Skip to main content

APPSC Group-2 Prelims Best Tips- గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌.. అలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశమే లేదు, స్మార్ట్‌ టిప్స్‌ ఇవే

Elimination Technique in APPSC Group-2 Exam  APPSC Group-2 Prelims Best Tips  Time Management for APPSC Group-2 Prelims

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వ‌హించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలో APPSC గ్రూప్‌-2 నెగిటివ్ మార్కుల విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? APPSC గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ను ఎలా క్లియ‌ర్ చేయాలి..? ఉన్న ఈ స‌మ‌యాన్ని ఎలా ఉప‌యోగించుకోవాలి..? మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌జ్జెక్ట్ నిపుణులు బి. కృష్ణా రెడ్డి గారితో  ప్ర‌త్యేక ఇంట‌ర్య్యూ..


ప్రశ్న: త్వరలోనే గ్రూప్‌-2 పరీక్షకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో సిలబస్‌ను ఎలా మెరుగుపర్చుకోవాలి?
జవాబు: ఇప్పటికే సిలబస్‌ను దాదాపు అభ్యర్థులు అందరూ చదివే ఉంటారు. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది.. కొత్త అంశాల జోలికి వెళ్లకపోవడమే. పరీక్షకు కేవలం 20 రోజులే మిగిలి ఉన్నందున ప్రధానంగా రివిజన్‌ చేసుకోవడం మంచిది. దీంతో పాటు ప్రీవియస్‌ పేపర్స్‌ను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. 

ప్ర: ప్రాక్టీస్‌ టెస్ట్‌ ఏ విధంగా చేయాలి? సబ్జెక్ట్‌ వైస్‌ చేస్తే మంచిదా? ఎలా ప్రిపేర్‌ అవ్వాలి?
జ: ప్రాక్టీస్‌లో ముందుగా చాప్టర్‌ వైస్‌, సబ్జెక్ట్‌ వైస్‌, ఆ తర్వాత మోడల్‌ పేపర్‌ వైస్‌ ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. 

ప్ర: హిస్టరీ, జాగ్రఫీ వంటి సబ్జెక్స్‌ ఎంత చదివినా ఇంకా ఏదో మిగిలి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ఎలాంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్‌ పెడితే మంచిది?
జ: మీరు చెప్పింది నిజమే. హిస్టరీ చాలా విస్తారమైన అంశం. కానీ సరిగ్గా ప్లాన్‌ చేసుకొని చదివితే పెద్ద కష్టమేమీ కాదు. చాలామంది హిస్టరీకి సంబంధించి తేదీలు, గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు. కానీ అంత అవసరం లేదు. సామాజిక, ఆర్థిక,సాంస్కృతిక, కట్టడాలు, వినూత్నమైన పరిపాలన, వారసత్వ అంశాలు, సమకాలీన అంశాలు, ప్రభుత్వ చట్టాలు ముఖ్యమైనవి. 
ఇక జాగ్రఫీ విషయానికి వస్తే..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులు, పర్యావరణంలో వస్తున్న మార్పులు, డెమోగ్రఫీ వంటి విషయాలపై ఎక్కువగా ఫోకస్‌ చేయాల్సి ఉంటుంది. 

ప్ర: కరెంట్‌ ఎఫైర్స్‌లో ఎక్కువగా ఏ అంశాలపై ఫోకస్‌ చేయాలి?
జ: అంతర్జాతీయ సమ్మిట్స్‌, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, విద్య,వైద్యం, క్రీడలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యం ఇ‍వ్వాలి. 

ప్ర: కరెంట్‌ ఎఫైర్స్‌లో ఎక్కువగా ఎంత సమయం నుంచి ఎప్పటి వరకు ఉన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి?
జ: గ్రూప్‌-2 అనేది ఆఫ్‌లైన్‌ పరీక్ష కాబట్టి నెల రోజుల ముందుగానే ప్రశ్నపత్రాన్ని ప్రిపేర్‌ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న అంశాలను చేర్చే అవకాశం లేదు. కాబట్టి గతేడాది మార్చి, ఏప్రిల్‌లో జరిగిన అంశాల దగ్గర్నుంచి 2024 జనవరి వరకు జరిగిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే సరిపోతుంది. 

ప్ర: ఈమధ్య కేంద్రంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కదా, వాటికి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందా?
జ: ఇవి ఈ మధ్య జరిగిన అంశాలు కాబట్టి ప్రశ్నపత్రంలో ఉండే ఛాన్స్‌ లేదనే చెప్పొచ్చు. కానీ బడ్జెట్‌లో పేర్కొన్న పథకాలను మాత్రం ఓసారి పరిశీలించుకోవడం మంచిది. 

ప్ర: పరీక్షలకు ఇంకా 20 రోజులే మిగిలి ఉంది. ఎలాంటి షెడ్యూల్‌ చేసుకుంటే మంచిది?
జ:  ప్లాన్‌ చేసుకోవడం ఎంత ముఖ్యమో,దాన్ని ఆచరించడం కూడా అంతే ముఖ్యం. ఈ సమయంలో రోజుకు 10-12 కేటాయించాలి. అయితే కొందరు ఒక సబ్జెక్ట్‌ మొత్తం అయిపోయాక గానీ మరో సబ్జెక్ట్‌ను పట్టించుకోరు. అలా చేస్తే ముందు చదివిన అంశాలు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్‌కు కొంత సమయం తప్పకుండా కేటాయించాలి. దీంతో పాటు నిద్రపోయే ముందు ఆరోజు చదివిన అంశాలను ఓసారి గుర్తు చేసుకొని నిద్రపోవడం మంచిది. 

ప్ర: గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ప్రమాణికం ఎలా ఉండనుంది?
జ:  కొన్ని అంశాలకు సంబంధించి నేరుగానే ప్రశ్నలు అడుగుతుంటారు. కొన్ని అనువర్తన అంశాలు ఉంటాయి. కానీ ప్రమాణాలకు తగ్గట్లుగానే ప్రశ్నలను ప్రిపేర్‌ చేస్తారు. అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అనవసరంగా కంగారు పడాల్సిన పనిలేదు. 

ప్ర: కొన్నిసార్లు అభ్యర్థులను తికమక పెట్టేలా ఒకే ప్రశ్నకు రెండు, మూడు ఆప్షన్స్‌ ఇచ్చి కన్‌ఫ్యూజ్‌ చేసే ప్రశ్నలు వస్తుంటాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి?
జ:  ఎన్ని ఆప్షన్స్‌ ఇచ్చినా ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. ఒక అంశంపై సంపూర్ణ అవగాహన ఉంటే ఎలాంటి సందేహం లేకుండా ఆప్షన్స్‌ను ఎంచుకోవడం సులబమే. 

ప్ర:అభ్యర్థులకు ఇప్పుడు వందలాది బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటివి ఎంచుకోవాలి?
జ: మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులు కూడా బుక్స్‌ ప్రిపేర్‌ చేస్తున్నారు. కాబట్టి ఏది పడితే అవి ఎంచుకోవద్దు. ప్రామాణిక పుస్తకాలనే చదవాలి. ఏదో సమయం తక్కువుందని షార్ట్‌కట్‌లో ఈ బుక్‌ చదివితే సరిపోతుంది, ఆ ప్రశ్న, ఆన్సర్లను బట్టి కొట్టొచ్చు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎలాంటి అంశాలను చదువుతున్నాం, దీన్నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందన్నది ముందే మనకు మనం ప్రశ్నలు వేసుకోవాలి. 

ప్ర: టైం మైనేజ్‌మెంట్‌, నెగిటివ్‌ మార్కింగ్‌.. ఈ రెండింటిని స్మార్ట్‌గా ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?
జ: బాగా చదివిన విద్యార్థులకు నెగిటివ్‌ మార్కులు అడ్వాంటేజీనే. ఎలాగో సబ్జెక్ట్‌ పూర్తిగా తెలిసి ఉంటుంది కాబట్టి ఆఫ్షన్‌ ఈజీగా ఎంచుకోవచ్చు. కానీ ఏదో ఒక ఆప్షన్‌ పెట్టి చూద్దాం అనుకునే వారికి నెగిటివ్‌ మార్కింగ్‌ కాస్త కష్టంగా అనిపించొచ్చు. అందుకే ఇంటలిజెంట్‌ గెస్సింగ్‌ చేయాలి. ఒకవేళ ఆ ప్రశ్నకు సంబంధించి బాగా కన్ఫ్యూజ్‌ అవుతుంటే, ఆ ప్రశ్నను వదిలేయడం మంచిది. ఎందుకంటే, ఆ ప్రశ్నకు సంబంధించిన విషయం ఇంకేదైనా ప్రశ్నలో అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి ఇంటలిజెంట్‌ గెస్సింగ్‌తో సరైన సమాధానం ఎంచుకోవచ్చు. 

చివరగా.. చివరి నిమిషంలో అనవసరంగా ఆందోళన చెందకుండా మీరు చదివింది, గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా పరీక్షను రాయండి. ఆల్‌ది బెస్ట్‌.


 

Published date : 05 Feb 2024 03:23PM

Photo Stories