Skip to main content

గేట్, ఈఎస్‌ఈ.. పరీక్షల విధానం ఇలా..

గేట్ పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులు ఈఎస్‌ఈ మెయిన్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగిస్తే ప్రిలిమ్స్, మెయిన్ రెండిటికీ సన్నద్ధత పొందొచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి.. పూర్తి సమయాన్ని ప్రిలిమ్స్‌కే కేటాయించాలి.
ప్రిలిమ్స్ తర్వాత మెయిన్‌కు సాధారణంగా ఆరు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో మెయిన్‌పై దృష్టిపెట్టాలి. మెయిన్ ప్రిపరేషన్ క్రమంలో కన్వెన్షనల్ ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానం ఇచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఈ తరహా ప్రశ్నలకు రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలి.

ఈఎస్‌ఈ పరీక్ష స్వరూపం..
పిలిమినరీ/స్టేజ్-1 ఎగ్జామ్:
పేపర్-1: జనరల్ స్టడీస్; మార్కులు- 200
పేపర్-2: సబ్జెక్ట్ పేపర్; మార్కులు- 300

మెయిన్ ఎగ్జామినేషన్/స్టేజ్-2
పేపర్-1: సబ్జెక్ట్ పేపర్-1: మార్కులు - 300
పేపర్-2: సబ్జెక్ట్ పేపర్-2: మార్కులు - 300

పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)/స్టేజ్-3; మార్కులు - 200

గేట్ పరీక్ష స్వరూపం..
  • జనరల్ ఆప్టిట్యూడ్ - 15 మార్కులు
  • ఇంజనీరింగ్ మ్యాథ్స్, సబ్జెక్ట్ కొశ్చన్స్ - 85 మార్కులు
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్(ఈఎస్‌ఈ)-2021 షెడ్యూల్
  • ప్రిలిమినరీ పరీక్ష నోటిఫికేషన్: ఏప్రిల్ 7, 2021
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2021
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూలై 18, 2021
  • మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: అక్టోబర్ 10, 2021
గేట్-2021 షెడ్యూల్..
  • పరీక్ష తేదీలు: 2021 ఫిబ్రవరి 5, 6, 7, 12, 13, 14 తేదీల్లో రోజుకు రెండు సెషన్లు
  • ఆన్‌లైన్ అడ్మిట్ కార్డ్ సదుపాయం: జనవరి 21, 2021 నుంచి.
ఇంకా చదవండి: part 6: బేసిక్స్ + ప్రాక్టీస్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగిస్తే విజయం సులువే..
Published date : 19 Nov 2020 05:19PM

Photo Stories