‘ఐఐఎస్సీ’ 2020-21 యూజీ, పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ వివరాలు..
Sakshi Education
సైన్స్ పరిశోధనలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు కనే ఇంటర్(ఎంపీసీ) విద్యార్థులకు సరైన వేదిక.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు.
ఇది గణితం, సైన్స్ పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థ. ఐఐఎస్సీ అందించే నాలుగేళ్ల బీఎస్సీ రీసెర్చ్ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు.. దేశ విదేశాల్లో ఉజ్వల అవకాశాలు అందుకోవచ్చు. 2020-21 విద్యా సంవత్సరానికి ఐఐఎస్సీలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఐఐఎస్సీ అందిస్తున్న కోర్సులు.. వాటి ప్రత్యేకత.. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై సమగ్ర సమాచారం.
ఐఐఎస్సీ బెంగళూరు:
దేశంలోనే ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థ.. ఐఐఎస్సీ, బెంగళూరు. ఇది 1909లో 371 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు 1958లో విశ్వవిద్యాలయ హోదా లభించింది. 2018లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా వరించింది. ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు ఇచ్చే ర్యాంకింగ్‌లో టాప్‌లో కొనసాగుతున్న ఉన్నత విద్యా సంస్థగా పేరొంది. జనరల్ అండ్ అప్లయిడ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ టెక్నాలజీ విభాగాలతో ప్రారంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం ఆరు సబ్జెక్టులతో 40కుపైగా విభాగాలతో పలు రకాలు కోర్సులను అందిస్తోంది.
అందిస్తున్న కోర్సులు :
ఐఐఎస్సీ బెంగళూరు.. ప్రస్తుతం నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్ ప్రోగ్రామ్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎంటెక్(పీజీ ఎంటెక్), పీజీ(ఎంఈ)కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితోపాటు ఎంటెక్/ఎండిజైన్, ఎం.మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది.
బీఎస్సీ రీసెర్చ్ :
ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు. మొదటి మూడు సెమిస్టర్లు అందరికీ కామన్. ఆ తర్వాత మూడు సెమిస్టర్లలో స్పెషలై జేషన్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. నాలుగో ఏట పరిశోధనల దిశగా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ పూర్తిచేయాలి. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు... ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, మెటీరియల్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్. వీటిలో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. విద్యార్థికున్న ఆసక్తితోపాటు మొదటి మూడు సెమిస్టర్లలో చూపిన ప్రతిభ ఆధారంగా స్పెషలైజేషన్‌ను కేటాయిస్తారు.
యూజీ కోర్సులకు అర్హతలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
యూజీ కోర్సులకు దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2020
పీజీ కోర్సులకు దరఖాస్తు చివరి తేదీ: 23 మార్చి 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ug.iisc.ac.in

- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యలో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా ఉండి, 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
- ఇంటర్మీడియట్‌లో బయాలజీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో ఏదైనా ఒక సబ్జెక్టుతోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్‌లు సబ్జెక్టులుగా ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- 2019లో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు 2020లో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్): మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్),మాస్టర్ ఆఫ్ డిజైన్(ఎం.డిజైన్) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు బీఈ, బీటెక్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి.. ఆగస్టు 01, 2020కి గేట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.
- మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఎం.ఎంజీటీ): ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, బీ.డిజైన్, బీఆర్క్‌లో డిగ్రీ పట్టాను పొంది ఉండాలి. ఆగస్టు 01, 2020 వరకు వ్యాలిడ్ స్కోర్‌తో గేట్, సీడ్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.
- ఐఐఎస్సీలో ప్రవేశాల కోసం కేవీపీవై-ఎస్‌ఏ(2018 ఫెలోషిప్‌లకు ఎంపికైనవారు), కేవీపీవై-ఎస్‌బీ (2019 ఫెలోషిప్‌లకు ఎంపికైనవారు), లేదా ఐఐటీ జేఈఈ-2020 మెయిన్స్-2020, జేఈఈ అడ్వాన్స్-2020లో 60శాతం మార్కుల సాధించిన వారు, నీట్-యూజీలో 60శాతం మార్కులు సాధించిన అభ్యర్థుల ర్యాంకుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- ఎంటెక్ కోర్సులో ప్రవేశాల కోసం అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్(గేట్ 2018/ 2019/ 2020 సాధించిన స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోని ఎంపిక చేస్తారు.
- ఎండిజైన్ కోర్సులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్(సీడ్-2020)లో అర్హత సాధించిన వారై ఉండాలి.
- ఎంజీటీ(మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్) ఎంపికకు సంబంధించి అభ్యర్థులు గేట్ 2018/ 2019/-2-0-20 సాధించిన స్కోర్‌ను లేదా క్యాట్, జీమ్యాట్-2020కి సంబంధించిన ఆగస్టు 01, 2020 వరకు వ్యాలిడ్ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి.
- ఐఐఎస్సీ యూజీకి దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250లను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
- ఐఐఎస్సీ పీజీకి దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400లను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
యూజీ కోర్సులకు దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2020
పీజీ కోర్సులకు దరఖాస్తు చివరి తేదీ: 23 మార్చి 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ug.iisc.ac.in
Published date : 18 Feb 2020 05:38PM