APPSC: కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు విద్యార్హతలివీ..
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేదా తత్సమాన సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా పారిశ్రామిక శిక్షణ సంస్థలో డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (సర్వేయింగ్ ఒక సబ్జెక్ట్‌గా రెండేళ్ల కోర్సు) పొంది ఉండాలి.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్
దీంతోపాటు జీవో–282 ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా సెంట్రల్ యాక్ట్, లేదా యూజీసీ గుర్తింపు ద్వారా ఏర్పాటైన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి సర్వేయింగ్ మొదలైన అంశాలలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ ఉన్న అభ్యర్థులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్విస్‌లో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్ ఐఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించింది.