Skip to main content

అకడమిక్ స్థాయిలోనే అడుగులువేస్తే.. కోడింగ్‌లో కొలువు సులువు..!

కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొంటున్న ఏఐ-ఎంఎల్, ఐఓటీ, డేటాఅనలిటిక్స్‌కు డిమాండ్ నెలకొంది. దాంతో అకడమిక్ స్థాయిలోనే కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను నేర్చుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

బీటెక్ స్థాయిలోనే ఏఐ -ఎంఎల్, ఐఓటీ బ్రాంచ్‌లతో పూర్తి స్థాయి బీటెక్ కోర్సులను అందించేందుకు ఏఐసీటీఈ అనుమతి చ్చింది. పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో 2020 విద్యా సంవత్సరం నుంచి ఈ బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఎలక్టివ్స్, మైనర్ కోర్సులుగా ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే కోడింగ్ నేర్చుకునే అవకాశం ఏర్పడింది.

కోడింగ్ జాబ్ ప్రొఫైల్స్..
కోడింగ్ స్కిల్స్ ఉన్న వారికి ప్రస్తుతం కోడింగ్ ప్రోగ్రామర్, ఎగ్జిక్యూటివ్, ప్రోగ్రామింగ్ టీమ్ లీడర్, డిజైన్ ఇంజనీర్, డిజైన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో కొలువులు లభిస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు ఎంట్రీ లెవల్‌లో ఎగ్జిక్యూటివ్స్‌గా రూ.4 లక్షల నుంచి రూ. 5లక్షల వేతనం, పని అనుభవం ఉన్న వారికి రూ.8లక్షల వరకు వేతనం అందుతోంది.

ఇంకా చదవండి: part 5: క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో వీరికే ప్రాముఖ్యత ఇస్తున్న కంపెనీలు..

Published date : 06 Feb 2021 02:56PM

Photo Stories