కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ప్రముఖ ఐటీ సంస్థల శిక్షణ.. వీటితో వచ్చే లాభాలివే..
మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇంటెల్, హెచ్‌పీ, ఒరాకిల్ వంటి కంపెనీలు ఆన్‌లైన్ శిక్షణతోపాటు సర్టిఫికేషన్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులపై శిక్షణ ఇస్తున్నాయి. విద్యార్థులు వీటికి హాజరవడం ద్వారా బీటెక్ పూర్తిచేసే నాటికి కోడింగ్‌లో నిష్ణాతులుగా మారే అవకాశం ఉంటుంది.
ఇండస్ట్రీ 4.0 స్కిల్స్..
బీటెక్ విద్యార్థులు.. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొనే నైపుణ్యాల సాధనకు కూడా కృషి చేయాలి. ప్రధానంగా ఏఐ,ఎంఎల్, ఐఓటీ, రోబోటిక్స్, 3–డి డిజైన్, డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీపై పట్టు సాధించేలా అకడమిక్ స్థాయి నుంచే అడుగులు వేయాలి. ఇప్పుడు ఏ రంగంలో చూసినా డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. దాంతో ఈ లేటెస్ట్ స్కిల్స్ అత్యంత ఆవశ్యకంగా నిలుస్తున్నాయి. వీటిని అందుకునేందుకు కూడా పలు ఆన్‌లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి విద్యార్థులు అటు ల్యాబ్ వర్క్, ఇటు కోడింగ్ స్కిల్స్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో కృషిచేస్తూ.. మొదటి సంవత్సరం నుంచే అడుగులు వేస్తే ఉజ్వల భవిష్యత్‌ను సొంతం చేసుకోవచ్చు.
ల్యాబ్స్ వర్క్, కోడింగ్ స్కిల్స్.. ముఖ్యాంశాలు
- ప్రాక్టికల్ నాలెడ్జ్, అప్లికేషన్ అప్రోచ్, డెసిషన్ మేకింగ్,క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలకు మార్గంగా ల్యాబ్ వర్క్.
- వర్చువల్ ల్యాబ్స్ ద్వారా లేటెస్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకునే అవకాశం.
- ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయాన్ని ల్యాబ్ వర్క్‌కు కేటాయించాలనే నిబంధన. దీనికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
- కోడింగ్ స్కిల్స్‌పై పట్టు సాధించేందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై దృష్టి.
- నేర్చుకునేందుకు ఉచితంగా పలు మూక్స్, ఆన్‌లైన్ మార్గాలు.
దూరదృష్టి, ప్రణాళికతో సాధ్యమే..
విద్యార్థులు దూరదృష్టి, నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. ల్యాబ్ వర్క్‌కు, కోడింగ్ వంటి లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకునేందకు అవసరమైన సమయం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు కరిక్యులంకు అదనంగా కొత్త అంశాలు నేర్చుకునేందుకు కృషిచేయాలి. ఇంజనీరింగ్ అంటేనే పూర్తిగా ప్రాక్టికల్ నైపుణ్యాలు కోరుకునే రంగం. కాబట్టి ల్యాబ్ వర్క్‌ను ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా ప్రాక్టికల్ నైపుణ్య సాధనకు కృషి చేయాలి.
– ప్రొఫెసర్ కె.వి.రమణ, జేఎన్‌టీయూకే
ఇంకా చదవండి: part 1: బీటెక్‌లో ప్రాక్టికల్ పరుగులు.. ల్యాబ్ వర్క్‌కు ప్రాధాన్యం..!