APPSC: సర్టిఫికెట్ల పరిశీలన తేదీ ఇదే.. ధ్రువీకరణ పత్రాలను ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆయుష్ శాఖలో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ (హోమియోపతి, యునాని, ఆయుర్వేదం) పోస్టులతోపాటు దేవదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను జూలై 14న పరిశీలించనున్నట్లు ఏపీపీఎస్సీ జూలై 7న తెలిపింది.
అభ్యర్థులు మెమో, చెక్‌లిస్టు, ధ్రువీకరణ పత్రాలను కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. వీటితో పాటు మే నెలలో డిపార్ట్‌మెంటల్ టెస్టుకు నోటిఫికేషన్ జారీ చేయగా సంబంధిత పరీక్షను ఆగష్టు 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ టైమ్ టేబుల్‌ను https://psc.ap.gov.inలో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
చదవండి:
IBPS Recruitment 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 4,045 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
APPSC: పరీక్షలకు తేదీలు ఖరారు.. గ్రూప్స్‌లో గెలుపు కోసం నిపుణుల సలహాలు
APPSC Group 2 : 'సైన్స్ & టెక్నాలజీ' పేపర్‌లో ముఖ్యమైన అంశాలు ఇవే.. | APPSC Group-2 Bits | APPSC
Published date : 08 Jul 2023 06:02PM