Skip to main content

ఇంటర్‌తోనే ఎంబీఏకు అవకాశం.. జిప్‌మ్యాట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

మేనేజ్‌మెంట్‌ విద్యకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు.. ఐఐఎంలు! దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ పూర్తిచేస్తే..

కార్పొరేట్‌ కంపెనీల్లో లక్షల ప్యాకేజీలతో ఆఫర్లు!! వీటిల్లో అడుగుపెట్టాలంటే.. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హత తప్పనిసరి. ఆ తర్వాత క్యాట్‌లో మంచి స్కోర్‌తో పాటు మలిదశ ఎంపిక ప్రక్రియలో.. నెగ్గితేనే అవకాశం లభిస్తుంది. కాని ఇప్పుడు దేశంలోని అయిదు ఐఐఎంలు.. ఇంటర్‌ అర్హతతోనే ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి! తాజాగా 2021–26 బ్యాచ్‌కు సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏలో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్‌తోనే ఐఐఎంల్లో ఎంబీఏపై ప్రత్యేక కథనం..

ప్రస్తుతం అయిదు ఐఐఎంలు.. ఇంటర్మీడియెట్‌ అర్హతతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఐఐఎం–ఇండోర్‌లో 150 సీట్లు, ఐఐఎం–రోహ్‌తక్‌లో 160 సీట్లు, ఐఐఎం–రాంచీలో 120 సీట్లు, ఐఐఎం–జమ్ములో 60 సీట్లు, ఐఐఎం–బో«ద్‌గయలో 60సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మూడు ఐఐఎంలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత దశలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ప్రవేశాలు ఖరారు చేస్తున్నాయి. మరో రెండు ఐఐఎంలు.. జమ్మూ, బో«ద్‌గయ మాత్రం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే.. జాయింట్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (జిప్‌మ్యాట్‌)లో ప్రతిభ, మలిదశ ఎంపిక ప్రక్రియ∙ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తున్నాయి.

ఐఐఎం ఇండోర్, రాంచీ..

  • ఐఐఎం ఇండోర్, ఐఐఎం రాంచీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏలో ప్రవేశానికి.. ఐఐఎం ఇండోర్‌ నిర్వహించే ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఐపీఎం ఏటీ)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • 2019, 2020లలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన విద్యార్థులతోపాటు 2021లో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
  • ఐఐఎం రాంచీకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ రెండు కోర్సుల్లోనూ కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
  • ఐపీఎం ఏటీలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ–మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ– షార్ట్‌ ఆన్సర్‌ కొశ్చన్స్, వెర్బల్‌ ఎబిలిటీ–మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. వెర్బల్‌ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు, మిగతా రెండు విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలకు మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ షార్ట్‌ ఆన్సర్‌ కొశ్చన్స్‌ విభాగం మినహా.. మిగతా రెండు విభాగాల్లో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.
  • ఐఐఎం రాంచీ.. ఐపీఎం–ఏటీ స్కోర్‌తోపాటు శాట్‌(స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)లో స్కోర్‌ సాధించిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

మలి దశలో పర్సనల్‌ అసెస్‌మెంట్‌..

  • ఐపీఎం ఏటీలో నిర్ణీత కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థులకు మలి దశలో పర్సనల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పర్సనల్‌ ఇంటర్వూ్య లేదా వీడియో బేస్డ్‌ అసెస్‌మెంట్‌ ఉంటుంది.
  • ఐఐఎం ఇండోర్‌.. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ స్కోర్‌కు 65 శాతం వెయిటేజీ, పర్సనల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌కు 35 శాతం వెయిటేజీ ఇచ్చి.. దాని ఆధారంగా తుది జాబితా రూపొందించి ప్రవేశాలు ఖరారు చేస్తుంది.
  • ఐఐఎం రాంచీ మాత్రం.. మలి దశలో రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వూలను కూడా నిర్వహిస్తోంది. చివరగా ఐపీఎం–ఏటీ, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తోంది.

ఐపీఎం–ఏటీ 2021 సమాచారం..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మార్చి 23 – మే 5, 2021
  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ తేదీ: జులై16, 2021
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.iimidr.ac.in , https://iimranchi.ac.in/p/ipm-admissions-1

జిప్‌మ్యాట్‌.. జమ్ము, బో«ద్‌గయ..
ఇటీవల అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ను ప్రవేశ పెట్టిన ఐఐఎం–జమ్ము, బో«ద్‌గయల్లో అడుగుపెట్టాలంటే.. ఎన్‌టీఏ నిర్వహించే జాయిం ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(జిప్‌మ్యాట్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత రెండు క్యాంపస్‌లు వేర్వేరుగా నిర్వహించే మలి దశ ఎంపిక ప్రక్రియలోనూ ప్రతిభ చూపాల్సి ఉంటుంది.

అర్హతలు..
పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు లభిస్తుంది. 2019, 2020లో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైనవారు, 2021లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా అర్హులే.

పరీక్ష విధానం..

  • జిప్‌మ్యాట్‌ మొత్తం మూడు విభాగాల్లో ఆన్‌లైన్‌ విధానంలోజరుగుతుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 33 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ విభాగంలో 33 ప్రశ్నలు, వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో 34 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం 400 మార్కులకు జిప్‌మ్యాట్‌ను నిర్వహిస్తారు. జిప్‌మ్యాట్‌లో పొందిన స్కోర్‌ ఆధారంగా.. అభ్యర్థులు జమ్ము,బో«ద్‌గయ క్యాంపస్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆ తర్వాత దశలో ఐఐఎం–జమ్ములో జిప్‌మ్యాట్‌ స్కోర్‌కు 60శాతం వెయిటేజీ, పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ మార్కులకు 15శాతం వెయిటేజీ చొప్పున, జండర్‌ ఈక్వాలిటీకి పది శాతం వెయిటేజీ ఇచ్చి.. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేస్తారు.
  • ఐఐఎం–బో«ద్‌గయలో.. జిప్‌మ్యాట్‌ స్కోర్‌కు 70శాతం, పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ మార్కులకు 15 శాతం చొప్పున వెయిటేజీ ఇచ్చి.. వాటిలో ప్రతిభ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఎన్‌టీఏ జిప్‌మ్యాట్‌ సమాచారం..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఏప్రిల్‌ 30, 2021 వరకు;
  • దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు : మే 5, 2021 నుంచి మే 10, 2021;
  • జిప్‌మ్యాట్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 20, 2021;
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nta.ac.in , http://jipmat.nta.ac.in/

ఐఐఎం–రోహ్‌తక్‌లో ఇలా..
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న మరో ఐఐఎం.. రోహ్‌తక్‌ కూడా ప్రత్యేకంగా ఐపీఎం–ఏటీ(ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)ను నిర్వహిస్తోంది. ఈ టెస్ట్‌లో స్కోర్‌ ఆధారంగా నిర్దిష్ట కటాఫ్‌ను అనుసరించి.. మలిదశలో పర్సనల్‌ ఇంటర్వూ్య ఉంటుంది. ఈ రెండింటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందించి ప్రవేశాలు ఖరారు చేస్తారు.

అర్హతలు..
పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ వర్గాలకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది. ఇంటర్మీడియెట్‌ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్ష..
రోహతక్‌ నిర్వహించే ఐపీఎం–ఏటీలో.. క్వాం టిటేటివ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, వెర్బల్‌ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు.

వెయిటేజీ ఆధారంగా ఎంపిక..
రోహ్‌తక్‌ ఐపీఎం–ఏటీలో పొందిన స్కోర్‌ ఆధారంగా.. మలిదశలో పర్సనల్‌ ఇంటర్వూ నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది జాబితా ఎంపికలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏటీ స్కోర్‌కు 45 శాతం, పర్సనల్‌ ఇంటర్వూకు 15 శాతం, పదో తరగతి, ఇంటర్మీడియట్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి.. వాటిలో ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందించి ప్రవేశాలు ఖరారు చేస్తున్నారు.

రోహ్‌తక్‌ ఐపీఎం ఏటీ ముఖ్య సమాచారం..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 4, 2021
  • ఐపీఎం ఏటీ తేదీ: జూన్‌ 19, 2021
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iimrohtak.ac.in/index.php/programmes/ipm/admission

ఇంకా చదవండి: part 2: మేనేజ్‌మెంట్‌ లీడర్లను తీర్చిదిద్దేలా.. నచ్చకపోతే మూడేళ్ల తర్వాత ఎగ్జిట్‌ అయ్యేలా..

Published date : 21 Apr 2021 01:24PM

Photo Stories