ఇంజనీరింగ్‌లో ఈ కొత్త కోర్సు చేస్తే నెలకు రూ.50వేల వరకు సంపాదించే అవకాశం..!
Sakshi Education
ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి.. బయోమెడికల్ ఇంజనీరింగ్.ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది.
అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్‌ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు.
- కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్‌లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను తయారు చేసేదే.. బయోమెడికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందుకు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా.
- జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజనీర్, బయో కెమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తారు.
- ఉద్యోగాలు: మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్‌స్ట్రుమెంట్ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్‌స్టాలెషన్ యూనిట్‌లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
- వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది.
Published date : 17 Nov 2020 04:52PM