జీమ్యాట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే దీనిపై దృష్టి పెట్టాల్సిందే..
Sakshi Education
కొత్తగా ప్రవేశపెట్టి అనలిటికల్ రైటింగ్ అనాలసిస్‌లో స్పెల్లింగ్, గ్రామర్, విరామ చిహ్నాలు వంటి వాటిని కూడా స్కోరుకు పరిగణిస్తారా? అని చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
పరీక్ష రాసేది ఆన్‌లైన్ విధానంలో.. కాబట్టి కొన్ని నిమిషాల సమయం కేటాయించడం ద్వారా ఇలాంటి పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానమైనది టైమ్ మేనేజ్‌మెంట్. మొత్తం వ్యాసం రాసేందుకు 30 నిమిషాల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి నిమిషం ఎంతో విలువైనదిగా భావించాలి. వ్యాసం ప్రారంభించే ముందు ఇచ్చిన అంశాన్ని అర్థం చేసుకునేందుకు కొంత సమయం కేటాయించాలి. ఆ తర్వాత ఎలా రాయాలో ఓ నిర్ణయానికి రావాలి. వ్యాసం రాయడం పూర్తయ్యాక స్పెల్లింగ్, గ్రామర్ పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరగా 5 నిమిషాలు సమయం కేటాయిస్తే సరిపోతుంది.
ఇంకా చదవండి: part 1: ప్రపంచ వ్యాప్తంగా టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్ చదివే అవకాశం కల్పించే ఈ పరీక్ష గురించి తెలుసుకోండిలా..
Published date : 25 Feb 2021 05:59PM