APPSC Group 1: అత్యున్నత పరీక్షలు.. అద్వితీయ విజయాలు
![appsc group 1 toppers 2023](/sites/default/files/images/2023/08/21/group-1-toppers-2023-1692606329.jpg)
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అత్యున్నత పరీక్షల్లో సిక్కోలు అభ్యర్థులు అద్వితీయ విజయాలు సాధిస్తున్నారు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ, నియామక పరీక్షల్లో జిల్లా యువతీయువకులు సత్తా చాటుతున్నారు. అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు. ఉన్నత కొలువులను దక్కించుకుంటున్నారు. మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో ఇద్దరు విజే తలుగా నిలవగా, రాష్ట్ర స్థాయిలో అత్యున్నత గ్రూప్–1 పరీక్షల్లో తొమ్మిది మంది ఉద్యోగాలను సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది ఎంపికవ్వగా అందులో మన జిల్లాకు చెందిన వారు తొమ్మిది మంది ఉండటం గర్వకారణం.
జిల్లా ఇప్పుడు వెనుకబాటు తనాన్ని వెనక్కి నెట్టి ఉన్నత శిఖరాల వైపు దూసుకుపోతోంది. ముఖ్యంగా యువత ఉన్నత లక్ష్యాలతో దూసుకుపోతున్నా రు. ప్రణాళికాబద్ధంగా కష్టపడి, రేయింబవళ్లూ చదివి అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు. తాజాగా గ్రూప్–1 పరీక్షల ఫలితాలు ఆ విధంగా తేటతెల్లం చేశాయి. తల్లిదండ్రుల ఆశయాలను, కుటుంబ స భ్యుల ఆశలను నెరవేర్చుతూ తొమ్మిది మంది ఉన్న త కొలువులు సాధించారు. కొందరికి తొలి ప్రయ త్నంలో విజయం వరించగా, మరికొందరు రెండు, మూడు ప్రయత్నాల్లో అనుకున్నది సాధించారు. వ్యవసాయ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారైనా పట్టుదలతో ప్రయత్నించి అనుకున్నది సాధించారు.
గ్రూప్– 1లో విజేతలు
- సంతబొమ్మాళి మండలం ఆకాశ లక్కవరం గ్రామానికి చెందిన పరపటి ధర్మారావు కుమార్తె పరపటి సువర్ణ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. రెండేళ్ల కిందట గ్రూప్–2పాసై జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఏఓగా పనిచేస్తున్న ఆమె ఇప్పుడు ఏకంగా గ్రూప్–1లో సత్తా చాటారు.
- నరసన్నపేట మండలం మాకివలస పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ మార్పు దుష్యంత్‌కుమార్ రాష్ట్ర పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సంతబొమ్మాళి మండలం దండు గోపాలపురం గ్రామానికి చెందిన దుష్యంత్ ఎంబీబీఎస్ చేసి మెడికల్ ఆఫీ సర్ ఉద్యోగంలో చేరి, కొన్నాళ్ల తర్వాత గ్రూప్–1కు ప్రిపేరయ్యారు.
- శ్రీకాకుళం నగరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులో నివాసముంటున్న బీసీ సంక్షేమ శాఖ రిటైర్డు వార్డెన్ పోలుమహంతి ఉమామహేశ్వరరావు పెద్ద కుమారుడు పి.వెంకట సాయిరాజేష్ అగ్ని మాపక అధికారి పోస్టుకు, చిన్న కుమారుడు పి.వెంకట సాయి మనోజ్ వైద్య ఆరోగ్యశాఖ పరిపాలనాధికారి పోస్టుకు ఎంపికయ్యారు.
- ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పేడాడ ప్రదీప్తి గ్రూప్–1లో డీఎస్పీ పోస్టు సాధించారు. రెండేళ్ల క్రితం ఆమె గ్రూప్–2 పరీక్షలో విజయం సాధించారు. ఎకై ్సజ్ ఎస్‌ఐగా పనిచేశారు. ప్రదీప్తి తల్లిదండ్రులు అప్పారావు, సుగుణవేణిలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఈమె సోదరి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా ఎంపికై ప్రస్తుతం భారత్ తరఫున ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగంలో కొనసాగుతూ సూడాన్‌లో పనిచేస్తున్నారు.
- శ్రీకాకుళం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన దండా శ్వేత తొలి ప్రయత్నంలోనే గ్రూప్– 1కు ఎంపికై మండల అభివృద్ధి అధికారి పోస్టు సాధించారు. తండ్రి ఆనందరావు పంచాయతీ కార్యదర్శిగా, తల్లి విజయలక్ష్మీ ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
- ఆమదాలవలస మండలం కలివరం పంచాయతీ తమ్మయ్యపేట గ్రామానికి చెందిన కోట రాజశేఖర్ గ్రూప్–1కు ఎంపికై ట్రెజరీ అధికారి పోస్టు సాధించారు. తల్లిదండ్రులు వెంకట రామారావు, సీతమ్మ ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. రాజశేఖర్ సోదరుల్లో ఒకరు వైద్యుడిగా స్థిరపడగా, మరొకరు సివిల్స్‌కు ప్రిపేరవుతున్నారు.
- పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెంది న కూన రాకేష్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సహా య కమిషనర్‌గా ఎంపికయ్యారు. సివిల్స్‌కు ప్రిపేరవుతుండగా గ్రూప్–1లో విజయం సాధించారు.
- నరసన్నపేట మండలం బడాం గ్రామంలోని సామాన్య కుటుంబానికి చెందిన పైడి ప్రదీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ గ్రూప్–1లో విజేతగా నిలిచారు.
అప్పట్లో సివిల్స్‌లోనూ..
- శ్రీకాకుళం మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చల్లా కళ్యాణి దేశ వ్యాప్తంగా నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ 2022 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 286ర్యాంకు సాధించారు. సివిల్స్‌లో మెరిసిన కళ్యాణి తండ్రి అసిరినాయుడు వ్యవసాయంతో పాటు తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నారు.
- సారవకోట మండలం అలుదు గ్రామంలో తన తాతయ్య పొన్నాన కృష్ణమూర్తి ఇంట్లో ఉంటూ చదువుకున్న భవిరి సంతోష్‌కుమార్ సివిల్స్‌లో 607ర్యాంకు సాధించి సత్తా చాటారు.
పాలిటెక్నిక్, పీజీ ప్రవేశ పరీక్షల్లో
- పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పాలిసెట్–2023 ఫలితాల్లో పలాస–కాశీబుగ్గలోని టీచర్స్ కాలనీకి చెందిన లఖినాన వెంకటాచలం, శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీకర్ స్టేట్ 16వ ర్యాంకు సాధించారు. ఎచ్చెర్ల మండలం బుడుమూరు గ్రామానికి చెందిన విక్రమ్‌రాజా స్టేట్ 37ర్యాంకు సాధించారు.
- ఏపీ పీజీ సెట్‌లో శ్రీకాకుళం నగరానికి చెందిన మాలి ప్రవీణ్‌కుమార్ ఫార్మసీ విభాగంలో మొద టి ర్యాంకు సాధించారు. అలాగే, నగరానికి చెందిన సింహాద్రి లహరి కూడా జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో ప్రఽథమ ర్యాంకు సాధించారు.
ఇంజినీరింగ్ పరీక్షల్లో..
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్ మొదటి ర్యాంకు సాధించాడు. నందిగాం మండలం దిమిలాడ గ్రామానికి చెందిన అనిరుద్ సనపల ఖగేశ్వరరావు, ఝాన్సీల కుమారుడు. ఈయనకు జేఈఈ మెయిన్స్‌లో 122, జేఈఈ అడ్వాన్సులో 274వ ర్యాంకు సాధించాడు.
శ్రీకాకుళంలోని అరసవిల్లికి చెందిన బోయిన సంజన తెలంగాణ ఎంసెట్‌లో ఇంజినీరింగ్ విభాగం నుంచి 8వ ర్యాంకు సాధించారు. గణేష్, భాగ్యజ్యోతి దంపతుల కుమార్తె సంజన ఇటీవల వెలువడిన ఏపీ ఎంసెట్‌లో 20వ ర్యాంకు సాధించారు. జేఈఈ అడ్వాన్సులో 282వ ర్యాంకు సాధించారు.
శ్రీకాకుళానికి చెందిన డోల సూర్యసాయి జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా 106 ర్యాంకు సాధించారు. జేఈఈ అడ్వాన్సులో 302వ ర్యాంకు సాధించారు.
ఆమదాలవలసకు చెందిన ఎంవీవీ హర్షవర్ధన్ జేఈఈ మెయిన్స్‌లో 211, జేఈఈ అడ్వాన్సులో 131ర్యాంకు సాధించారు. ఏపీ ఎంసెట్‌లో కూడా హర్షవర్దన్ 29వ ర్యాంకు సాధించారు.
నీట్, అగ్రికల్చర్ విభాగంలో..
పోలాకి మండలం గొల్లవలస పరిధిలోని తోటాడ గ్రామానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి దేశవ్యాప్తంగా నిర్వహించి నీట్ పరీక్షల్లో ఆల్‌ఇండియా మొదటి ర్యాంకు సాధించారు. తెలంగాణ ఎంసెట్‌లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఐదో ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో రెండో ర్యాంకు సాధించారు.
పొందూరుకు చెందిన సాయి వెంకట్ యశ్వంత్‌నాయుడు ఏపీ ఎంసెట్‌లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో స్టేట్ 7వ ర్యాంకు సాధించారు.
శ్రీకాకుళం పీఎస్‌ఎన్‌ఎం స్కూల్ సమీపంలోని కొన్నా వీధికి చెందిన పొట్నూరు ఆశిష్ ఏపీ ఎంసెట్‌లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో స్టేట్ 9వ ర్యాంకు సాధించారు. నీట్ పరీక్షల్లో ఆలిండియా 57వ ర్యాంకు సాఽధించారు. ఓబీసీ కేటగిరీలో 12వ ర్యాంకు సాధించారు.