ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం పరీక్ష విధానం ఇలా..
ఇదే సమయంలో జేఈఈ మెయిన్ సెషన్స్‌కు సైతం విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంటుంది. దాంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విద్యార్థుల దృష్టంతా ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు జేఈఈ మెయిన్‌పైనే ఉండనుంది. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ ఎంపీసీ సెకండియర్ విద్యార్థులకు ఉపయోగపడేలా సమగ్ర ప్రిపరేషన్ ప్లాన్...
మ్యాథ్స్- ఐఐ ఎ..
ఆల్‌జీబ్రా-కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 4 మార్కుల ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్న, డీమోర్స్ థీరమ్‌పై రెండు 7 మార్కులు, ఒక 2 మార్కుల ప్రశ్న, క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ నుంచి ఒక 4 మార్కులు, ఒక 2 మార్కుల ప్రశ్న, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి రెండు 7 మార్కులు, ఒక 2 మార్కుల ప్రశ్న, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి రెండు 4 మార్కులు, మూడు 2 మార్కుల ప్రశ్నలు అడుగుతారు. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఒక 4 మార్కుల ప్రశ్న, ప్రాబబిలిటీ-మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్ నుంచి ఒక 7 మార్కులు, ఒక 2 మార్కుల ప్రశ్న, ప్రాబబిలిటీ నుంచి ఒక 7 మార్కులు, రెండు 4 మార్కుల ప్రశ్నలు;, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక 7 మార్కులు, ఒక 2 మార్కుల ప్రశ్న అడుగుతారు.
మ్యాథ్స్- ఐఐ బి..
లోకస్ నుంచి రెండు 4 మార్కులు, స్ట్రైట్‌లైన్ నుంచి రెండు 2 మార్కులు, ఒక 4 నాలుగు మార్కులు, ఒక 7 మార్కులు, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 4(బి),4(సి) రెండు 7 మార్కుల ప్రశ్నలు, 3డీ కోఆర్డినేట్స్ నుంచి ఒక 2 మార్కుల ప్రశ్న, ప్లేన్ నుంచి ఒక 2 మార్కుల ప్రశ్న, డైరక్షన్ రేషియోస్, డెరైక్షన్ కొసీన్స్ నుంచి ఒక 7 మార్కులు ప్రశ్న, లిమిట్స్ అండ్ కంటిన్యుటీ నుంచి రెండు 2 మార్కులు, ఒక 4 మార్కుల ప్రశ్న, టాంజెంట్ అండ్ నార్మల్ 10(బి), 10(డి) నుంచి ఒక 2 మార్కులు, ఒక 4 మార్కుల ప్రశ్న, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఫంక్షన్స్ 10(జి) ఒక 2 మార్కులు, ఒక 4 మార్కుల ప్రశ్న, మ్యాగ్జిమ అండ్ మినిమ 10(హెచ్) నుంచి ఒక 7 మార్కుల ప్రశ్న వస్తుంది.
ఫిజిక్స్..
- 8 మార్కులు: వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై నుంచి ఒక ప్రశ్న చొప్పున అడుగుతారు.
- 4 మార్కులు: రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్, ఆటమ్స్, సెమికండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఛాప్టర్స్ నుంచి ఒక్కో ప్రశ్న చొప్పున అడుగుతారు.
- 2 మార్కులు: రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వేవ్స్, సెమికండక్టర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఛాప్టర్ల నుంచి ఒకటి చొప్పున, మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్, డ్యూయల్ నేచుర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ ఛాప్టర్ల నుంచి రెండు చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
కెమిస్ట్రీ..
- సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, సర్ఫేజ్ కెమిస్ట్రీ, డి-బ్లాక్, ఎఫ్-బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, బయోమాలిక్యూల్స్, హాలో ఆల్కేన్స్-హాలో ఎరీన్స్ ఛాప్టర్ల నుంచి ఒక 4, ఒక 2 మార్కుల ప్రశ్న చొప్పున అడుగుతారు.
- ఎలక్ట్రో కెమిస్ట్రీ+ కెమికల్ కైనటిక్స్ నుంచి ఒక 8 మార్కులు, ఒక 4 మార్కులు, ఒక 2 మార్కులు, పి-బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక 8 మార్కులు, ఒక 4 మార్కులు, రెండు 2 మార్కులు, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సి, హెచ్ అండ్ ఓ, కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్స్ ఛాప్టర్ల నుంచి ఒక 8 మార్కులు, ఒక 2 మార్కుల ప్రశ్న న చొప్పున అడుగుతారు.