Skip to main content

ఆర్మీలో టెక్‌ కొలువులు..సాధించే మార్గాలు..దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

దేశ రక్షణకు ఇండియన్‌ ఆర్మీ అహర్నిశలు శ్రమిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆర్మీలో చేరి.. దేశ సేవలో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వారికి ఇండియన్‌ ఆర్మీ తాజాగా విడుదల చేసిన షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) టెక్‌ నోటిఫికేషన్‌ సదవకాశంగా నిలుస్తుంది. వీటికి ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ పోస్టులకు పురుషులతోపాటు మహిళా గ్రాడ్యుయేట్లు దరఖాస్తుకు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఆర్మీలో టెక్‌ కొలువులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, కెరీర్‌ అవకాశాలపై సమగ్ర సమాచారం...
ఖాళీల వివరాలు..
  • ఎస్‌ఎస్‌సీ టెక్‌ మెన్, ఉమెన్‌ ఖాళీలు మొత్తం 191 ఉన్నాయి. వీటిలో పురుషులకు 175, మహిళలకు14, ఆర్మీ విడోలకు 2 పోస్టులు కేటాయించారు. వీటిలో సివిల్‌ 49, మెకానికల్‌ 15, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రా్టనిక్స్‌ 16, కంప్యూటర్‌ సైన్స్‌ 47, ఎలక్ట్రా్టనిక్స్, టెలికమ్యూనికేషన్‌ తదితర 29, ఏరోనాటికల్‌ 5, ఏవియానిక్స్‌ 5, ఏరోస్పేస్‌ 1, ఆటోమొబైల్‌ 2, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 2.
  • పై పోస్టులతోపాటు పురుషులకు టెక్స్‌టైల్, ట్రాన్స్‌పోర్టేషన్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌లల్లో ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఉన్నాయి. మహిళలకు సివిల్‌ 3, ఎలక్ట్రికల్‌ 2, ఎలక్ట్రానిక్స్‌ 2, కంప్యూటర్స్‌ 4, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఏరోనాటికల్‌ల్లో ఒక్కో పోస్టు అందుబాటులో ఉంది.
విద్యార్హత :
ఆయా స్ట్రీముల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిఫెన్స్‌ వితంతు ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అర్హులు.

వయసు :
2021, ఏప్రిల్‌ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆర్మీ వితంతువులకు గరిష్ట వయసు 35 ఏళ్లకు మించరాదు.

ఎంపిక ప్రక్రియ :
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆయా స్ట్రీముల్లో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌ లిస్టు చేస్తారు. షార్ట్‌లిస్టులోని అభ్యర్థులకు సెలక్షన్‌ కేంద్రాల్లో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఇంటర్వ్యూలు జరుపుతుంది. దక్షిణ భారతీయులకు బెంగళూరులో మౌఖిక పరీక్షలు ఉంటాయి. వీటిని సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇవి రెండు దశల్లో అయిదు రోజులపాటు జరుగుతాయి.
  • తొలిరోజు స్టేజ్‌1లో ఉత్తీర్ణులు అయిన వారు మాత్రమే.. ఆ తర్వాత 4 రోజులపాటు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూల్లో కొనసాగుతారు. ఇందులో విజయం సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ, జీతభత్యాలు ఇలా..
ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ, చెన్నైలో ఏప్రిల్, 2021 నుంచి శిక్షణ మొదలవుతుంది. శిక్షణ వ్యవధి 49 వారాలు. శిక్షణలో నెలకు రూ.56,100 స్టెయిపెండ్‌గా చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి మద్రాస్‌ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అంతేకాకుండా ఆర్మీలో లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటుంది. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల మేరకు కొందరిని పర్మనెంట్‌ కమిషన్‌లోకి(శాశ్వత ఉద్యోగం)తీసుకుంటారు. మిగిలిన వారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ను పొడిగిస్తారు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది.

- లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 (లెవెల్‌ 10) మూల వేతనంతోపాటు మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి.

ముఖ్య సమాచారం..
దరఖాస్తు విధానం
: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 12.11.2020

వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in 
Published date : 29 Oct 2020 12:50PM

Photo Stories