Skip to main content

High Court: 8 ప్రశ్నల పూర్తి వివరాలు సమర్పించండి

సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదని, ఈ వ్యవహారాన్ని నిపుణుల కమిటీకి నివేదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
Submit complete details of 8 questions
High Court: 8 ప్రశ్నల పూర్తి వివరాలు సమర్పించండి

ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 3న ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపిస్తూ... ప్రిలిమ్స్‌లో 8 ప్రశ్నలకు సరైన జవాబులను ఇవ్వనందున దీనిని నిపుణుల కమిటీకి పంపాల్సిన అవసరం ఉందన్నారు.

చదవండి: AP పోలీస్ - స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | వీడియోస్

మార్చి 13 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయని, వాటికి పిటిషనర్లను అనుమతించేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను మార్చి 7కి వాయిదా వేశారు.

Published date : 04 Mar 2023 03:35PM

Photo Stories