఫెలోషిప్ లక్ష్యం..
మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ ముఖ్య లక్ష్యం.. జిల్లాల స్థాయి ఆర్థిక వ్యవస్థలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉపాధి కల్పనకు దోహ దపడటం. ఫెలోషిప్‌లో భాగంగా తరగతి గది బోధనతోపాటు జిల్లా స్థాయిలో క్షేత్ర పర్యటనలూ ఉంటాయి. ఇందులో భాగంగా విద్యార్థులు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది.
స్టయిపెండ్..
ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మొదటి ఏడాది నెలకు రూ.50,000,రెండో ఏడాది నెలకు రూ.60,000 చొప్పున స్టయిపెండ్ అందిస్తోంది.
అర్హతలు..
- పభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో(ఇంజనీరింగ్, లా, మెడిసిన్, సోషల్ సెన్సైస్ తదితరాలు) గ్రాడ్యు యేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సామాజిక/లాభపేక్ష లేని రంగాల్లో మూడేళ్ల పాటు పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. సంబంధిత స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ ఉండాలి.
- వయసు కనిష్టంగా 21 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇంకా చదవండి: part 2: రూ.60వేల వరకూ స్టయిపెండ్ అందించే మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్.. విధానం ఇలా..