Skip to main content

AP Police Conistable Exam Tips: సమయం లేదు మిత్రమా.... కానిస్టేబుల్‌ పరీక్షకు ఇలా సిద్ధమవ్వండి

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 6511 కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి 22 నుంచి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటినుంచి లెక్కేస్తే నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

కాబట్టి అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా సిద్ధమైతే పరీక్షలో ఉత్తీర్ణులవ్వొచ్చు. ప్రిలిమినరీ, ఫైనల్‌ రాత పరీక్షల్లో.. ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్‌, హిస్టరీ, కరెంట్‌ అఫైర్స్, రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

చ‌ద‌వండి: AP Police Constable and SI Exams Previous Papers
అర్థమెటిక్‌....
అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన విభాగం.. అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఈ విభాగం నుంచే వంద ప్రశ్నలు అడుగుతారు. అర్థమెటిక్‌లోని ముఖ్యాంశాలుగా భావించే సగటులు, కసాగు, గసాభా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసులు, శాతాలు, లాభనష్టాలు, చక్ర వడ్డీ, సరళ వడ్డీ, కాలందూరం, కాలంపని వంటి వాటిపై పట్టు సాధించాలి. అలాగే మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్‌రిలేషన్స్‌ ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేయాలి. 

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
రీజనింగ్‌....
అభ్యర్థులు మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉన్న విభాగం.. రీజనింగ్‌. ఇందులో నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నెంబర్స్, కోడింగ్‌డీకోడింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, బ్లడ్‌ రిలేషన్స్‌ వంటి వాటిపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. వెన్‌  డయాగ్రమ్స్, అసెంప్షన్‌  అండ్‌ రీజన్, ఆర్గ్యుమెంట్‌æ, సిలాజిజమ్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో వెర్బల్‌ రీజనింగ్‌లో రాణించే అవకాశం ఉంది. ఆడ్‌మన్‌  ఔట్, డైస్‌ అండ్‌ క్యూబ్స్,వెన్‌ డయాగ్రమ్స్‌లపై పట్టుతో నాన్‌  వెర్బల్‌ రీజనింగ్‌లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై పట్టు సాధించాలి.
జనరల్‌ స్టడీస్‌....
హిస్టరీకి భారత, ఏపీ చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. 
జాగ్రఫీలో... భారత, ఏపీ భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

చ‌ద‌వండి: AP Police Model Papers
ఎకానమీ.... ఎకానమీకి సంబంధించి కోర్‌ ఎకనామీతోపాటు సమకాలీన అంశాలు, ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్త విధానాలపై స్పష్టత పెంచుకోవాలి.
పాలిటీ... పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యంగంలోని ముఖ్యమైన అధికరణలు వంటి అంశాలతోపాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం వంటివి తెలుసుకోవాలి.
కరెంట్‌ అఫైర్స్‌లో జాతీయంగా,అంతర్జాతీయం గా ప్రాధాన్యం సంతరించుకున్న తాజా పరిణామాలు(ఉదా: క్రీడలు – విజేతలు, సదస్సులు, సమావేశాలు – తీర్మానాలు...) గురించి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా జాతీయ భద్రతకు సంబంధించి ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారత, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఆర్థికాభివృద్ధి అంశాలు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్‌ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి.

Published date : 17 Dec 2022 01:23PM

Photo Stories