Skip to main content

ఆయుష్ కోర్సుల సీట్ల భర్తీలో..ఆల్ ఇండియా, రాష్ట్ర కోటా వివరాలు ఇలా..

ఆయుష్ కోర్సుల సీట్ల భర్తీలోనూ.. ఎంబీబీఎస్, బీడీఎస్ మాదిరిగానే ఆల్-ఇండియా కోటాను అమలు చేస్తున్నారు. మొత్తం అందుబాటులో ఉన్న సీట్లలో 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన 85 శాతం సీట్లకు రాష్ట్రాల పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం సీట్లకు, ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను ఏ-కేటగిరీ కింద కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు.
అందుబాటులో ఉన్న సీట్లు..
  • పస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం-బీహెచ్‌ఎంఎస్‌కు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని సీట్ల సంఖ్య 500; అలాగే ఏపీలో బీహెచ్‌ఎంఎస్ సీట్ల సంఖ్య 520.
  • ఏపీలో మూడు కళాశాలల్లో 200 బీఏఎంఎస్ సీట్లు, తెలంగాణలోని రెండు కళాశాలల్లో వంద బీఏఎంఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీఎన్‌వైఎస్ కోర్సుకు సంబంధించి తెలంగాణలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 100. కాగా ఏపీలో బీఎన్‌వైఎస్ సీట్ల సంఖ్య 200.
  • యునానీ(బీయూఎంఎస్) కోర్సుకు సంబంధించి తెలంగాణలో 75 సీట్లు, ఏపీలో 50 సీట్లు ఉన్నాయి.
  • గత ఏడాది (2019-20) కౌన్సెలింగ్ సమయానికి పేర్కొన్న గణాంకాల ఆధారంగా సీట్లు, కాలేజీల వివరాలు ఇవ్వడం జరిగింది. కౌన్సెలింగ్ తుది దశ సీట్ల కేటాయింపు సమయానికి సీట్ల సంఖ్యలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: part 3: ఆయుష్ కోర్సుల ఫీజులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం..!
Published date : 26 Jan 2021 02:29PM

Photo Stories