APPSC & TSPSC Jobs Preparation Schedule : ఈ ప్రిపరేషన్ షెడ్యుల్ ఫాలో అయితే.. గ్రూప్స్ జాబ్ మీదే..!
Sakshi Education
గ్రూప్స్ జాబ్స్ కోసం చాలా ఏళ్లగా ప్రయత్నిస్తున్నారా లేక కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టి ఎలా చదవాలో ఎన్ని గంటలు చదవాలో అర్థంకాక సతమతమవుతున్నారా.. అయితే ఈ ప్రిపరేషన్ ప్లాన్ మీ కోసమే..
- గ్రూప్స్ సాధించాలనుకొనే ప్రతి ఒక్కరు ఉదయం 6గం నిద్రలేవాలి. 6గం నుంచి 6గం 30 నిమిషాలలోపు అన్ని కార్యక్రమాలు ముగించుకోవాలి.
- ఉదయం 6గం 30ని నుంచి 8గం 30ని వరకు మెంటల్ ఎబిలిటి, కరెంట్ అఫైర్స్ చదవాలి. ఉదయాన్నే మనస్సు ప్రశాంతంగా ఉండటంవల్ల మెంటల్ ఎబిలిటి, కరెంట్ అఫైర్స్ బాగా గుర్తుండిపోతాయి.
- 8.30 నుంచి 9.30 వరకు బ్రేక్. ఈ సమయంలో స్నానం, టిఫిన్ వంటి కార్యక్రమాలను ముగించుకోవాలి.
9.30గం నుంచి 1 గం వరకు ప్రిపరేషన్ ప్లాన్
- 9.30గం నుంచి 11.30గం వరకు ఎకానమీ చదవాలి. ఈ సమయంలో మన మనస్సు, శరీరం(స్నానం చేసినవారికి) రెండు ఫ్రెష్‌గా ఉండటంవలన ఎకానమీ సబ్జెక్ట్ చాలా బాగా అర్థమవుతుంది.
- 11.30గం నుంచి 11.40గం వరకు బ్రేక్
- 11.40 గం నుంచి 1 గం వరకు సైన్స్ & టెక్నాలజీ చదవడం ఉత్తమం.
భోజన విరామం
1 గం నుంచి 3 గం వరకు బ్రేక్. ఈ సమయంలో భోజనం చోసి, కాసేపు నిద్రపోవాలి. కాసేపు నిద్రపోవండం వలన మనస్సు, శరీరం రెండు రీఛార్జ్ అవుతాయి
- 3గం నుంచి 4గం వరకు మన మెదడు నిద్రావస్ధలో ఉండటంవలన వలన కాస్త సులువైన సబ్జెక్ట్ ఇండియన్ సొసైటిని చదవడం ఉత్తమం లేదా మీకు సులువైన సబ్జెక్ట్‌ను ఎంచుకోండి.
- 4గం నుంచి 5గం వరకు జాగ్రఫీ చదవండి
- 5గం నుంచి 5.30గం వరకు బ్రేక్
- 5.30గం నుంచి 7.30గం వరకు హిస్టరీ, పాలిటీ. ఈ సమయంలో మన మనస్సు, శరీరం రెండు ఉదయంలానే ఫ్రెష్‌గా ఉండటంవలన హిస్టరీ, పాలిటీ సబ్జెక్ట్‌లు బాగా అర్థమవుతాయి.
- 7.30గం నుంచి 8.30గం వరకు బ్రేక్. ఈ సమయంలో రాత్రి భోజనం ఇతర కార్యక్రమాలను ముగించుకోవాలి.
- 8.30గం నుంచి 10.00గం రివిజన్. అన్నింటికంటే ఈ సమయం చాలా ముఖ్యమైనది. ప్రతి రోజు ఈ సమయాన్ని రివిజన్‌కి ఉపయోగించుకోవలి. ఆ రోజు చదివిన మొత్తం సిలబస్‌ను రివిజన్ ఖచ్చితంగా చేయాలి.
ఇలా మీరుగనుక ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ పాటిస్తే ఖచ్చితంగా గ్రూప్స్‌లో ఉద్యోగం సాధించవచ్చు.
గమనిక:
- ప్రతి 45ని ఒకసారి 5ని బ్రేక్ తప్పనిసరి.
- ప్రిపరేషన్ సమయంలో కేవలం సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. కుదిరితే పండ్లు, డ్రై-ఫ్రూట్స్ వంటివి చాలా మంచివి.
- ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఏపీపీఎస్సీ నూతన సిలబస్ ప్రకారం రూపొందించబడినది.
Published date : 13 Oct 2023 12:13PM
Tags
- Groups Jobs Preparation Plan
- How to Prepare for groups
- preparation tips for groups
- preparation tips for competitve jobs
- group jobs
- SuccessTips
- CareerPlanning
- JobInterviews
- exams preparation
- Preparation Tips
- sakshi education groups material
- Sakshi Education Previous Papers
- Career Planning
- Exam Preparation Tips