కరోనా కాలంలోనూ ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సులివే..
Sakshi Education
గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. ఇందుకు జాబ్‌మార్కెట్ సైతం అతీతం కాదు. అనేక రంగాల్లో కొలువుల కోతలు సర్వసాధారణమయ్యాయి.
ఇటువంటి పరిస్థితుల్లో సైతం కొన్ని స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చాయి. మరి అలాంటి భరోసానిచ్చే ప్రత్యేక నైపుణ్యాలు.. జాబ్ మార్కెట్‌లో డిమాండ్ నెలకొన్న ప్రత్యేక కోర్సుల గురించి తెలుసుకుందాం...
డేటా సైన్స్..
డేటా సైన్స్.. దీన్నే డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అని కూడా పిలుస్తారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనావేసి.. కచ్చితత్వంతో కూడిన గణాంక సహిత సమాచారాన్ని అందిస్తుంది డేటాసైన్స్. ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా.. విద్య,వైద్య,వ్యాపార,సామాజిక, ఆర్థిక, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పుడు డేటా సైన్స్ దూసుకుపోతుంది. ప్రస్తుత ఏ విభాగం తీసుకున్నా.. డేటా భారీగా ఉత్పత్తి అవుతోంది. వ్యాపారం, ఇతర సేవల విభాగాల్లోని కంపెనీలకు అవసరమైన డేటాను సేకరించడం, విశ్లేషించడం కొంత కష్టంగా మారుతోంది. ఇందుకోసమే ఆయా సంస్థలు డేటాసైన్స్ నిపుణుల సేవలను వినియోగించుకుంటున్నాయి. మన దేశంలో డేటాసైన్స్ నిపుణులకు భారీగా డిమాండ్ నెలకొంది. ఈ రంగలో ప్రవేశించాలనుకునే వారు డేటాసైన్స్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా.. సదరు నైపుణ్యాలను పెంపొందించుకొని..ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ..
డిజిటల్ విప్లవం కారణంగా అన్ని రంగాల్లో సమూల మార్పులు వస్తున్నాయి. ఇంట్లో ఉండే అన్నిరకాల పనులు చక్కబెట్టే విధంగా టెక్నాలజీ మార్పులను తీసుకొచ్చింది. కంప్యూటర్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ డివైజ్‌ల సహాయంతో ఇంటర్నెట్ ఆధారంగా జరిగే కార్యకలాపాల విస్తృతి బాగా పెరిగింది. ఇదే సమయంలో ఆన్‌లైన్ ఆధారిత మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. భారీగా తయారయ్యే వ్యాపార, వ్యక్తిగత సమాచారానికి సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉంది. అందుకే వీటి నుంచి రక్షించుకోవడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఈ కోర్సును పూర్తిచేసిన వారికి ఇప్పుడే కాకుండా.. భవిష్యత్తులో సైతం మంచి డిమాండ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సంబంధిత కోర్సులను పూర్తి చేసిన వారికి రాబోయే రోజుల్లో అవకాశాలకు కొదవుండదని చెప్పొచ్చు.
డెవప్స్ ఇంజనీరింగ్..
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెట్, ఐటీ ఆపరేషన్స్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి డెవప్స్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది. డెవలపర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, ప్రోగ్రామర్లు అందరూ.. ఒకే ప్రొడక్ట్‌పై పనిచేసినా.. వినియోగదారుల అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని వారు పంచుకోరు. ఇలాంటి సందర్భంలో వారందరి మధ్య సమాచార అంతరాన్ని తగ్గించి.. సంబంధిత పనిని మంచి వాతావరణంలో పూర్తిచేయించడానికి డెవప్స్ ఇంజనీర్లు దోహదపడతారు. ప్రస్తుత వీరికి మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉంది.
డిజిటల్ మార్కెటింగ్..
గత కొన్నేళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న నైపుణ్యాల్లో.. డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. భవిష్యత్తులో ఆన్‌లైన్ వేదికగా మార్కెట్ విస్తృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి వ్యాపార సంస్థ డిజిటల్æమార్కెటింగ్ విధానాలను అవలంభిస్తోంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సేల్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం డిజిటల్ మార్కెట్ నిపుణులను నియమించుకుంటోంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో సంబంధిత కోర్సులను పూర్తిచేసుకుంటే.. కెరీర్ పరంగా భవిష్యత్తులో మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
ఆర్‌పీఏ..
ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, సమాచార నిర్వహణ,ఈమెయిల్స్‌కు సమాధానాలు పంపడం వంటివి వేగవంతంగా పూర్తి చేయడానికి ఉపయోగించేదే.. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్‌పీఏ). వివిధ సంస్థలు రోజువారి కార్యకలాపాల్లో భాగంగా ఆన్‌లైన్ వేదికగా వచ్చే వేలకొద్దీ దరఖాస్తులను పరిశీలించి.. సమాధానాలు ఇవ్వాలంటే.. చాలా రోజులు పడుతుంది. ఇటువంటి వాటిని పరిశీలించి త్వరగా వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రస్తుతం ఆర్‌పీఏను ఉపయోగిస్తున్నారు. ఆర్‌పీఏ టూల్స్ సహాయంతో ఇలాంటి పనులను త్వరితగతిన పూర్తి చేయడం సాధ్యమవుతుంది. దీంట్లో నైపుణ్యం సాధిస్తే డెవలప్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్ వంటి అవకాశాలను పొందవచ్చు.

Published date : 29 Mar 2021 02:16PM