Skip to main content

పోలీస్ కొలువులకు నగారా!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ కొలువుల భర్తీకి ఎట్టకేలకు ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట స్థాయి పోలీస్ నియామక బోర్డు... సివిల్, ఏఆర్ విభాగాల్లో పోలీస్ కానిస్టేబుల్స్, జైళ్ల శాఖలో వార్డర్స్ ఉద్యోగాల భర్తీకి జూలై 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4548 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు...

పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)

3216

పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్)

1067

వార్డర్స్ (పురుషులు)

240

వార్డర్స్ (మహిళలు)

25

అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఇంటర్ చదివి ఉండాలి. ఇంటర్ రెండేళ్ల పరీక్షలకు హాజరై ఉండాలి.

వయో పరిమితి
సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు జూలై 1, 2016 నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (1994 జూలై 2 - 1998 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి). వార్డర్స్ పోస్టులకు జూలై 1, 2016 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (1986 జూలై 2 - 1998 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి)
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. హోంగార్డులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసులకు అనుగుణంగా నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా నిర్దేశిత ఫీజు రూ.300 (ఎస్సీ/ఎస్టీలైతే రూ. 150) ఏపీ/టీఎస్ ఆన్‌లైన్ లేదా మీ సేవా కేంద్రాల్లో చెల్లించి పేమెంట్ రసీదు పొందాలి. దాని ఆధారంగా రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి.

ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్ దరఖాస్తు: ఆగస్ట్ 3, 2016 నుంచి సెప్టెంబర్ 21, 2016 వరకు.
  • ప్రిలిమినరీ రాత పరీక్ష: 6, నవంబ‌ర్‌ 2016 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.
  • ప్రిలిమినరీ రాత పరీక్షకు 10 రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: recruitment.appolice.gov.in

నాలుగంచెల ఎంపిక ప్రక్రియ
ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియ నాలుగంచెల్లో ఉంటుంది. అవి..
1) ప్రిలిమినరీ రాత పరీక్ష
2) దేహ దారుఢ్య పరీక్ష
3) ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
4) ఫైనల్ రాత పరీక్ష

ప్రిలిమినరీ రాత పరీక్ష
ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో 200 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇందులో కనీస అర్హత మార్కులు నిర్దేశించారు. ఓసీ అభ్యర్థులు 40 శాతం; బీసీ అభ్యర్థులు 35 శాతం; ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియాల్లో ఉంటుంది. అయితే ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

ఫిజికల్ పరీక్షలకు తగ్గిన ప్రాధాన్యం
గతంలో ఎన్నడూ లేనివిధంగా దేహదారుఢ్య పరీక్షలకు ప్రాధాన్యత తగ్గించారు. కీలకమైన ఐదు కి.మీ పరుగు పందేనికి స్వస్తి పలికారు. హైజం ప్, షార్ట్‌ఫుట్‌లను కూడా తొలిగించారు. 800 మీటర్ల పరుగుకు బదులుగా ఒక మైలు (1600 మీటర్లు) పరుగును ప్రవేశపెట్టారు. దీంతోపాటు లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగును చేర్చారు.

దేహదారుఢ్య పరీక్ష
ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులకు నిర్ణీత శారీరక ప్రమాణాలుండాలి.

సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్ట్‌లకు
పురుషులు:
కనీసం 167.6 సెం.మీ. ఎత్తు ఉండాలి. పూర్తిగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ 5 సెం.మీ పెరిగి 86.3 సెం.మీ ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలకు చెందిన ఎస్టీ, ఆదివాసీ తెగల అభ్యర్థులు కనీసం 160 సెం.మీ ఎత్తు ఉండాలి. పూర్తిగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ 3 సెం.మీ పెరిగి 80 సెం.మీ ఉండాలి.
మహిళలు: కనీసం 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. బరువు 40 కిలోలకు తగ్గకూడదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలకు చెందిన ఎస్టీ, ఆదివాసీ తెగల అభ్యర్థులు కనీసం 150 సెం.మీ ఎత్తు, 38 కిలోల బరువు ఉండాలి.

వార్డర్స్ పోస్టులు
పురుషులు:
కనీసం 168 సెం.మీ. ఎత్తు ఉండాలి. పూర్తిగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ కనీసం 5 సెం.మీ పెరిగి 87 సెం.మీ ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఎస్టీ, ఆదివాసీ తెగల అభ్యర్థులు కనీసం 164 సెం.మీ ఎత్తు ఉండాలి. పూర్తిగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ కనీసం 5 సెం.మీ పెరిగి 83 సెం.మీ ఉండాలి.
మహిళలు: కనీసం 153 సెం.మీ ఎత్తు ఉండాలి. బరువు 45.5 కిలోలకు తక్కువ ఉండకూడదు.

ఫైనల్ రాత పరీక్ష
సివిల్ కానిస్టేబుల్స్, వార్డర్స్‌కు ఒక విధంగా; ఏఆర్ కానిస్టేబుల్స్‌కు మరో విధంగా ఉంటుంది.
  • ఏఆర్ అభ్యర్థులకు ఫైనల్ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు ఉంటుంది. మొత్తం ప్రశ్నలు 200.
  • సివిల్ కానిస్టేబుల్, వార్డర్స్‌కు ఫైనల్ రాత పరీక్ష మూడు గంటల వ్యవధిలో రెండు వందల మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
  • ఫైనల్ రాత పరీక్షలో కూడా నిర్ణీత మార్కులు నిర్దేశించారు. ఓసీ అభ్యర్థులు 40 శాతం; బీసీ అభ్యర్థులు 35 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.

తుది ఎంపిక ఇలా..
  • తుది రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సివిల్ కానిస్టేబుల్స్, వార్డర్స్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • ఏఆర్ పోస్టుల భర్తీలో తుది రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పొందిన మార్కులను కలిపి మొత్తం రెండు వందల మార్కులతో మెరిట్ జాబితా రూపొందిస్తారు.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
దేహదారుఢ్య పరీక్షలో విజయం సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. మూడు ఈవెంట్లలో ఇది ఉంటుంది.

ఈవెంట్

జనరల్

ఎక్స్‌సర్వీస్‌మెన్

మహిళలు

100 మీటర్ల పరుగు

15 సెకన్లు

16.5 సెకన్లు

18 సెకన్లు

లాంగ్‌జంప్

3.80 మీటర్లు

3.65 మీటర్లు

2.75 మీటర్లు

1600 మీ.పరుగు

8 నిమిషాలు

9 ని॥30 సె.

10ని॥30సె.

నోట్: 1600 మీటర్ల పరుగు పందెంలో తప్పనిసరిగా ఉత్తీర్ణత (నిర్దేశిత సమయంలో పూర్తి చేయడం) సాధించాలి.
  • సివిల్ కానిస్టేబుల్స్, వార్డర్స్ అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంతో పాటు మిగిలిన రెండు ఈవెంట్లలో ఒకదానిలో ఉత్తీర్ణత సాధించాలి. ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులు మూడు ఈవెంట్లలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలి.
  • వీటిలో అర్హత సాధించిన వారినే ఫైనల్ పరీక్షకు అనుమతిస్తారు.
  • ఏఆర్ పోస్టుకు సంబంధించి ఈవెంట్స్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. 100 మీటర్ల పరుగుకు 30 మార్కులు, లాంగ్ జంప్‌కు 30 మార్కులు, 1600 మీటర్లకు 40 మార్కులు ఇస్తారు.
Published date : 23 Jul 2016 12:34PM

Photo Stories