బీఈడీ కోర్సుకి పూర్వవైభవం...?
Sakshi Education
బీఈడీ కోర్సు.. తెలుగు రాష్ట్రాల్లో పూర్వవైభవాన్ని తిరిగి పొందుతోందా! గత కొన్నేళ్లుగా వన్నె కోల్పోయిన బీఈడీ.. ఇప్పుడు టీచర్ పోస్టు ఔత్సాహిక అభ్యర్థులను అమితంగా ఆకర్షిస్తోందా..! అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది!!
గతంలో బీఈడీ ప్రవేశ పరీక్షకు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చేవి. గత కొన్నేళ్లుగా దరఖాస్తుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సంగతి
తెలిసిందే. కానీ, అనూహ్యంగా ఈ ఏడాది బీఈడీ ఎంట్రెన్స్ టెస్టు ఎడ్‌సెట్‌కు దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఇది స్కూల్ టీచర్ కెరీర్ పట్ల యువతలో క్రేజ్ పెరుగుతోందనడానికి నిదర్శనం అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో బీఈడీ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి కారణాలతోపాటు బీఈడీతో టీచింగ్ కెరీర్ గురించి తెలుసుకుందాం...
డిగ్రీ పూర్తయ్యాక ఎంబీఏ, ఎంసీఏ, ఇతర వృత్తి విద్య కోర్సుల వైపు గ్రాడ్యుయేట్లు అడుగులు వేస్తున్నారు. ఇది ఇప్పటి మాట. కానీ, గతంలో డిగ్రీ పూర్తిచేసిన వారిలో చాలామంది విద్యార్థులు బీఈడీలో చేరేందుకు మొగ్గు చూపేవారు. ఏడాది కాల వ్యవధి ఉన్న కోర్సు కావడం, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే అవకాశం ఉండటం వల్ల అన్ని నేపథ్యాల విద్యార్థులు బీఈడీలో చేరేవారు. అంతేకాకుండా గతంలో క్రమం తప్పకుండా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుండటంతో బీఈడీ పూర్తిచేయడం ద్వారా ప్రభుత్వ రంగంలో టీచర్ ఉద్యోగం(ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్) సొంతం చేసుకునే వీలుండేది.
ఇదీ నేపథ్యం..
బీఈడీ కరిక్యులంలో చైల్డ్ సైకాలజీ లేదని.. కాబట్టి బీఈడీ అభ్యర్థులు చిన్న పిల్లలకు బోధించేందుకు అర్హులు కాదంటూ డీఈడీ అభ్యర్థుల సంఘం 2008లో సుప్రీంకోర్టుకెళ్లింది. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్‌జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొనాలంటూ కోర్టును కోరింది. దీనిపై 2010లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ.. ఎస్‌జీటీ పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని, బీఈడీ ఉత్తీర్ణులు అర్హులు కాదని పేర్కొంది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు తెస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ)గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన టీచర్ నియామకాల్లో ఎస్‌జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అర్హత లేకుండా పోయింది. కేవలం ఎస్‌ఏ పోస్టులకే పోటీపడ్డారు. ఎస్‌ఏ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండేది. ఫలితంగా ప్రభుత్వ రంగంలో బీఈడీ అభ్యర్థులకు అవకాశాలు పరిమితమయ్యాయి. దాంతో వారు తమను ఎస్‌జీటీ పోస్టులకు తిరిగి పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంతో కేంద్రం బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఉపాధ్యాయుల కొరత..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల విద్యపై దృష్టిసారించడంతో ప్రభుత్వ రంగంలో భారీ సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. వీటిలో ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ఇప్పటికే ఏర్పాటైన ప్రభుత్వ స్కూళ్లు అరకొర బోధన సిబ్బందితో నెట్టుకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బడుల్లో పెద్దసంఖ్యలో ఉపాధ్యాయుల అవసరం ఉంది. మరోవైపు ప్రైవేటు రంగంలో పట్టణాలు, నగరాలు, పల్లెలు అని తేడా లేకుండా.. ప్రతిచోటా ప్రైవేటు పాఠశాలలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో, నగర శివార్లల్లో పేరొందిన కార్పొరేట్ పాఠశాలలు తమ శాఖలను విస్తరిస్తున్నాయి. వీటిలో నైపుణ్యాలు కలిగిన టీచర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లలో టీచర్లకు ఉజ్వల ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది.
ఆకర్షణీయ వేతనాలు :
‘బతకలేక బడి పంతులు’ ఇది గత నానుడి. గతంలో టీచర్లు చాలీచాలని జీతాలతో ఎదుగూబొదుగూ లేకుండా నెట్టుకొచ్చే పరిస్థితి ఉండేది. కానీ టీచింగ్ ఇప్పుడు క్రేజీ కెరీర్‌గా మారుతోంది. ప్రభుత్వ రంగంలో స్కూల్ టీచర్లకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రారంభ వేతనం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. అదనంగా పీఎఫ్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి సదుపాయాలు ఉంటాయి.
2014కు ముందు డిగ్రీ తర్వాత బీఈడీ ఏడాది కోర్సుగానే ఉండేది. ఎన్‌సీటీఈ 2014లో బీఈడీని రెండేళ్ల కోర్సుగా మార్చింది. దీనివల్ల కూడా డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు. గతంలో బీఈడీలో చేరేందుకు ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వారు. ఆ సంఖ్య కాస్తా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018-19లో బీఈడీలో ప్రవేశాల కోసం తెలంగాణలో ఎడ్‌సెట్‌కు 38,694 వేల మంది మాత్రమే హాజరయ్యారు. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా 52,380కు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 8,697 మంది దరఖాస్తు చేసుకోగా 7,679 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 14,019కు పెరిగింది. వీరిలో 11,650 మంది పరీక్షకు హాజరయ్యారు.
టీచర్ కావాలంటే..
టీచర్ వృత్తిలో రాణించాలంటే.. ప్రధానంగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉండాలి. నిత్యం నేర్చుకుంటూ విద్యార్థులకు బోధిస్తుండాలి. ఉపాధ్యాయుడు నిత్యవిద్యార్థిగా మారాలి. ప్రధానంగా ఇంగ్లిష్ మీడియంలో బోధించ గలిగే నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రైవేటు రంగంలో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. తెలుగు మీడియం నేపథ్యంతో వచ్చే అభ్యర్థులు సైతం భాషా నైపుణ్యాలు మెరుగుపరచుకొని రాణించవచ్చు. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా నైపుణ్యాలు, సబ్జెక్ట్‌పై పట్టు, ఓర్పు, సహనం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస, సానుకూల దృక్పథం, సమయస్ఫూర్తి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న టీచర్లకు అవకాశాలు, జీతాలు మెరుగ్గా ఉంటాయి.

- ప్రైవేటు రంగంలో మధ్య తరగతి స్కూళ్లల్లో టీచర్లకు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం అందుతోంది. కార్పొరేటు స్కూళ్లలో రూ.30వేలకు పైగా జీతం లభిస్తోంది. దీంతోపాటు అదనంగా అలవెన్సులు కూడా అందుతాయి. అన్నీ కలుపుకొని ప్రముఖ ప్రైవేటు స్కూళ్లల్లో నైపుణ్యాలున్న టీచర్లు రూ.లక్ష వరకు అందుకుంటున్నారంటే ఆశ్చర్యంలేదు. ఇక ఇంటర్నేషనల్ స్కూళ్లలో ప్రారంభ వేతనంరూ.40వేల నుంచి రూ.50వేలకు తగ్గకుండా ఉంటుంది. ఇతర అలవెన్సులు అదనం.
- స్కూల్ టీచర్ కొలువులో చేరిన వారికి ఉజ్వల కెరీర్ అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేరి ఎస్‌జీటీ/ఎస్‌ఏగా కెరీర్ ప్రారంభించవచ్చు. సీనియారిటీతో మండల విద్యాధికారి, ఆపై స్థాయికి చేరుకోవచ్చు. పీజీ పూర్తిచేస్తే జూనియర్ లెక్చరర్ స్థాయి అందుకోవచ్చు.
- ఉపాధ్యాయ కోర్సును పూర్తిచేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్), కేంద్ర ప్రభుత్వ పాఠశాలలైన.. కేంద్రీయ విద్యాలయాలు, జవహార్ నవోదయ విద్యాలయాలు మొదలైన వాటిలో ఉద్యోగాలు పొందడానికి సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ) స్కోర్ తప్పనిసరి.
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లాంగ్వేజ్ పండిట్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో పనిచేసే టీచర్లు కూడా ఉంటారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసి ఉండాలి. దీనికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు అర్హులు. అలానే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో చేరేందుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు.
- తెలుగు, హిందీ, సంస్కృతం సబ్జెక్టులను బోధించడానికి లాంగ్వేజ్ పండిట్లు అవసరం. లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రెన్‌స టెస్ట్ రాసి పండిట్ కోర్సులు చేయవచ్చు.
- మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే..స్పెషల్ ఎడ్యుకేషన్. మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్ ఆటిజం, ఇంపెయిర్‌మెంట్, లెర్నింగ్ డిజెబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
2014కు ముందు డిగ్రీ తర్వాత బీఈడీ ఏడాది కోర్సుగానే ఉండేది. ఎన్‌సీటీఈ 2014లో బీఈడీని రెండేళ్ల కోర్సుగా మార్చింది. దీనివల్ల కూడా డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు. గతంలో బీఈడీలో చేరేందుకు ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వారు. ఆ సంఖ్య కాస్తా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018-19లో బీఈడీలో ప్రవేశాల కోసం తెలంగాణలో ఎడ్‌సెట్‌కు 38,694 వేల మంది మాత్రమే హాజరయ్యారు. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా 52,380కు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 8,697 మంది దరఖాస్తు చేసుకోగా 7,679 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 14,019కు పెరిగింది. వీరిలో 11,650 మంది పరీక్షకు హాజరయ్యారు.
టీచర్ కావాలంటే..
- ఇంటర్మీడియట్/డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు వీలుకల్పించే డీఈడీ, బీఈడీ వంటి టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరొచ్చు.
- ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్ష రాసి, డీఈడీ కోర్సు పూర్తిచేసిన వారు ప్రాథమిక తరగతులకు బోధించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ పోస్టు దక్కించుకోవచ్చు.
- డిగ్రీ తర్వాత ఎడ్‌సెట్ రాసి బీఈడీ కోర్సు చదివిన వారు పదో తరగతి వరకు పాఠాలు బోధించవచ్చు. సర్కారీ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌గా స్థిరపడొచ్చు.
టీచర్ వృత్తిలో రాణించాలంటే.. ప్రధానంగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉండాలి. నిత్యం నేర్చుకుంటూ విద్యార్థులకు బోధిస్తుండాలి. ఉపాధ్యాయుడు నిత్యవిద్యార్థిగా మారాలి. ప్రధానంగా ఇంగ్లిష్ మీడియంలో బోధించ గలిగే నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రైవేటు రంగంలో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. తెలుగు మీడియం నేపథ్యంతో వచ్చే అభ్యర్థులు సైతం భాషా నైపుణ్యాలు మెరుగుపరచుకొని రాణించవచ్చు. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా నైపుణ్యాలు, సబ్జెక్ట్‌పై పట్టు, ఓర్పు, సహనం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస, సానుకూల దృక్పథం, సమయస్ఫూర్తి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న టీచర్లకు అవకాశాలు, జీతాలు మెరుగ్గా ఉంటాయి.
Published date : 12 Jun 2019 02:14PM