SI Candidates: 25 నుంచి ఎస్‌ఐ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు
ఆరిలోవ: స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్‌ఐల నియామకాల్లో భాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల కోసం విశాఖ రేంజ్ పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కై లాసగిరిలోని ఏఆర్ పోలీస్ మైదానంలో ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ అనకాపల్లి ఎస్పీ కె.వి.మరళీకృష్ణతో కలసి బుధవారం మైదానాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంతవరకు జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీని ఆదేశించారు. డీఐజీ మాట్లాడుతూ విశాఖ రేంజ్ పరిధిలో నిర్వహించిన రాత పరీక్షలో 17,374 మంది అభ్యర్థులు అర్హత సాధించారన్నారు. వారికి ఈ నెల 25 నుంచి శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన 2,745 మంది మహిళా అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు ప్రత్యేకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మెటాలిక్, స్పైస్ షూస్ ధరించి రావ ద్దని సూచించా రు. అడిషనల్ ఎస్పీ దిలీప్ కిర ణ్, అదనపు ఎస్పీ బి.విజయ భాస్కర్, ఏఆర్ అదనపు ఎస్పీ లు, డీఎస్పీలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.