ఐఐటీల్లో.. బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం !
Sakshi Education
ఐఐటీలు.. దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు! ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది.. ఐఐటీలే!! నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యకు కేరాఫ్‌గా నిలిచే ఐఐటీల్లో.. బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో భారీ సంస్కరణలకు తెరలేచింది. ముఖ్యంగా ఎంటెక్ కోర్సు వార్షిక ఫీజును రూ.2 లక్షలకు పెంచుతూ.. ఇటీవల ఐఐటీల బోర్డ్ ఆఫ్ కౌన్సెల్ నిర్ణయం తీసుకుంది. బీటెక్‌లోనూ విద్యార్థులకు ఎగ్జిట్ ఆఫ్షన్ కల్పించింది.
మూడేళ్ల తర్వాత కోర్సు మానేసే విద్యార్థులకు బీఎస్సీ డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఎంటెక్ ఫీజు భారీగా పెంచడంపై విభిన్న అభి ప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... ఐఐటీల్లో తాజా సంస్కరణలపై విశ్లేషణాత్మక కథనం...
ఐఐటీల్లో ఎంటెక్ కోర్సులో సంస్కరణలపై గతేడాది ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ఐఐటీ–హైదరాబాద్ ప్రస్తుత డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఐఐటీ–జమ్ము డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ ఎస్.గౌర్, ఐఐటీ–ఢిల్లీ ప్రొఫెసర్ ఎం.బాలకృష్ణన్‌లు సభ్యులు. కమిటీ ఐఐటీల్లో ఎంటెక్ కోర్సు పరంగా పలు సిఫార్సులు చేసింది.
పది రెట్లు పెరిగిన ఎంటెక్ ఫీజు :
కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ఇటీవల సమావేశమైన ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్.. ఎంటెక్ వార్షిక ఫీజును రూ.రెండు లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక ఫీజు రూ.20,000. అంటే ఐఐటీల్లో ఎంటెక్ ఫీజు పది రెట్లు పెరగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్రమేణా మూడేళ్లలో ఫీజు పెంపును అమలు చేయాలని బోర్డ్ నిశ్చయించింది. ఇది ఎంటెక్ ఔత్సాహిక విద్యార్థులపై ఆర్థిక భారంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బీటెక్‌కు వార్షిక ఫీజు రెండు లక్షలు చెల్లిస్తున్నందున ఎంటెక్ ఫీజు పెంపు ఏమంత ఆందోళనకరం కాదన్నది ఐఐటీ వర్గాల వాదన. అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి స్కాలర్‌షిప్ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
టీచింగ్ అసిస్టెంట్‌షిప్‌కు స్వస్తి :
గేట్ స్కోర్ ఆధారంగా ఎంటెక్‌లో చేరే విద్యార్థులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.12,400 టీచింగ్ అసిస్టెంట్‌షిప్‌కు సైతం స్వస్తి పలకనున్నారు. ఫీజుల పెంపు వల్ల సదరు ఐఐటీల్లోని ఆయా డిపార్ట్‌మెంట్స్‌కు చేకూరే ఆదాయం నుంచి టీచింగ్ అసిస్టెంట్‌షిప్ అందివ్వాలని నిర్ణయించారు. అదే విధంగా గేట్‌లో ఆయా బ్రాంచ్‌ల వారిగా టాప్ వన్ పర్సంటైల్‌లో నిలిచి.. నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందే విద్యార్థులకు అయిదేళ్లపాటు పూర్తి స్థాయిలో ఫెలోషిప్ లభించనుంది.
నియామకాల్లోనూ మార్పులు :
ఐఐటీల్లో అధ్యాపక నియామకాల్లోనూ భారీ మార్పులు జరిగే అవకాశముంది. ముఖ్యంగా విదేశీ ఫ్యాకల్టీ నియామకం పరంగా ప్రస్తుత నిబంధనలను సరళీకృతం చేయాలని నిర్ణయించారు. ఫలితంగా విదేశీ ఫ్యాకల్టీని ఆకర్షించొచ్చని భావిస్తున్నారు. తద్వారా ఐఐటీల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలకు అవకాశం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే విధంగా పీహెచ్‌డీ తర్వాత మూడేళ్ల అనుభవం తప్పనిసరి అనే నిబంధననను సడలించనున్నారు.
టెన్యూర్ ట్రాక్ సిస్టమ్ :
ఐఐటీల్లో అధ్యాపకుల నియామకం, కొనసాగింపు పరంగా భారీ మార్పులు జరిగే అవకాశముంది. ఫ్యాకల్టీ పనితీరును అంచనా వేసేందుకు ట్రెన్యూర్ ట్రాక్ సిస్టమ్ అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా అధ్యాపకుల బోధన, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించే వీలుంటుంది. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ పనితీరును ప్రతి మూడేళ్లకోసారి ఇన్‌స్టిట్యూట్ అంతర్గత సమీక్ష సంఘం, ప్రతి అయిదేళ్లకోసారి ఎక్స్‌టర్నల్ రివ్యూ కమిటీ సమీక్షిస్తుంది. రివ్యూ కమిటీల నివేదిక ఆధారంగా సదరు ఫ్యాకల్టీని కొనసాగించాలా? పదోన్నతి ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.
మార్కెట్ డిమాండ్ కోర్సులు :
జాబ్ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని ఐఐటీలు నిర్ణయించాయి. ఫలితంగా విద్యార్థులకు జాబ్‌రెడీ స్కిల్స్‌తోపాటు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం–ఎంటెక్ పూర్తిచేసుకున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో లభిస్తున్న ఉద్యోగాల సంఖ్య తక్కువే. కాబట్టి మార్కెట్ డిమాండింగ్ కోర్సులను ప్రవేశ పెడితే.. ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్స్ సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా ఎంటెక్‌లో సీట్ల సంఖ్య మిగిలిపోవడమనే సమస్యకు పరిష్కారం సైతం లభిస్తుంది.
సంస్కరణలకు కారణమిదే..
ఐఐటీలు ఎంటెక్‌లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి పలు కారణాలు దోహదం చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక శాతం మంది విద్యార్థులు బీటెక్ తర్వాత ఉద్యోగం రాకుంటేనే ఎంటెక్ కోర్సులో చేరుతున్నారనే భావన నెలకొంది. అలా చేరుతున్న విద్యార్థులు అకడమిక్స్, రీసెర్చ్ పరంగా అనాసక్తిగా ఉంటున్నారనే అభిప్రాయ వ్యక్తమైంది. అంతేకాకుండా ఎంటెక్ చదువుతున్న సమయంలో ఉద్యోగం వస్తే మధ్యలోనే కోర్సు మానేసి వెళ్లిపోతున్నారు. దీంతో ఐఐటీలపై ఆర్థికంగా భారం పడుతోంది. దాంతో నిజంగా ఆసక్తి ఉన్న విద్యార్థులు మాత్రమే ఎంటెక్‌లో చేరేలా చూడటంతోపాటు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందేందుకే ఫీజుల పెంపు మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
మధ్యలో మానేస్తే బీఎస్సీ డిగ్రీ :
ఐఐటీలు బీటెక్ కోర్సులోనూ భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి. డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాయి. గత రెండేళ్లలో ఐఐటీల్లో 2,461 మంది విద్యార్థులు మధ్యలోనే మానేశారు. దీనికి ఆసక్తి లేకున్నా కోర్సులో చేరడంతోపాటు అకడమిక్‌గా రాణించలేకపోవడం ముఖ్య కారణాలుగా చెప్పొచ్చు. డ్రాప్–అవుట్స్æ సంఖ్య మొదటి సంవత్సరం తర్వాతే ఎక్కువగా ఉంటోంది. తాజా నిర్ణయం ప్రకారం– నాలుగేళ్ల బీటెక్‌లో చేరి.. అకడమిక్‌గా రాణించలేకపోతున్న విద్యార్థులకు మూడో ఏడాది తర్వాత కోర్సు నుంచి వైదొలిగే వెసులుబాటు లభించనుంది. ఇలాంటి విద్యార్థులు రెండో సెమిస్టర్(మొదటి ఏడాది) తర్వాత బీఎస్సీ ఇంజనీరింగ్ చదువుతామని తెలియజేయాల్సి ఉంటుంది. వీరికి బీఎస్సీ ఇంజనీరింగ్‌కు సంబంధించిన అంశాలను బోధిస్తారు. మూడేళ్ల తర్వాత బీఎస్సీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అందిస్తారు. మూడేళ్ల తర్వాత బీఎస్సీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అవకాశం కల్పిస్తే డ్రాప్–ఔట్స్ సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.
విదేశీ విద్యార్థులకు నేరుగా..
విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయులకు, అదే విధంగా విదేశీ విద్యార్థులకు.. జేఈఈ–మెయిన్ ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా నేరుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి లభించనుంచి. దీనివల్ల ఐఐటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.ఫలితంగా అంతర్జాతీయ ర్యాంకుల పరంగా భవిష్యత్తులో మరింత ముందంజలో నిలవొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ చూపుతున్న విదేశీ విద్యార్థులకు ఆకర్షణీయమైన స్కాలర్‌షిప్‌లు అందించేలా ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నారు.
స్వయం ప్రతిపత్తి దిశగా..
మొత్తం మీద కమిటీ సిఫార్సులకు ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం తెలపడం, ఎంహెచ్‌ఆర్‌డీ సైతం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఐఐటీలు స్వయం ప్రతిపత్తి దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి ఇస్తూ ప్రత్యేక బిల్లు సైతం రూపొందించినప్పుడు ఐఐటీల విషయంలో సంశయించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా.. ఐఐఎంల్లో ఎంబీఏకు దాదాపు ఇరవై లక్షలు వెచ్చిచేందుకు సైతం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎంటెక్ ఫీజును రూ.రెండు లక్షలకు పెంచడంపై ప్రతతికూల భావన సరికాదంటున్నారు.
ఐఐటీలు.. తాజా సంస్కరణలు :
అన్ని వర్గాలకు అనుకూలమే..
తాజా సిఫార్సులు అన్ని వర్గాలకూ అనుకూలమే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎంటెక్‌లో చేరే విద్యార్థుల్లో సీరియస్‌నెస్‌ను పెంచడానికి, అదే విధంగా కోర్సులు, కెరీర్ పరంగా జాబ్ రెడీ స్కిల్స్ అందించడానికి తాజా సిఫార్సులు దోహదం చేస్తాయి. ఫీజుల పెంపు విషయంలోనూ ఆందోళన చెందక్కర్లేదు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా స్కాలర్‌షిప్స్, విద్యా రుణాలు సులభంగా లభిస్తాయి.
–ప్రొఫెసర్.బి.ఎస్.మూర్తి, డైరెక్టర్, ఐఐటీ–హైదరాబాద్ (ఎంటెక్ సంస్కరణల సిఫార్సు కమిటీ సభ్యులు)

- ఎంటెక్ వార్షిక ఫీజు రూ. రెండు లక్షలకు పెంచాలని నిర్ణయం.
- ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కొత్త స్పెషలైజేషన్స్.
- అధ్యాపకుల పనితీరుపై ప్రతి మూడేళ్లు, అయిదేళ్లకోసారి సమీక్ష
- బీటెక్ విద్యార్థులకు మూడేళ్ల తర్వాత బీఎస్సీ సర్టిఫికెట్‌తో ఎగ్జిట్ ఆప్షన్
- 2020–21 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త సంస్కరణలు
అన్ని వర్గాలకు అనుకూలమే..
తాజా సిఫార్సులు అన్ని వర్గాలకూ అనుకూలమే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎంటెక్‌లో చేరే విద్యార్థుల్లో సీరియస్‌నెస్‌ను పెంచడానికి, అదే విధంగా కోర్సులు, కెరీర్ పరంగా జాబ్ రెడీ స్కిల్స్ అందించడానికి తాజా సిఫార్సులు దోహదం చేస్తాయి. ఫీజుల పెంపు విషయంలోనూ ఆందోళన చెందక్కర్లేదు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా స్కాలర్‌షిప్స్, విద్యా రుణాలు సులభంగా లభిస్తాయి.
–ప్రొఫెసర్.బి.ఎస్.మూర్తి, డైరెక్టర్, ఐఐటీ–హైదరాబాద్ (ఎంటెక్ సంస్కరణల సిఫార్సు కమిటీ సభ్యులు)
Published date : 07 Oct 2019 04:02PM