Skip to main content

ఇంటర్‌తోనే ఐఐఎంలో ఎంబీఏకు అవకాశం.. జిప్‌మ్యాట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల

ఇంటర్‌ తర్వాత ప్రతిష్టాత్మక సంస్థలో మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం జాయింట్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (జిప్‌మ్యాట్‌)– 2021 ప్రకటన వెలువడింది.

జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఐఐఎం బో«ద్‌గయా, ఐఐఎం జమ్మూలోని క్యాంపస్‌ల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆ«ధ్వర్యంలోని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐపీఎం కోర్సులు..
దేశ వ్యాప్తంగా ఐదు ఐఐఎంలు మాత్రమే ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. 2011లో మొదటగా ఐఐఎం(ఇండోర్‌) ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అనంతరం ఐఐఎం రోహతక్, ఐఐఎం రాంచీ, ఐఐఎం బో«ద్‌గయా, ఐఐఎం జమ్మూలోనూ వీటిని ప్రారంభించారు. ప్రస్తుతం ఐఐఎం ఇండోర్, ఐఐఎం రోహతక్, ఐఐఎం రాంచీలు దేనికదే ప్రత్యేకంగా ఐపీఎం ప్రవేశ ప్రక్రియ నిర్వహించుకుంటున్నాయి. ఐఐఎం బో«ద్‌ గయా, ఐఐఎం జమ్మూ మాత్రం జాతీయ స్థాయిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జిప్‌మ్యాట్‌ నిర్వహించనున్నాయి.

ఐదేళ్ల కోర్సు స్వరూపం..
ఇది మొత్తం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌. దీనిలో భాగంగా మొదటి మూడేళ్లు ఫౌండేషన్‌ కోర్సు బోధిస్తారు. ఆ తర్వాతి రెండేళ్లు మేనేజ్‌మెంట్‌ విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌(పీజీపీ)ఉంటుంది. ఏడాదికి మూడు చొప్పున మొత్తం 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్‌ కాల వ్యవధి మూడు నెలలు. విద్యార్థుల బహుముఖ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా బోధన కొనసాగుతుంది. కోర్సులో భాగంగా విద్యార్థులకు భాషాపరమైన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు వంటి వాటిలో శిక్షణ అందిస్తారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు.. అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌తో కూడిన ఎంబీఏ పట్టా అందుకోవచ్చు.

ఇంటర్‌ అర్హత..
దేశంలో నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ విద్యను అందించడంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లకు మంచి పేరుంది. వీటిలో పీజీ కోర్సులను పూర్తి చేసిన వారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనే లక్షల ప్యాకేజీలతో ఆఫర్స్‌ లభిస్తుంటాయి. ఐఐఎంల విద్యార్థులకు దేశవిదేశాల్లోని ఎంఎన్‌సీలు, కార్పొరేట్‌ కంపెనీలు రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలకడం తెలిసిందే. ఇంతకాలం డిగ్రీ ఉత్తీర్ణులకు మేనేజ్‌మెంట్‌ విద్యలో పీజీపీ/ఎంబీఏ, ఎఫ్‌పీఎం(ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌)/పీహెచ్‌డీ అందిస్తూ వస్తున్న ఐఐఎంలు.. ఇటీవల కాలంలో ఇంటర్‌ అర్హతతోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అర్హతలు..
జిప్‌మ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు..ఆర్ట్స్‌/కామర్స్‌/సైన్స్‌ విభాగాల్లో 60శాతం(ఎస్సీ, ఎస్టీలు 55శాతం) మార్కులతో ఇంటర్‌/10+2 ఉత్తీర్ణులై ఉండాలి. 2019/2020లో ఇంటర్మీడియట్‌/తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు 2021లో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరయ్యే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ..

  • టెన్త్, ఇంటర్‌ అకడమిక్‌ మెరిట్, జిప్‌మ్యాట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
  • ఐఐఎం జమ్మూ వెయిటేజీ: జిప్‌మ్యాట్‌–60శాతం, పదో తరగతి మార్కులు–15 శాతం, ఇంటర్‌(10+2) మార్కులకు–15శాతం, జెండర్‌ డైవర్సిటీ బాలికలకు–10శాతం, (బాలురకు–0శాతం)వెయిటేజీ ఉంటుంది.
  • ఐఐఎం బోధగయా వెయిటేజీ: జిప్‌మ్యాట్‌–70 శాతం, పదో తరగతి మార్కులకు–15, ఇంటర్‌ (10+2) మార్కులకు–15శాతం వెయిటేజీ ఉంటుంది.

పరీక్షా విధానం..
జిప్‌మ్యాట్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో మల్టిఫుల్‌ చాయిస్‌ పద్ధతిలో 100 ప్రశ్నలు–400 మార్కులకు నిర్వహిస్తారు. క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ (33 ప్రశ్నలు), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌(33 ప్రశ్నలు), వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌(34 ప్రశ్నలు) విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పన కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పన కోతను వి«ధిస్తారు. రెండున్నర గంటల (150 నిమిషాల) కాలవ్యవధిలో ఇంగ్లిష్‌ మా«ధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం..

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.04.2021
  • జిప్‌మ్యాట్‌ పరీక్ష తేదీ: 20.06.2021 (ఆదివారం)
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jipmat.nta.ac.in/
Published date : 09 Apr 2021 04:56PM

Photo Stories