Skip to main content

AP Grama Ward Sachivalayam Jobs : 14,000పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది.
ap grama sachivalayam recruitment 2023
ap grama sachivalayam jobs 2023

దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 

దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో..

ap grama sachivalayam recruitment 2023

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి మంజూరు చేయడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. 2019 జూలై – అక్టోబర్‌ మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నియామక ప్రక్రియ నిర్వహించింది.

☛ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మూడో నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు..
అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు 2020 జనవరిలోనే రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేసి, కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. 

ఈ సారి ఆన్‌లైన్‌ విధానంలో రాత‌ప‌రీక్ష‌..
గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. అయితే, గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్‌లైన్‌ (ఓఎమ్మార్‌ షీట్‌– పేపర్, పెన్ను) విధానంలో నిర్వహించగా.. ఈ విడతలో మాత్రం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహణకు పంచాయతీ రాజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది.

➤ ఏపీలో 7,384 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

మూడో విడతలో పలు మార్పులు ఇవే.. ap grama sachivalayam latest news 2023
☛ గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరి ఉద్యోగాలు మినహా మిగిలిన 19 కేటగిరి ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు.
☛ తొలి, రెండో విడతల నోటిఫికేషన్ల సమయంలో ఈ 19 కేటగిరి ఉద్యోగాల భర్తీకి 14 రకాల రాత పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్‌– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు. 
☛ గ్రేడ్‌ – 2 వీఆర్వో, విలేజ్‌ సర్వేయర్‌ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు. మిగిలిన 12 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 12 రకాల రాత పరీక్షలు నిర్వహించారు.

☛ ప్రస్తుతం మూడో విడతలో 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడ్‌– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్,  మహిళా పోలీసు, గ్రేడ్‌ – 2 వీఆర్వో, విలేజ్‌ సర్వేయర్‌ ఉద్యోగాలకు కూడా వేర్వేరుగా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో.. ఆయా కేటగిరి ఉద్యోగాల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా.. మరో కేటగిరి ఉద్యోగ ఖాళీల గురించి వాటి భర్తీని ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరుగా పరీక్షల నిర్వహణ మంచిదని అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు.

➤ AP CM YS Jagan Mohan Reddy : గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీకి ఆదేశం.. ఇంకా అంగన్‌వాడీలను కూడా..

అప్పట్లో రికార్డు స్థాయిలో 21.69 లక్షల మంది..

ap grama ward sachivalayam exam pattern 2023

☛ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019లో రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి మంజూరు చేసిన అనంతరం మొదటిసారి ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు.. అప్పట్లో రికార్డు స్థాయిలో 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో జరిగిన రాత పరీక్షలకు 19 లక్షల మందికి పైగా హాజరయ్యారు.  
☛ మొదటి విడత నోటిఫికేషన్‌లో గ్రేడ్‌– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిని్రస్టేటివ్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా నిర్వహించిన రాత పరీక్షలకు ఏకంగా 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.  
☛ 2020 రెండో విడత జారీ చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్‌కు కూడా దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు 7.69 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

దరఖాస్తులు 8 లక్షలకు పైగా..
☛ ప్రస్తుతం మూడో విడత జారీ చేసే నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు 8 లక్షల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  
☛ మూడో విడత ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షలు నిర్వహించినా, ఒక్కో విడతకు 40 వేల మంది దాకా పరీక్షలు రాసే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే కొన్ని కేటగిరి ఉద్యోగాలకు ఒకే రోజు ఉదయం, సాయంత్రం వేర్వేరు పరీక్షలు జరపడం ద్వారా 20 రోజుల్లో పరీక్షల ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. మొదటి విడత నోటిఫికేషన్‌ సమయంలో తొమ్మిది రోజులు, రెండో విడత ఏడు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించామని అధికారులు చెప్పారు.  

ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌.. ఏప్రిల్‌లో..

ap grama sachivalayam notification 2023

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖతో పాటు వి­విధ శాఖలు ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేశాయి.  కేటగిరీల వా­రీ­గా ఉద్యోగాలకు సంబంధించి ఆయా శాఖ­లు రోస్టర్‌– రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరా­లకు తుది రూపు ఇస్తున్నట్టు అధికార వర్గా­లు తెలిపాయి. ఈ ప్రక్రియ ముగియగానే, ఫిబ్ర­వరిలో నోటిఫికేషన్‌ జారీకి అన్ని ఏర్పా­ట్లు చేసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే ప‌రీక్ష‌ను మాత్రం ఏప్రిల్ నెల‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

ప్రాథమిక సమాచారం మేరకు కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల ఇలా..

కేటగిరీ

ఖాళీలు

గ్రేడ్‌ –5 పంచాయతీ కార్యదర్శులు

182

డిజిటల్‌ అసిస్టెంట్‌

736

వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌

578

విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌

467

హారి్టకల్చర్‌ అసిస్టెంట్‌

1,005

సెరికల్చర్‌ అసిస్టెంట్‌

23

పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌

4,765

ఫిషరీస్‌ అసిస్టెంట్‌

60

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌

982

వీఆర్‌వో గ్రేడ్‌–2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ

112

విలేజ్‌ సర్వేయర్‌ అసిస్టెంట్‌

990

వార్డు అడ్మిని్రస్టేటివ్‌ సెక్రటరీ

170

వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ

197

వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ

153

వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎని్వరాన్‌మెంట్‌ సెక్రటరీ

371

వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ

436

వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ

459

ఏఎన్‌ఎం లేదా వార్డు హెల్త్‌ సెక్రటరీ

618

మహిళా పోలీసు లేదా వార్డు ఉమెన్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్స్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ

1,092

ఎనర్జీ అసిస్టెంట్‌

1,127

మొత్తం

14,523

 గ్రామ, వార్డు సచివాలయ రాత ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ ఉమ్మడి సిలబస్ అంశాలు ఇవే.. :

ap grama ward sachivalayam exam pattern 2023

  • జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్.
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్.
  • ఇంగ్లిష్-తెలుగు కాంప్రెహెన్షన్
  • జనరల్ ఇంగ్లిష్
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు.
  • జనరల్ సైన్స్, దైనందిన జీవితంలో వాటి అనువర్తనాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమకాలీన పరిణామాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్
  • పర్యావరణం - సుస్థిరాభివృద్ధి
  • భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి
  • భారత, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు
  • భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన, రాజ్యాంగ అంశాలు, 73,74వ రాజ్యాంగ సవరణలు, పబ్లిక్ పాలసీ, సంస్కరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి
  • సుపరిపాలన, ఈ గవర్నెన్స్
  • సమాజం, సామాజిక న్యాయం, హక్కులు - సమస్యలు
  • భారత ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక సర్వే, కేంద్ర బడ్జెట్
  • ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
  • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు
  • మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్య్రం, స్వయం సహాయక బృందాలు, సమాజ ఆధారిత సంస్థలు-మహిళా అభ్యున్నతి.
  • జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రాముఖ్యత గల వర్తమాన అంశాలు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ :

ap grama ward sachivalayam jobs

  • గణితంపై పట్టున్న అభ్యర్థులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ తేలికే అని చెప్పొచ్చు. హైస్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ విభాగాల్లో మంచి మార్కులు పొందొచ్చు.
  • అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్‌‌స, పర్ముటేషన్‌‌స-కాంబినేషన్‌‌స, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్, పార్టనర్‌షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తుంచుకోవాలి. వీటివల్ల సింప్లిఫికేషన్‌‌స, నంబర్ సిరీస్ ప్రశ్నల సాధనలో సమయం ఆదా అవుతుంది.
  • జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్ టాపిక్స్‌లో ప్రాథమిక సూత్రాల ద్వారా సదరు అంశాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే వీలుంది.
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్(డీఐ)లో పట్టికలు, గ్రాఫ్‌ల రూపంలో ఉండే సమాచారాన్ని క్రోడీకరించి ఆయా గ్రాఫ్‌ల కింద ఇచ్చే ప్రశ్నలను పరిష్కరించాలి. ఈ డీఐ ప్రశ్నలు పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్ వంటి అర్థమెటిక్ చాప్టర్ల మేళవింపుగా ఉంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో పట్టు కోసం టేబుల్స్, బార్ చార్‌‌ట్స, పై చార్‌‌ట్స మొదలైన వాటిని విస్తృతంగా ప్రాక్టీస్ చేయాలి.

మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ :

  • అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం రీజనింగ్. వివిధ సందర్భాలలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంక్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను తెలివిగా పరిష్కరించే నేర్పును పరీక్షించేందుకు మెంటల్ ఎబిలిటీ విభాగం ఉపయోగపడుతుంది. కోడింగ్, డీ-కోడింగ్, నంబర్ సిరీస్, పోలికలు, ర్యాంకింగ్, రక్త సంబంధాలు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, వెన్ చిత్రాలు, పజిల్స్, క్యాలెండర్, గడియారాలు, రేఖాచిత్రాల గణన, తీర్మానాలు(సిలాయిజమ్స్), దిక్కులు, పాచికలు, దీర్ఘఘనం, చిహ్నాలు, వర్డ్ ఫార్మేషన్, గణిత గుర్తులు, దత్తాంశ విశ్లేషణలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఇంగ్లిష్-తెలుగు కాంప్రెహెన్షన్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా భాషల్లో ఒక పేరా ఇచ్చి.. దానికింద ప్రశ్నలు అడుగుతారు. ఇచ్చిన పేరాను వేగంగా చదివి అర్థంచేసుకొని సమాధానాలు రాసే విధంగా సన్నద్ధమవ్వాలి.

జనరల్ ఇంగ్లిష్ :
హైస్కూల్ స్థాయి ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు వొకాబ్యులరీపై అవగాహన ఉంటే జనరల్ ఇంగ్లిష్ సులువైన విభాగం. రీడింగ్ కాంప్రెహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్‌పై దృష్టిపెట్టాలి. వీటితోపాటు స్పెల్లింగ్‌‌స, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్‌‌స, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్ ద సెంటెన్‌‌స, రీ అరెంజ్ ది సెంటెన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నిబంధనలు ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్‌లో పట్టు కోసం మొదట బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్యాంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీల్లోనూ పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందాలి.
ప్రభుత్వ పథకాలు :

జననేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశ్వాసంతో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టారు. దాంతో ఆయన ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హామీగా ఇచ్చిన ‘నవరత్నాల’ అమలుకు శ్రీకారం చుట్టారు. ఆ దిశగా అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను రూపొందించారు. తక్కువ సమయంలోనే అనేక సంచలనాత్మక బిల్లులను ఆమోదించారు. కాబట్టి సర్కారీ ఉద్యోగాలు చేపట్టబోయే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, కొత్తగా ఆమోదించిన బిల్లులపై సంపూర్ణ అవగాహన అవసరం. అందుకే ప్రతి పథకాన్ని, ప్రతి చట్టాన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బడ్జెట్‌లో ఆయా పథకాలకు కేటాయించిన నిధులు, లబ్ధి పొందుతున్న వర్గాల వివరాలు, అందుకు సంబంధించిన గణాంకాలు, ప్రముఖ సామాజిక అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నిర్ణయాల గురించి అవగాహన పెంచుకోవడం మేలు చేస్తుంది.

 

Published date : 22 Jan 2023 06:56PM

Photo Stories