దూరవిద్య... సుదూరం కానుందా ?
Sakshi Education
‘దూర’విద్య (డిస్టెన్స్ ఎడ్యుకేషన్).. రోజూ కాలేజీకి వెళ్లకుండానే ఉన్నత విద్య కోర్సులు పూర్తిచేసుకునేందుకు వీలుకల్పించే విధానం.
ఇది దేశంలో మూడు దశాబ్దాలకు పైగా లక్షల మంది ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ఆర్థిక, కుటుంబ కారణాలతో రెగ్యులర్ విధానంలో ఉన్నత విద్య అభ్యసించలేని విద్యార్థులు... తమ విద్యార్హతలు పెంచుకొని కెరీర్ పరంగా మరింత ఉన్నతస్థాయికి వెళ్లేందుకు దూర విద్యావిధానం దోహదపడింది. ఇటీవల దూరవిద్యా విధానంలో నాణ్యత ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో రూపొందించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) సెకండ్ అమెండ్‌మెంట్ రెగ్యులేషన్స్-2018, ఔత్సాహికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకో తెలుసుకుందాం...
ప్రొఫెషనల్ కోర్సులకు ప్రతికూలం..
యూజీసీ (ఓడీఎల్) రెగ్యులేషన్స్-2017 :
వాస్తవానికి దూరవిద్యా విధానంపై యూజీసీ (ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లెర్నింగ్) రెగ్యులేషన్స్-2017 పేరుతో గతేడాది కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటిలో మౌలిక సదుపాయాల నుంచి, ఫ్యాకల్టీ, పరీక్షల విధానం వరకు పలు అంశాలను పేర్కొంది. దీనిపై జాతీయ స్థాయిలో పలు యూని వర్సిటీలు సదరు నిబంధనల నుంచి సడలింపు ఇవ్వాలని యూజీసీని సంప్రదించాయి. న్యాక్ గుర్తింపు నుంచి కొంత కాలం మినహాయింపుతోపాటు 2017-18లో ప్రారంభించిన కోర్సు లు పూర్తయ్యే వరకు కొనసాగించొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ(ఓడీఎల్) రెగ్యులేషన్స్-2017 ప్రకారం-యూనివర్సిటీలు.. దూర విద్య కోర్సుల పరీక్షలకు సెమిస్టర్ విధానాన్ని అనుసరించాలని, సీబీసీఎస్ విధానంవైపు దృష్టి పెట్టాలని పేర్కొంది. అదేవిధంగా ప్రతి కోర్సుకు యూనివర్సిటీ స్థాయిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌ను, ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌ను, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని స్పష్టం చేసింది.
స్టడీ సెంటర్ల సమస్య :
ప్రస్తుతం దూర విద్య కోర్సులను అందిస్తున్న వర్సిటీలు.. ఎక్కువ మంది విద్యార్థులున్న ప్రాంతంలోని కళాశాలలో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. ఆ కళాశాలలోని అధ్యాపకులనే డిస్టెన్స్ కోర్సులకు కూడా పార్ట్‌టైమ్ విధానంలో నియమించుకుంటున్నారు. కానీ ఇప్పుడు యూజీసీ నిబంధన కారణంగా స్టడీ సెంటర్లలో ఇలాంటి అవకాశం ఉండదు.
సంప్రదాయ డిగ్రీలకే...
దూరవిద్యా విధానానికి సంబంధించి యూజీసీ తాజా నిబంధనలను పరిశీలిస్తే.. ఈ విద్యా విధానం ఇకపై సంప్రదాయ డిగ్రీ లకే (బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర) పరిమితం కానుందా.. అనే సందేహం తలెత్తుతోంది. యూజీసీ తాజాగా ఆయా యూనివర్సిటీలకు అనుమతించిన కోర్సుల జాబితా కూడా ఈ సందేహాన్ని మరింత బలోపేతం చేస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు..
నిబంధనలు సడలించాలి...
దూరవిద్యా విధానం.. పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేని విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులు అభ్యసించేందుకు వీలు కల్పించే సాధనం. నాణ్యత ప్రమాణాల పేరుతో కొత్త నిబంధనలు రూపొందించడం ఆహ్వానించదగ్గదే. అయితే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిబంధ నలను కొంతమేరకు సడలిస్తే బాగుం టుంది.
- ప్రొఫెసర్ చింతా గణేశ్, డెరైక్టర్, ప్రొఫెసర్ జి.రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియ యూనివర్సిటీ.
ప్రొఫెషనల్ కోర్సులకు ప్రతికూలం..
- అధిక శాతం మంది విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సులు పూర్తయ్యాక ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితుల్లో కొలువుల్లో చేరిపోతారు. ఆ తర్వాత కెరీర్ ఉన్నతి కోసం ఎంబీఏ, బీఈడీ వంటి కోర్సులను చదివేందుకు దూర విద్య విధానం ఎంచుకుంటారు. తాజా రెగ్యులేషన్స్ ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సుల ఔత్సాహికులపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే.. దూర విద్య విధానంలో సదరు యూనివర్సిటీ ప్రొఫెషనల్ కోర్సులను అందించాలంటే.. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డ్‌తోపాటు, సంబంధిత కోర్సును పర్యవేక్షించే నియంత్రణ సంస్థల గుర్తింపు కూడా పొందాలి. ఉదాహరణకు.. ఎంబీఏ, ఎంసీఏ, హోటల్ మేనేజ్‌మెంట్, ట్రావెల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్ సహా ఇతర మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించి జాతీయ స్థాయిలో వీటిని పర్యవేక్షించే ఏఐసీటీఈ గుర్తింపు సదరు యూనివర్సిటీకి ఉండాలి. బీఈడీ, ఎంఈడీ కోర్సులను అందించాలంటే.. ఎన్‌సీటీఈ(నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) గుర్తింపు తప్పనిసరి. ఈ నిబంధన ప్రతికూలంగా మారనుంది.
- ఉదాహరణకు డీఈడీ సర్టిఫికెట్‌తో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న వేల మంది టీచర్లు.. పదోన్నతి పొందే క్రమంలో డిస్టెన్స్ విధానంలో బీఈడీ కోర్సులో చేరుతున్నారు. ఆయా కోర్సులకు నియంత్రణ సంస్థల గుర్తింపు పరంగా.. ఇప్పటికే రెగ్యులర్ విధానంలో ఈ కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ..రెగ్యులర్ విధానంలో ఈ కోర్సులను అందించని యూనివర్సిటీలు మాత్రం దూర విద్య విధానంలో బోధించడానికి వీలుండదు.
- ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) గుర్తింపు పొందాలని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ గుర్తింపు కూడా ఎ+(3.26 గ్రేడ్ పాయింట్)గా ఉండాలి. న్యాక్ గుర్తింపు కోసం.. యూజీసీ(ఓడీఎల్) సెకండ్ అమెండ్‌మెంట్ బిల్- 2018 అమల్లోకి వచ్చిన మూడు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ పేర్కొంది. న్యాక్ గుర్తింపు కోసం పాటించాల్సిన ప్రమాణాల పరంగా చూస్తే.. ఈ నిబంధన యూనివర్సిటీలకు కొంత ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.
- ప్రత్యేకంగా ఓపెన్ యూనివర్సిటీలుగా ఉన్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో వంటి వాటికి ఈ నిబంధన నుంచి కొంత వెసులుబాటు కల్పించారు. అయితే 2019-20 తర్వాత ఇవి కూడా తప్పనిసరిగా న్యాక్ గుర్తింపు పొందితేనే ఆయా కోర్సు లను అందించేందుకు అనుమతి లభిస్తుంది.
- అలాగే యూనివర్సిటీలు దూర విద్య విధానంలో అండర్ గ్రాడ్యు యేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులనే అందించాలి. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను ఆఫర్ చేయకూడదు. ఇప్పటికే ఆయా కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు ముందస్తు అనుమతితో వీటిని కొనసాగించే వెసులుబాటు కల్పించారు. ఇది తాత్కాలికంగా ఉపశమనమేనని.. భవిష్యత్తులో ఈ నిబంధన ఇబ్బందికరమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
యూజీసీ (ఓడీఎల్) రెగ్యులేషన్స్-2017 :
వాస్తవానికి దూరవిద్యా విధానంపై యూజీసీ (ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లెర్నింగ్) రెగ్యులేషన్స్-2017 పేరుతో గతేడాది కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటిలో మౌలిక సదుపాయాల నుంచి, ఫ్యాకల్టీ, పరీక్షల విధానం వరకు పలు అంశాలను పేర్కొంది. దీనిపై జాతీయ స్థాయిలో పలు యూని వర్సిటీలు సదరు నిబంధనల నుంచి సడలింపు ఇవ్వాలని యూజీసీని సంప్రదించాయి. న్యాక్ గుర్తింపు నుంచి కొంత కాలం మినహాయింపుతోపాటు 2017-18లో ప్రారంభించిన కోర్సు లు పూర్తయ్యే వరకు కొనసాగించొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ(ఓడీఎల్) రెగ్యులేషన్స్-2017 ప్రకారం-యూనివర్సిటీలు.. దూర విద్య కోర్సుల పరీక్షలకు సెమిస్టర్ విధానాన్ని అనుసరించాలని, సీబీసీఎస్ విధానంవైపు దృష్టి పెట్టాలని పేర్కొంది. అదేవిధంగా ప్రతి కోర్సుకు యూనివర్సిటీ స్థాయిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌ను, ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌ను, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని స్పష్టం చేసింది.
స్టడీ సెంటర్ల సమస్య :
ప్రస్తుతం దూర విద్య కోర్సులను అందిస్తున్న వర్సిటీలు.. ఎక్కువ మంది విద్యార్థులున్న ప్రాంతంలోని కళాశాలలో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. ఆ కళాశాలలోని అధ్యాపకులనే డిస్టెన్స్ కోర్సులకు కూడా పార్ట్‌టైమ్ విధానంలో నియమించుకుంటున్నారు. కానీ ఇప్పుడు యూజీసీ నిబంధన కారణంగా స్టడీ సెంటర్లలో ఇలాంటి అవకాశం ఉండదు.
సంప్రదాయ డిగ్రీలకే...
దూరవిద్యా విధానానికి సంబంధించి యూజీసీ తాజా నిబంధనలను పరిశీలిస్తే.. ఈ విద్యా విధానం ఇకపై సంప్రదాయ డిగ్రీ లకే (బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర) పరిమితం కానుందా.. అనే సందేహం తలెత్తుతోంది. యూజీసీ తాజాగా ఆయా యూనివర్సిటీలకు అనుమతించిన కోర్సుల జాబితా కూడా ఈ సందేహాన్ని మరింత బలోపేతం చేస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు..
- ఆచార్య నాగార్జున యూనవర్సిటీ పరిధిలో యూజీ, పీజీ స్థాయిలో మొత్తం 30 కోర్సులకు అనుమతిస్తే వాటిలో అన్నీ సంప్రదాయ డిగ్రీ కోర్సులే.
- కాకతీయ యూనివర్సిటీలో అనుమతించిన 29 కోర్సులన్నీ ట్రెడిషనల్ డిగ్రీ కోర్సులే.
- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 18 కోర్సులకు అనుమతిస్తే అవి కూడా సంప్రదాయ కోర్సులే. వీటిని పరిశీలిస్తే గతేడాది వరకు సంప్రదాయ, ప్రొఫెషనల్, సర్టిఫికెట్, పీజీ డిప్లొమా వంటి అన్ని స్థాయిల్లో దాదాపు 40 నుంచి 50 కోర్సులు అందించే యూనివర్సిటీల్లో ఇప్పుడు కేవలం బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ వంటి కోర్సులు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.
- ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, ఫిజియోథెరపీ కోర్సులను డిస్టెన్‌స ఎడ్యుకేషన్ విధానంలో బోధించినా.. అభ్యసించినా... ఆ సర్టిఫికెట్లకు ఎలాంటి గుర్తింపు ఉండదు.
నిబంధనలు సడలించాలి...
దూరవిద్యా విధానం.. పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేని విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులు అభ్యసించేందుకు వీలు కల్పించే సాధనం. నాణ్యత ప్రమాణాల పేరుతో కొత్త నిబంధనలు రూపొందించడం ఆహ్వానించదగ్గదే. అయితే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిబంధ నలను కొంతమేరకు సడలిస్తే బాగుం టుంది.
- ప్రొఫెసర్ చింతా గణేశ్, డెరైక్టర్, ప్రొఫెసర్ జి.రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియ యూనివర్సిటీ.
Published date : 07 Sep 2018 04:56PM