Skip to main content

AP Grama & Wards Employees : ఒకే విడతలో 1.34 లక్షల ఉద్యోగాలు.. మీ మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రికార్డు స్థాయిలో ఒకే విడతలో తమలాంటి 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభు­త్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ఆందోళనల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యో­గులం పాల్గొనం’ అని గ్రామ, వార్డు సచివా­లయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ స్పష్టంచేసింది.
ap grama and wards employees telugu
ap grama and wards employees

ఈ మేరకు ఫెడ­రేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానిపాషా ఒక ప్రకటన విడుదల చేశారు.

☛ AP Grama & Ward Sachivalayam 2023 Jobs : 14,523 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల‌కు ఫిబ్రవరిలో నోటిఫికేష‌న్‌.. ఏప్రిల్‌లో పరీక్షలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

మీ మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు..

ap grama sachivalayam jobs 2023

‘సీఎం వైఎస్‌  జగన్‌ అధికారం చేపట్టిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బృహత్తర ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి  1.34 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 1.34 లక్షల కుటుంబాలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును మా ఉద్యోగులెవరూ ఎప్పటికీ మరువలేరు.రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగ వ్యవస్థలో సింహ భాగంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడేలా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

 ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

☛ AP Grama/Ward Sachivalayam : ఈ మార్కుల ఆధారంగానే.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ..

ap grama sachivalayam emp telugu news

సచివాలయ ఉద్యోగులు ఎవ్వరూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ఉద్యోగ నాయకులు ఎవ్వరూ మనకు ఉద్యోగాలు కల్పించలేదనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. 

➤ AP CM YS Jagan Mohan Reddy : గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీకి ఆదేశం.. ఇంకా అంగన్‌వాడీలను కూడా..

Published date : 09 Mar 2023 06:51PM

Photo Stories