APPSC: గ్రూప్–1 హాల్ టికెట్లు, పరీక్షల తేదీల వివరాలు
Sakshi Education
సాక్షి, అమరావతి:గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించే మెయిన్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను మే 24వ తేదీ నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఏపీపీఎస్సీ మే 19న ఒక ప్రకటనలో పేర్కొంది.
కమిషన్ వెబ్‌సైట్ నుంచి ఈ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. గ్రూప్–1 మెయిన్ రాత పరీక్షలు జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు సంప్రదాయ విధానంలో, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయని పేర్కొంది.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
Published date : 20 May 2023 03:07PM