Skip to main content

అభ్యర్థుల్లోని ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఉద్ధేశించిన ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌.. ఏడాదికి 48సార్లు..

అభ్యర్థుల్లోని ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఉద్దేశించిన మరో లాంగ్వేజ్‌ టెస్ట్‌.. ఐఈఎల్‌టీఎస్‌ (ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌). ఈ పరీక్ష స్కోర్‌ను యూకే, ఆస్ట్రేలియాలకు చెందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

పరీక్ష ఇలా: ఈ పరీక్ష కూడా రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్‌పై మొత్తం నాలుగు విభాగాల్లో జరుగుతుంది. పరీక్ష సమయం 2.45 గంటలు.

ఏడాదికి 48సార్లు: ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష ఏడాది పొడవునా జరుగుతుంది. నెలకు నాలుగుసార్లు చొప్పున సంవత్సరానికి 48సార్లు ఉంటుంది. ఎన్నిసార్లు రాయొచ్చు అనేదానిపై అభ్యర్థులకు ఎలాంటి పరిమితి లేదు. రెండు ప్రయత్నాల్లో బెస్ట్‌ స్కోర్‌ సొంతం చేసుకోవడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం.

బ్యాండ్స్‌గా స్కోరు: ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు బ్యాండ్స్‌ రూపంలో 1నుంచి 9 మధ్య ఉంటుంది. ఇందులో 6 బ్యాండ్లు పొందితే ప్రవేశం సులభం అవుతుంది. స్కోరు కాలపరిమితి మూడేళ్లు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ielts.org
 
Published date : 05 Mar 2021 05:17PM

Photo Stories