Skip to main content

ఆన్‌లైన్ తరగతులతో పాటు వీటిపై కూడా దృష్టి పెడ్తే పదో తరగతిలో విజయం సులువే..

ఆన్‌లైన్ తరగతులు వింటున్న విద్యార్థులు.. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి తమ ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకునేందుకు వీక్లీ టెస్ట్‌లకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది.

ఇలా చేయడం వల్ల తాము ఇంకా అవగాహన పొందాల్సిన సబ్జెక్ట్‌లకు ఏ విధంగా ప్రిపరేషన్ సాగించాలో తెలుస్తుంది. ఇందుకోసం తాము చదువుతున్న స్కూల్స్ నిర్వహించే వీక్లీ టెస్ట్‌లతోపాటు ఇతర ఈ-లెర్నింగ్ మార్గాలను అనుసరించొచ్చు. ప్రస్తుతం అనేక ఈ-లెర్నింగ్ వెబ్‌సైట్స్ విద్యార్థులకు ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహించడమే కాకుండా.. ఆయా టెస్ట్‌లలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నాయి.

ఆఫ్‌లైన్ తరగతులు..
పదో తరగతి విద్యార్థులకు కనీసం రెండు నెలలైనా తరగతి బోధన నిర్వహించాలనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రాక్టికాలిటీ, అప్లికేషన్ అప్రోచ్ ఎక్కువగా ఉండే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సెన్సైస్, నేచురల్ సెన్సైస్ విషయంలో ముఖాముఖి బోధన ఉండాలని సూచిస్తున్నారు. అలాచేస్తేనే విద్యార్థులు అప్పటి వరకు తాము ఆన్‌లైన్‌లో విన్న అంశాలపై మరింత పట్టు సాధించగలరని అంటున్నారు. జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన సబ్జెక్ట్ టీచర్లు ఇప్పటికే సీబీఎస్‌ఈకి ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేశారు.

ఇంకా చదవండి: part 3: కోవిడ్ పరిస్థితుల్లో తగ్గిన పదో తరగతి సిలబస్.. అనుకూలమా.. ప్రతికూలమా..?

Published date : 03 Dec 2020 02:40PM

Photo Stories