Skip to main content

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2015-16

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నమేది లేదు. అప్పులు సాకుగా చూపిఅన్ని రంగాలకు అరకొర విదిలింపులే. రైతుల రుణ మాఫీకి రూ. 4,300 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఊసే లేదు. మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ పేరుతో కేవలం రూ. 1,000 కోట్లు ప్రతిపాదించారు. చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు మాట లేదు. ఎన్‌టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లను ప్రారంభం కాకముందే ఎత్తేశారు. ఇలా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వేటికీ ఈ బడ్జెట్‌లోనూ కేటాయింపులు లేవు. ముఖ్య రంగాలకు కేటాయింపుల నిరుత్సాహం కలిగించాయి. రాష్ట్ర ప్రభుత్వం కష్టాలను ఏకరువు పెడుతూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రూ. 7,300 కోట్ల రెవెన్యూ లోటుతో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,13,049 కోట్ల బడ్జెట్‌ను మార్చి 12న అసెంబ్లీకి సమర్పించారు.
+ బడ్జెట్ ముఖ్యాంశాలు
+ వ్యవసాయానికి రూ. 7,307 కోట్లు
+ డ్వాక్రా రుణమాఫీకి రివాల్వింగ్ ఫండ్
+ ‘రాజధాని’ భూ సమీకరణకు రూ.94 కోట్లు
+ విద్యకు రూ.17,729 కోట్లు
+ పన్నుల ద్వారా రూ.7 వేల కోట్ల ఆదాయం
+ రాష్ట్ర అప్పు రూ. 1,46,852.53 కోట్లు
+ రోడ్లు, భవనాలకు రూ.2,960 కోట్లు
+ బీసీ సంక్షేమానికి రూ.3,231.83 కోట్లు
+ఆరోగ్యానికి 5,728 కోట్లు
+ సబ్‌ప్లాన్లకు 7,782 కోట్లు
+ ఇతర కేటాయింపులు
+ అంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16
+ అంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2014-15

AP Budget 2015 - 16 Speech - Telugu | English
Published date : 14 Mar 2015 02:15PM

Photo Stories