Skip to main content

APPSC: గ్రూప్‌–1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు Andhra Pradesh Public Service Commission (APPSC) కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ డిసెంబ‌ర్ 29న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
APPSC
గ్రూప్‌–1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీ ఇదే..

ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఎనిమిదో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్‌–2 పరీక్షలు ఉంటాయని, రాష్ట్రంలోని 18 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని వివరించారు.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

హాల్‌టికెట్లు డిసెంబర్‌ 31 నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌లో (https://psc.ap.gov.in) అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల జాబితా కూడా వెబ్‌సైట్‌లో ఉంటుందని తెలిపారు. హాల్‌టికెట్‌లను ముందుగా డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష కేంద్రం, ఇతర మార్గదర్శకాలు, సూచనలను తెలుసుకోవాలని పేర్కొన్నారు.

Published date : 30 Dec 2022 04:56PM

Photo Stories