జెట్-2020కు స్టార్ట్.. కెమెరా.. యాక్షన్
Sakshi Education
రంగుల ప్రపంచంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే యువతకు మంచి అవ కాశం.. జెట్ (జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్)-2020. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ), కోల్‌కతా; ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ), పుణెల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
దీని ద్వారా సినిమా, టెలివిజన్ రంగాల్లో దర్శకత్వం, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ సహా వివిధ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరొచ్చు. జెట్-2020కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. కోర్సులు.. దరఖాస్తు విధానం.. ఎంపిక ప్రక్రియ.. సినిమా, టెలివిజన్ : సినిమా, టెలివిజన్.. నేడు మానవ జీవితంతో మమేకమైన సమాచార, వినోద మాధ్యమాలు. ఇవి లేకుండా ఇప్పుడు మనిషి జీవితాన్ని ఊహించడం కష్టమే. వినోదం, సందేశంతోపాటు విలువైన సమాచారం సమాజానికి చేరవేయడంలో సినిమాలు, టీవీ మీడియాకు తిరుగులేదని చెప్పొచ్చు. రంగు రంగుల సినిమా రంగంలో రాణించాలనే తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో అవకాశాలు వెతుక్కుంటూ.. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి మహానగరాల బాట పట్టేవారెందరో! అలాంటి వారికి జెట్ ద్వారా ప్రవేశం లభించే కోర్సులు సినిమా, టెలివిజన్ రంగంలో ఉపాధి పరంగా సరైన మార్గం చూపుతాయని చెప్పొచ్చు. జెట్ స్కోర్ : సినిమా, టెలివిజన్ రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) పుణె; సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ), కోల్‌కతా.. ఏటా జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్(జెట్) నిర్వహిస్తున్నాయి. జెట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా సినిమా, టెలివిజన్‌కు సంబంధించిన వివిధ విభాగాల్లో పలు కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా కోరుకున్న విభాగంలో ఉజ్వల భవిష్యత్‌ను సొంతం చేసుకోవచ్చు. సృజానాత్మకత, ఎప్పటికప్పుడు మారుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉంటే.. సినిమా, టెలివిజన్ రంగంలో దూసుకుపోవచ్చు. అందించే కోర్సులు : పొడ్యూసింగ్ ఫర్ ఫిలిం అండ్ టెలివిజన్, ఆర్ట్ డెరైక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్, స్క్రీన్ యాక్టింగ్, స్క్రీన్ రైటింగ్, డెరైక్షన్ అండ్ స్క్రిన్ ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్, డెరైక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్, డెరైక్షన్,ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా, సౌండ్ రికార్డింగ్ అండ్ టెలివిజన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా మేనేజ్‌మెంట్, రైటింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా విభాగాల్లో రెండు, మూడేళ్ల పీజీ డిప్లోమా, డిప్లొమా కోర్సులను అందిస్తున్నారు.
అర్హతలు..
పరీక్ష ఫీజు :
పరీక్ష విధానం :
దేశ వ్యాప్తంగా మొత్తం 27 నగరాల్లో జెట్-2020ను నిర్వహిస్తారు. పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్(వ్యాస రూపం) రూపంలో ప్రశ్న పత్రం ఉంటుంది. రెండు రోజుల పాటు మూడు సెషన్స్‌లో పరీక్షను నిర్వహిస్తారు.
ఎంపిక ప్రక్రియ :
జెట్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎఫ్‌టీఐఐ,ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలు వేర్వేరుగా తదుపరి దశ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తాయి. కటాఫ్‌కు అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్ డిస్క్రషన్, పర్సనల్ ఇంటర్వూ, మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 24, 2020
అడ్మిట్ కార్డ్: ఫిబ్రవరి 5, 2020
పరీక్ష తేదీలు: 2020, ఫిబ్రవరి 15, 16 తేదీల్లో
ఫలితాలు: 2020, మే 3వ వారంలో
వెబ్‌సైట్స్:
JET website: https://applyadmission.net/jet2020
FTII website: http://ftii.ac.in/
RFTI website: http://srfti.ac.in/
అర్హతలు..
- జెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సౌండ్ రికార్డింగ్, సౌండ్ డిజైన్ కోర్సుకు ఏదైనా డిగ్రీతోపాటు ఇంటర్/10+2 స్థాయిలో ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
- అలాగే ఆర్డ్ డెరైక్షన్, ప్రొడక్షన్ డిజైన్ కోర్సులకు డిగ్రీ స్థాయిలో.. అప్లైడ్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఇంటీరియర్ డిజైన్ లేదా సంబంధిత విభాగంలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు లేదా తత్సమాన డిప్లొమా పూర్తి చేయాలి. డి గ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.
- సౌండ్ రికార్డింగ్, టెలివిజన్ ఇంజనీరింగ్/సౌండ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా కోర్సుకు ఏదైనా డిగ్రీతోపాటు 10+2 స్థాయిలో ఫిజిక్స్ చదివి ఉండాలి.
పరీక్ష ఫీజు :
- ఏదైనా ఒక కోర్సుకు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.4000, రెండు కోర్సులకు దరఖాస్తు చేసుకుంటే రూ.8000, మూడు కోర్సులకు అయితే రూ.10,000 ఫీజుగా చెల్లించాలి
- ఏదైనా ఒక కోర్సుకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1250, రెండు కోర్సులకు దరఖాస్తు రూ.2500, మూడు కోర్సులకు అయితే రూ.3125 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
పరీక్ష విధానం :
దేశ వ్యాప్తంగా మొత్తం 27 నగరాల్లో జెట్-2020ను నిర్వహిస్తారు. పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్(వ్యాస రూపం) రూపంలో ప్రశ్న పత్రం ఉంటుంది. రెండు రోజుల పాటు మూడు సెషన్స్‌లో పరీక్షను నిర్వహిస్తారు.
ఎంపిక ప్రక్రియ :
జెట్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎఫ్‌టీఐఐ,ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలు వేర్వేరుగా తదుపరి దశ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తాయి. కటాఫ్‌కు అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్ డిస్క్రషన్, పర్సనల్ ఇంటర్వూ, మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 24, 2020
అడ్మిట్ కార్డ్: ఫిబ్రవరి 5, 2020
పరీక్ష తేదీలు: 2020, ఫిబ్రవరి 15, 16 తేదీల్లో
ఫలితాలు: 2020, మే 3వ వారంలో
వెబ్‌సైట్స్:
JET website: https://applyadmission.net/jet2020
FTII website: http://ftii.ac.in/
RFTI website: http://srfti.ac.in/
Published date : 18 Dec 2019 11:51AM