Skip to main content

Group I: మెయిన్స్‌ అభ్యర్థులకు ఉచిత ఇంటర్వ్యూలు

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు మోడల్‌ ఇంటర్వ్యూల కోసం ఉచిత శిక్షణ, దిశానిర్దేశం చేయనున్నట్టు ఏపీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు కె.హర్షవర్థన్‌ తెలిపారు.
Group I
గ్రూప్–1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

ఈ మేరకు జూన్‌ 10న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. APPSC గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులకు జూన్‌ 15 నుంచి మౌఖి క పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో Department of Social Welfare ఆధ్వర్యంలోని AP Study Circle‌ ద్వారా ఆ అభ్యర్థులకు తగిన తర్ఫీదు ఇచ్చేందుకు మోడల్‌ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులు జూన్‌ 13వ తేదీలోపు https://apstdc.apcfss.in పోర్టల్‌ నందు దరఖాస్తు చేసుకోవాలని హర్షవర్థన్‌ సూచించారు. 

>> Application for Group I Model Interview

చదవండి: 

Published date : 11 Jun 2022 03:29PM

Photo Stories