Bank of India Jobs 2023 : బ్యాంకు ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే..

క్రెడిట్ ఆఫీసర్ పోస్టుకు ఏదేని డిగ్రీ, ఐటీ ఆఫీసర్ పోస్టుకు బీఈ, బీటెక్ అర్హత కలిగి ఉండాలి. 21–29 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలి(రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు).
రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 175/-). ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు జీతం రూ.36,000-రూ.63,840 ఉంటుంది.
పరీక్షా విధానం :

ఇంగ్లిష్ లాంగ్వేజ్(35 ప్రశ్నలు, 40 మార్కులు ), రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్(45 ప్రశ్నలు, 60 మార్కులు), జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్(40 ప్రశ్నలు, 40 మార్కులు), డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్(35 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ పేపర్-లెటర్ రైటింగ్ & ఎస్సే(2 ప్రశ్నలు, 25 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.మొత్తం 157 ప్రశ్నలు, 225 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
బ్యాంకు ఆఫ్ ఇండియా 500 పోస్టుల పూర్తి వివరాలు ఇవే..