బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునేవారికి సదావకాశం.. దరఖాస్తుకు చివరి తేది ఇదిగో..
బ్యాంకు కొలువులే లక్ష్యంగా ప్రిపేరవుతున్న వారి కోసం మరో నోటిఫికేషన్ వెలువడింది. తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)-1167 ప్రొబేషనరీ ఆఫీసర్ /మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ పీవో పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ గురించిన సమాచారం...
మొత్తం పోస్టుల సంఖ్య..
- 1167(బ్యాంక్ ఆఫ్ ఇండియా–734; పంజాబ్ అండ్ సిం«ధ్ బ్యాంక్–83; యూకో బ్యాంక్– 350)
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: 2020, ఆగస్టు 1 నాటికి 20–30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
ప్రిలిమినరీ (100మార్కులు), మెయిన్(225 మార్కులు), ఇంటర్వూ (100 మార్కులు) ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి.. ఇంటర్వూకు ఆహ్వానిస్తారు.
ప్రిలిమినరీ..
ప్రిలిమినరీ పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 30 మార్కులకు 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 35 మార్కులకు 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీపై 35 మార్కులకు 35 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి పావు వంతు మార్కు కోతపడుతుంది. పరీక్షలో సెక్షనల్ టైమ్ ఉంటుంది. ప్రతి విభాగాన్నీ 20 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
మెయిన్ లో ఐదు విభాగాలు..
మెయిన్ పరీక్షలో ఐదు విభాగాలుంటాయి. పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 60 మార్కులకు 45 ప్రశ్నలు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 40 మార్కులు 35 ప్రశ్నలు, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌పై 60 మార్కులకు 35 ప్రశ్నలు.. అలాగే ఇంగ్లిష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే)కు సంబంధించి 25 మార్కులకు 2 ప్రశ్నలు అడుగుతారు.
ఇంటర్వూ ఇలా..
మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వూ నిర్వహిస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. మెయిన్, ఇంటర్వూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
సిలబస్ విశ్లేషణ:
ఇంగ్లిష్ లాంగ్వేజ్..
రీడింగ్ కాంప్రహెన్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, పారాజంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్టు, స్పాటింగ్ ద ఎర్రర్స్, రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్ తదితర అంశాలు ఉంటాయి.
రీజనింగ్ ఎబిలిటీ..
ఇందులో పజిల్ టెస్టు, సర్యు్కలర్ అరేంజ్‌మెంట్, లీనియర్ అరేంజ్‌మెంట్, ఇన్‌ఈక్వాలిటీస్, ఇన్‌పుట్–ఔట్‌పుట్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ సెన్స్, కోడింగ్–డీ కోడింగ్, డేటా సఫీషియన్సీ, ఫిగర్ సిరీస్, ఆల్ఫాన్యూమరిక్ సిరీస్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్..
డేటా ఇంటర్‌ప్రిటేషన్– టేబుల్, బార్, పైఛార్ట్, నంబర్ సిరీస్, నంబర్ సిస్టమ్, అప్రాక్సిమేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, మెన్సురేషన్, ఎస్‌ఐ అండ్ సీఐ, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, ఇన్ ఈక్వాలిటీస్ తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
ముఖ్యసమాచారం..
- దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 26.08.202
- ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకు రూ.175.
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబరు 3, 10, 11 తేదీల్లో జరుగుతుంది.
- ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: నవంబరు 28,2020
- ఇంటర్వూ: జనవరి/ఫిబ్రవరి, 2021.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in