Skip to main content

కొవిడ్ పరిస్థితిలో భారత్ వైపు చూస్తున్న విదేశీ ఇన్‌స్టిట్యూట్స్..!

ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఇతర దేశాలకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌లు భారత్ వైపు దృష్టిసారిస్తున్నాయి. దీనికి రెండు అంశాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అవి..
 
  • ఒకటి, ఆయా దేశాలకు ఆర్థిక పురోగతి పరంగా విద్యా రంగానిది కీలక పాత్ర కావడం.
  • రెండోది, ప్రపంచ దేశాల్లోని అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలవడం(చైనాది మొదటి స్థానం). 
  • అధికారిక గణాంకాల ప్రకారం-2019లో అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కలిపి 10.9 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. దీంతో విదేశాలకు చెందిన యూనివర్సిటీలు భారత్‌వైపు దృష్టిసారించి.. వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్‌ను విస్తృతంగా నిర్వహిస్తున్నాయి.

  విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • ఆయా ఫారిన్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్‌కు వస్తున్న యూనివర్సిటీల గురించి లోతుగా తెలుసుకోవాలి. 
  • కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెసర్లు, డీన్‌లను ఫెయిర్స్‌లో పాల్గొనేలా చేస్తుంటే.. మరికొన్ని యూనివర్సిటీలు కౌన్సెలర్స్‌తో వీటిని నిర్వహిస్తున్నాయి. కాబట్టి ప్రొఫెసర్లు, డీన్స్ ఉండే యూనివర్సిటీలకు హాజరు కావడం మేలు.
  • ఆయా యూనివర్సిటీల ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కరిక్యులమ్‌ను పరిశీలించాలి.  ఎ సదరు యూనివర్సిటీకి ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిన సమయంలో వీసా మంజూరుకు సహకరిస్తారో లేదో స్పష్టత పొందాలి.  ఎ ఇప్పటికే ఆయా యూనివర్సిటీల్లో చదువుతున్న మన దేశ విద్యార్థులతో సంప్రదించడం ఉపయుక్తం.

 (ఇంకా చదవండి: part 6: విదేశీ విద్య వర్చువల్ ప్రవేశాలపై అప్రమత్తంగా  వ్యవహరించాలి.. !!)

Published date : 03 Oct 2020 05:02PM

Photo Stories