డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి సులువైన మార్గాలు...
Sakshi Education
ఐఐఎస్సీ, ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులు, పీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పించే యూసీడ్, సీడ్ ప్రకటన వెలువడింది. అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్- 2019, అలాగే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్(సీడ్)-2019లకు తాజాగా ఐఐటీ బాంబే నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఈ పరీక్షల్లో సత్తా చాటితే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో డిజైన్ కోర్సులు అభ్యసించేందుకు మార్గం సుగమ మవుతుంది. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ స్థాయి డిజైన్ కోర్సులు, అర్హతలు, ప్రవేశ ప్రక్రియ గురించి తెలుసుకుందాం....
యూజీ కోర్సులకు యూసీడ్ :
అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ 2019 ద్వారా ఐఐటీ బాంబే, ఐఐటీ గువహటి, ఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌ల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. సృజనాత్మకత, ఊహాశక్తి, సమస్య పరిష్కార దృక్పథం కలిగిన వారు ఈ కోర్సులు అభ్యసించేందుకు సరిగ్గా సరిపోతారని చెప్పొచ్చు. విద్యార్హత: 10+2/ఇంటర్మీడియెట్. 2019లో ఇంటర్మీడియెట్ ఫైనల్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా అర్హులే. జనరల్ అభ్యర్థులు అక్టోబర్1, 1994 తర్వాత జన్మించిన వాళ్లే అర్హులు. దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అడ్మిషన్‌లు కల్పిస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష 300 మార్కులకు 3గంటల వ్యవధిలో జరుగుతుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్‌లు ఉంటాయి.
యూ సీడ్ 2019 ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు: అక్టోబర్ 9- నవంబర్9, 2019
లేట్ ఫీతో దరఖాస్తులు: నవంబర్ 10- నవంబర్16, 2019
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: జనవరి 1, 2019 నుంచి
పరీక్ష తేది: జనవరి 19, 2019
ఫలితాల వెల్లడి: మార్చి1, 2019
వెబ్‌సైట్: www.uceed.iitb.ac.in
పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి సీడ్ :
డిజైన్ రంగంలో పీజీ స్థాయి కోర్సుల్లో సీడ్ ద్వారా ప్రవేశం పొందొచ్చు. అభ్యర్థుల ఊహాశక్తి, డ్రాయింగ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తదితరాలను సీడ్ ద్వారా పరీక్షిస్తారు. అభ్యర్థులు సీడ్‌లో అర్హత సాధించినంత మాత్రాన తుది ప్రవేశాలు ఖరారు కావు. అభ్యర్థులు తిరిగి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే ఇంటర్వ్యూలు తదితరాల్లో సత్తా చాటాల్సి ఉంటుంది. అర్హత: డిజైన్‌లో యూజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. ఇంటర్ తర్వాత గుర్తింపు పొందిన విశ్వవిద్యా లయం నుంచి మూడేళ్లకు తగ్గకుండా డిగ్రీ/ డిప్లొమా/ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి ఉండాలి. లేదా 2018, జూలై నాటికి జీడీ ఆర్ట్స్ డిప్లొమా ప్రోగ్రామ్(10+5 లెవల్) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:
ముఖ్య సమాచారం:
దరఖాస్తులు : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: దరఖాస్తు రుసుం జనరల్ అభ్యర్థులకు రూ.2600, మహిళలకు రూ.1300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల అభ్యర్థులకు రూ.1300
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 2018, అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 వరకు
అపరాధ రుసుముతో చివరి తేదీ: నవంబర్ 16, 2018
అడ్మిట్ కార్డుల జారీ ప్రారంభం: జనవరి 1, 2019
సీడ్-2019 పరీక్ష తేదీ: జనవరి 19, 2019
ఫలితాల వెల్లడి: మార్చి 4, 2019
వెబ్‌సైట్: www.ceed.iitb.ac.in
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
డిజైన్ కోర్సులు-ఇన్‌స్టిట్యూట్‌లు..

- సెక్షన్ ఏలో.. న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు వర్చువల్ కీ బోర్డు ద్వారా కంప్యూటర్ స్క్రీన్‌పైనే సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
- సెక్షన్ బీలో... మల్టిపుల్ సెలక్షన్ ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి.
- సెక్షన్ సీలో.. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చిన నాలుగు ఆప్షన్స్‌లో ఒకటి మాత్రమే సరైనదిగా ఉంటుంది.
యూ సీడ్ 2019 ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు: అక్టోబర్ 9- నవంబర్9, 2019
లేట్ ఫీతో దరఖాస్తులు: నవంబర్ 10- నవంబర్16, 2019
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: జనవరి 1, 2019 నుంచి
పరీక్ష తేది: జనవరి 19, 2019
ఫలితాల వెల్లడి: మార్చి1, 2019
వెబ్‌సైట్: www.uceed.iitb.ac.in
పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి సీడ్ :
డిజైన్ రంగంలో పీజీ స్థాయి కోర్సుల్లో సీడ్ ద్వారా ప్రవేశం పొందొచ్చు. అభ్యర్థుల ఊహాశక్తి, డ్రాయింగ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తదితరాలను సీడ్ ద్వారా పరీక్షిస్తారు. అభ్యర్థులు సీడ్‌లో అర్హత సాధించినంత మాత్రాన తుది ప్రవేశాలు ఖరారు కావు. అభ్యర్థులు తిరిగి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే ఇంటర్వ్యూలు తదితరాల్లో సత్తా చాటాల్సి ఉంటుంది. అర్హత: డిజైన్‌లో యూజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. ఇంటర్ తర్వాత గుర్తింపు పొందిన విశ్వవిద్యా లయం నుంచి మూడేళ్లకు తగ్గకుండా డిగ్రీ/ డిప్లొమా/ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి ఉండాలి. లేదా 2018, జూలై నాటికి జీడీ ఆర్ట్స్ డిప్లొమా ప్రోగ్రామ్(10+5 లెవల్) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:
- సీడ్ పరీక్షను పార్ట్ ఎ, పార్ట్ బిలుగా నిర్వహిస్తారు. పార్ట్ ఎ పేపర్ 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
- పార్ట్ ఎలో అడిగే ప్రశ్నలు డిజైన్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించినవి. ఇవి అభ్యర్థుల్లోని విజువల్, స్పేషియల్ సామర్థ్యాలు; ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ అవేర్‌నెస్, అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్, అబ్జర్వేషన్, డిజైన్ అండ్ సెన్సిటివిటీలను పరీక్షించేవిగా ఉంటాయి.
- పార్ట్ బి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. పార్ట్ బి ప్రశ్నపత్రం కంప్యూటర్‌లో డిస్‌ప్లే అవుతుంది. అభ్యర్థులు ఆయా ప్రశ్నలకు సమాధానాలను బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పార్ట్ బి ప్రశ్నపత్రంలో మొత్తం ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. తొలి ఐదు ప్రశ్నలు వివిధ విభాగాలకు సంబంధించినవిగా ఉంటాయి. అభ్యర్థులు వీటిలో నుంచి ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది. 6,7,8 ప్రశ్నలకు మాత్రం తప్పనిసరిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్ బిలో అడిగే ప్రశ్నలు డిజైన్, డ్రాయింగ్, రైటింగ్ స్కిల్స్‌ను పరీక్షించేవిగా ఉంటాయి.
ముఖ్య సమాచారం:
దరఖాస్తులు : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: దరఖాస్తు రుసుం జనరల్ అభ్యర్థులకు రూ.2600, మహిళలకు రూ.1300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల అభ్యర్థులకు రూ.1300
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 2018, అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 వరకు
అపరాధ రుసుముతో చివరి తేదీ: నవంబర్ 16, 2018
అడ్మిట్ కార్డుల జారీ ప్రారంభం: జనవరి 1, 2019
సీడ్-2019 పరీక్ష తేదీ: జనవరి 19, 2019
ఫలితాల వెల్లడి: మార్చి 4, 2019
వెబ్‌సైట్: www.ceed.iitb.ac.in
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
డిజైన్ కోర్సులు-ఇన్‌స్టిట్యూట్‌లు..
- సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఐఐఎస్‌సీ బెంగళూరు
కోర్సులు:- మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్
- పీహెచ్‌డీ ఇన్ డిజైన్
- ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్, ఐఐటీ బాంబే
కోర్సులు:- మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, యానిమేషన్, ఇంట రాక్షన్ డిజైన్, మొబిలిటీ అండ్ వెహికల్ డిజైన్.
- పీహెచ్‌డీ ఇన్ డిజైన్
- ఇన్‌స్ట్రుమెంట్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐఐటీ ఢిల్లీ
కోర్సులు:- మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజైన్, ఐఐటీ గువహటి
కోర్సులు:- మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ డిజైన్
- పీహెచ్‌డీ ఇన్ డిజైన్
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజైన్, ఐఐటీ హైదరాబాద్
కోర్సులు:- మాస్టర్ డిజైన్ ఇన్ విజువల్ డిజైన్
- పీహెచ్‌డీ ఇన్ విజువల్ డిజైన్
- డిజైన్ డిసిప్లైన్, ఐఐఐటీడీఎం జబల్‌పూర్
కోర్సులు:- మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ విజువల్ డిజైన్.
- డిజైన్ పోగ్రామ్, ఐఐటీ కాన్పూర్
కోర్సులు:- మాస్టర్ ఆఫ్ డిజైన్.
- పీహెచ్‌డీ ఇన్ డిజైన్
Published date : 15 Oct 2018 03:38PM