Skip to main content

AP SI Prelims Exam Result 2023: ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ ఎగ్జామ్.. ఫ‌లితాలు ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఫిబ్ర‌వరి 19వ తేదీ (ఆదివారం) నిర్వహించిన ప్రిలిమిన‌రీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

మొత్తం 411 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 1.51 ల‌క్ష‌ల మంది అభ్యర్థులు హాజరయ్యారని ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల‌లో ఈ ప్రిలిమిన‌రీ పరీక్ష నిర్వహించారు. త్వ‌ర‌లోనే కీ విడుద‌ల చేస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ నియామ‌క మండ‌లి తెలిపింది. అలాగే రెండు వారాల్లో ఎస్ఐ ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని నిర్వాహ‌కులన్నారు.

ఎస్‌ఐ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించారు. ఎస్‌ఐ ప్రిలిమ్స్ ప‌రీక్షకి సంబంధించిన కీ సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో AP SI Prelims Question Paper and Exam Key అందుబాటులో ఉంది. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు. 

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 19 Feb 2023 07:00PM

Photo Stories