జేఈఈ-మెయిన్-2021 జేఈఈకి సన్నద్ధత ఇలా ఉంటే.. విజయం తథ్యం..
Sakshi Education
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌కు సన్నద్ధమవడం మేలు చేస్తుందని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. సబ్జెక్టుల వారీగా దృష్టిసారించాల్సిన అంశాలు...
- మ్యాథమెటిక్స్: ప్రతి చాప్టర్ తప్పనిసరిగా.. అభ్యసించి, అవగాహన పొందాల్సిన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఈ క్రమంలో.. 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్; బైనామి యల్ థీరమ్; లోకస్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి.
- న్యూమరికల్ అప్రోచ్‌తో.. ప్రశ్నలు అడిగే ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో రాణించాలంటే ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి.
- వీటితోపాటు.. సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రిపరేషన్ సమయంలో ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ.. ప్రాక్టీస్ చేస్తే న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది.
- కెమిస్ట్రీ: మిగతా రెండు సబ్జెక్టులతో పోలిస్తే కాస్త సులభంగా ఉండే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇక ఈ సబ్జెక్టు నుంచి నుంచీ న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు అడగనున్నారు. ముఖ్యంగా గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే కెమికల్ బాం డింగ్, పిరియాడిక్ టేబుల్, బ్రేకింగ్‌ల మూలా లపై నైపుణ్యా లను తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసి యస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
ఇంకా తెలుసుకోండి: part 6: ఒత్తిడికి గురి కాకుండా, సమయ పాలన పాటిస్తే.. విజయం సాధించడం కష్టం కాదు..:ఆర్. కేదారేశ్వర్,డెరైక్టర్, విజన్-40 అకాడమీ
Published date : 28 Dec 2020 03:09PM