దేశవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు ప్రవేశాలు..దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
Sakshi Education
వ్యవసాయ విద్యలో ఉన్నతస్థాయి ప్రమాణాలను పాటించే సంస్థగా గుర్తింపు పొందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆగ్రికల్చర్రీసెర్‌చ (ఐసీఏఆర్) పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలు అందించే కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఇందులో భాగంగానే ఐసీఏఆర్‌లో యూజీ (15 శాతం సీట్లు), పీజీ (25 శాతం సీట్లు), పీహెచ్‌డీ (25 శాతం సీట్లు) ల్లో ప్రవేశాలకు ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఏ)-2020 నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. ఐకార్ అందించే కోర్సుల వివరాలు, ప్రత్యేకత, అర్హతలు, పరీక్ష విధానం, కెరీర్ అవకాశాలపై సమగ్ర సమాచారం...
ఐకార్:
వ్యవసాయ విద్య, పరిశోధన రంగాన్ని సమన్వయం చేసే ఉద్దేశంతో న్యూఢిల్లీ కేంద్రంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ (ఐసీఏఆర్-ఐకార్) స్థాపించారు. ఇది కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ పరిధిలో పనిచేసే స్వతంత్ర సంస్థ. దేశంలోని వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే దీని పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ యూనివర్సిటీల్లో ఏటా వేల సంఖ్యలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తూ.. వ్యవసాయ రంగానికి అవసరమైన నిపుణులను తయారు చేస్తోంది. ఐకార్ పరిధిలో 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు, 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ యూనివర్సిటీలు, 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు తదితర ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.
ఆన్‌లైన్ పరీక్ష :
ఐకార్-ఏఐఈఈఏ పరీక్ష నిర్వహణ బాధ్యతలను గత ఏడాది(2019)నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) చూస్తోంది. ప్రస్తుతం 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం పరీక్ష ప్రకటనను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహించే ఐసీఏఆర్-ఐఏఈఈఏ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరుగుతుంది. ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహించే ఈ పరీక్షల్లో ప్రతీ సరైన సమాధానికి నాలుగు మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతీ తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు.
యూజీ కోర్సులు :
అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, సెరికల్చర్ కోర్సులను అందిస్తోంది. అలాగే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌సీ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పిస్తోంది.
సీట్ల సంఖ్య: 2,784.
అర్హతలు : ఇంటర్‌లో ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ లేదా ఇంటర్ అగ్రికల్చర్ కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. వయసు: ఆగస్టు 30, 2020 నాటికి 16 ఏళ్ల వయసు నిండిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పరీక్ష విధానం :
యూజీ పరీక్ష 150 ప్రశ్నలకు-600 మార్కులకు ఎంట్రెన్స్ ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తే.. ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను తుది ఎంపిక చేసి ఐసీఏఆర్‌లో ప్రవేశాలకు అవకాశం కలిస్తారు.
పరీక్ష ఫీజు:
జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.375 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
పీజీ కోర్సులు:
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంకు సంబంధించి ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, ఫిజికల్ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్, స్టాటిస్టికల్ సైన్స్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/ఆగ్రోఫారెస్ట్రీ అండ్ సివి కల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వాటర్ సైన్స్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఆగ్రోనమీ, ఫిషరీస్ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, హోంసైన్స్, సోషల్ సైన్స్ తదితర విభాగాల్లో కోర్సులున్నాయి.
సీట్ల సంఖ్య: 3,075.
అర్హతలు : ఐకార్ పీజీ కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 10+2+5 (బీవీఎస్సీ, అండ్ ఏహెచ్) లేదా 10+2+4 లేదా 10+6 సంవత్సరాల(బీఎస్సీ ఆగ్రికల్చరల్)డిగ్రీ ప్రోగ్రాం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది. వయసు: అభ్యర్థులు ఆగస్టు 31,2020 నాటికి 19 ఏళ్లు నిండిన వారై ఉండాలి.
పరీక్ష విధానం : ఐసీఏఆర్ పీజీ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకుగాను 480 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 నిమిషాల పరీక్ష సమయాన్ని కేటాయిస్తారు.
ఎంపిక ప్రక్రియ : ఐసీఏఆర్ పీజీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను కటాఫ్, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని తుది ఎంపిక చేసి, కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో
పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
పీహెచ్‌డీ కోర్సులు :
డాక్టోరల్ కోర్సులకు సంబంధించి క్రాప్‌సైన్స్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్-1, డెయిరీసైన్స్, డెయిరీ టెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, హోంసైన్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చరల్ ఎకానమి అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫిషరీ సైన్స్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సీట్ల సంఖ్య: 905.
అర్హతలు : ఈ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: అభ్యర్థులు జూలై 01, 2020 నాటికి 20 ఏళ్లు పూర్తయి ఉండాలి.
పరీక్ష విధానం : ఐసీఏఆర్-జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్(పీహెచ్‌డీ) పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకుగాను 480 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు.
ఎంపిక ప్రక్రియ : పరీక్షల్లో చూపిన ప్రతిభ.. కటాఫ్‌ను పరిగణనలోకి తీసుకొని తుది ఎంపిక చేసి ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో
పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ. 1800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
కెరీర్ అవకాశాలు ఇలా.. :
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయ విద్యను అభ్యసించిన వారికి కెరీర్ పరంగా కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో వ్యవసాయ పంటల అమ్మకాలు, మార్కెటింగ్, రవాణా, సేవలు, నిల్వ, గిడ్డంగులు మొదలైన వాటిల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ,ప్రయివేట్ రంగాల్లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్లాంటేషన్స్, ఫర్టిలైజర్ కంపెనీలు, అగ్రికల్చరల్ మెషినరీలు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వీటితోపాటు ఎఫ్‌సీఐ, నాబార్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో రీసెర్చ్ సైంటిస్ట్‌లుగా కూడా పనిచేసే వీలుంది.
ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 31 మార్చి 2020
అడ్మిట్ కార్డ్: 25 ఏప్రిల్ 2020
పరీక్ష తేదీ: 01 జూన్ 2020
ఫలితాలు: 15 జూన్ 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icar.nta.nic.in

Published date : 11 Mar 2020 12:05PM