జేఈఈ మెయిన్‌లో ఉన్న ఈ నిబంధనపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత..
అంటే.. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించినా.. తర్వాత దశలో నిర్వహించే కౌన్సెలింగ్, సీట్ల భర్తీ విషయంలో 75 శాతం మార్కులతో బోర్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత, లేదా టాప్ 20 పర్సంటైల్‌లో నిలిచిన వారికే సీట్లు కేటాయిస్తారు. దీంతో విద్యార్థులు ఈ నిబంధనలకు సరితూగేలా ఇటు బోర్డ్ పరీక్షల్లో రాణించేందుకు.. అదే సమయంలో జేఈఈ-మెయిన్‌లో స్కోర్ సాధించే క్రమంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
విద్యార్థుల్లో వ్యతిరేకత..
గత సంవత్సర కాలంగా ఆన్‌లైన్ క్లాసులు, వాటిని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు.. 75 శాతం మార్కుల నిబంధనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గతేడాది కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 75 శాతం మార్కుల నిబంధనను తొలగించారు. నిట్‌లు తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో నిర్వాహక వర్గాలు గత ఏడాది 75 పర్సంటేజీ నిబంధనను తొలగించాయి. కానీ.. ఇప్పుడు 2021లో మళ్లీ పాత నిబంధనలను అమల్లోకి తీసుకురావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాలంగా లాక్‌డౌన్, ఆన్‌లైన్ క్లాస్‌ల కారణంగా పాఠాలు సరిగా అర్థం కావడం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో 75శాతం మార్కులు సాధించడం కష్టమేనని విద్యార్థులు, పలువురు సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల ఆన్‌లైన్ క్లాస్‌లే కొనసాగుతున్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని 75 శాతం నిబంధనను ఎత్తేయాలని విద్యార్థులు,తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇంకా తెలుసుకోండి: part 3: ఈ సారికి మాత్రం జేఈఈ మెయిన్ రెండు సార్లే..