ఎయిమ్స్ న్యూఢిల్లీలో పీజీ ప్రవేశాలకు ఐఎన్‌ఐ సెట్–2021 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..
Sakshi Education
దేశంలోని వైద్య విద్యా సంస్థల్లో ప్రముఖమైన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), న్యూఢిల్లీ.. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్’ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఐ–సెట్) నిర్వహించనుంది. జూలై సెషన్ కోసం నిర్వహిస్తున్న ఈ ఎంట్రన్స్ టెస్ట్‌కు ఆసక్తి గల మెడికల్ గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐఎన్‌ఐ సెట్ పూర్తి వివరాలు...
ఐఎన్‌ఐ సెట్ అంటే..
ఎయిమ్స్‌తోపాటు పీజీఐఎంఈఆర్, జిప్‌మర్ పీజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ వంటి దాదాపు పది ప్రముఖ మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎండీ, ఎంఎస్, డీఎమ్, ఎండీఎస్, ఎంసీహెచ్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఏటా రెండుసార్లు(జనవరి/జూలై సెషన్స్) ఐఎన్‌ఐ సెట్ నిర్వహిస్తుంది. జనవరి సెషన్ ఇప్పటికే పూర్తి కావడంతో.. జూలై సెషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల మెడికల్ గ్రాడ్యుయేట్స్ మార్చి 31వ తేదీలోగా తమ వివరాలను ఎయిమ్స్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఐఎన్‌ఐ సెట్‌కు అర్హతలు..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సెట్ జూలై సెషన్‌కు ఎయిమ్స్ కొన్ని అర్హతా ప్రమాణాలను నిర్దేశించింది. ఎండీ/ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంబీబీఎస్; ఎండీఎస్ కోర్సులో అడ్మిషన్ కోసం బీడీఎస్ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఏడాదికాలం పాటు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడంతో పాటు విధిగా సర్టిఫికెట్ తీసుకుని ఉండాలి. జనరల్/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు.. ఎంబీబీఎస్/బీడీఎస్‌లో కనీసం 55 శాతం మార్కులు; ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
ఆన్‌లైన్‌లో ఎంట్రన్స్..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ వరకు ప్రాథమిక రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు; ఏప్రిల్ 1 నుంచి ఐదు రోజులపాటు అభ్యర్థులు ప్రాథమిక రిజిస్ట్రేషన్ స్థితిని తనిఖీ చేసుకునేందుకు, తప్పులు సరిదిద్దుకొని.. 2021 ఏప్రిల్ 12 వరకు తుది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
పరీక్ష కేంద్రాలు..

- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్(ఐఎన్‌ఐ) కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2021, మే 8న ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
- ఐఎన్‌ఐ ఎంట్రన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఉంటుంది. మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాలి.
- మే 15న పరీక్ష ఫలితాలు ప్రకటించనున్నారు.
- జనవరి సెషన్‌లో దాదాపు 900 పీజీ సీట్లను భర్తీ చేయగా.. జూలై సెషన్‌లో సుమారు 820 పీజీ సీట్లకు ప్రవేశం కల్పించనున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ వరకు ప్రాథమిక రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు; ఏప్రిల్ 1 నుంచి ఐదు రోజులపాటు అభ్యర్థులు ప్రాథమిక రిజిస్ట్రేషన్ స్థితిని తనిఖీ చేసుకునేందుకు, తప్పులు సరిదిద్దుకొని.. 2021 ఏప్రిల్ 12 వరకు తుది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
పరీక్ష కేంద్రాలు..
- ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, విజయవాడలోను; తెలంగాణలో.. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాలోను ఉన్నాయి.
Published date : 01 Apr 2021 03:54PM