ఐఐటీల్లో చదవాలనుకునే వారికి మరోదారి.. యూసీడ్.. సమాచారం ఇదిగో..
రకరకాల అందమైన వస్తువుల రూపకల్పన వెనుక డిజైన్ నిపుణుల కృషి ఉంటుంది. ప్రస్తుతం డిజైనింగ్ రంగం విస్తరిస్తోంది. వినియోగదారుల ఆసక్తులకు తగ్గట్టు వస్తువులను డిజైన్ చేసే నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా డిజైనింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయి. తాజాగా దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఐఐటీల్లో యూజీ, పీజీ స్థాయి డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే యూసీడ్, సీడ్–2021కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. యూసీడ్, సీడ్ పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ, కెరీర్ అవకాశాలపై కథనం...
అర్హతలు..
యూసీడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్/10+2ఉత్తీర్ణత ఉండాలి. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ గ్రూపుల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు సైతం దరఖాస్తుకు అర్హులే.
వయసు..
1996, అక్టోబరు 1న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు లభిస్తుంది.
ఇన్‌స్టిట్యూట్‌లు..
- ఐఐటీ బాంబే.. యూసీడ్ 2021 నిర్వహణ, జాయింట్ సీట్ అలొకేషన్ ప్రక్రియను చేపడుతుంది. యూసీడ్ ద్వారా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్స్..
- ఐడీసీ స్కూల్ ఆఫ్ డిజైన్, ఐఐటీ బాంబే
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజైన్, ఐఐటీ గువహటి
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజైన్, ఐఐటీ హైదరాబాద్
- ఐఐఐటీడీఎం, జబల్‌పూర్.
సీట్ల వివరాలు..
- ఐఐటీ బాంబే–37
- ఐఐటీ గువహటి–56
- ఐఐటీ హైదరాబాద్–20
- ఐఐటీడీఎం జబల్‌పూర్–66
- మొత్తం సీట్ల సంఖ్య:– 179.
యూసీడ్, సీడ్ ముఖ్యసమాచారం..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఫీజు: మహిళా,ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ కేటగిరీల అభ్యర్థులకు రూ.1750, ఇతరులకు రూ.3500.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 10,2020
- హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: జనవరి 1, 2021
- యూసీడ్, సీడ్ –2021 ఎగ్జామినేషన్: జనవరి 17, 2021
- యూసీడ్ ఫలితాల వెల్లడి: మార్చి 10
- సీడ్ ఫలితాలు: మార్చి 8; బీడీఈఎస్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు తేదీలు: మార్చి 11–31
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.uceed.iitb.ac.in/2021