SI Main Exam: నేడు, రేపు ఎస్‌ఐ పోస్టులకు మెయిన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకోసం మెయిన్ పరీక్షలను శని, ఆదివారాల్లో నిర్వహించేందుకు పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ మెయిన్ పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపదని పోలీసు నియామక మండలి తెలిపింది. ఈ మేరకు వెబ్సైట్లో కూడా ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఇప్పటికే నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలపై నిర్ణయాన్ని తరువాత ప్రకటించనుంది.
చదవండి: SI Exam: ఎస్‌ఐ పరీక్ష అభ్యర్థులకు ఉచిత భోజన వసతి
రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలుల్లో శని, ఆదివారాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనుంది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మెయిన్ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323కు ఫోన్ చేయవచ్చని, ఈమెయిల్: mail- slprb@ap.gov.in లో సంప్రదించవచ్చని సూచించింది.
ఈ పరీక్షల వివరాలు..
అక్టోబరు 14: పేపర్–1 (డిస్క్రిప్టివ్ ) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు
పేపర్–2 (డిస్క్రిప్టివ్ ) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు
అక్టోబరు 15: పేపర్–3 (ఆబ్జెక్టివ్) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు
పేపర్–4 (ఆబ్జెక్టివ్) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు