ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది?
1. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఆర్థిక సంఘం మొదటి అధ్యక్షుడు కె.సి. నియోగి
బి) మొదటి కాగ్ నరహరి రావు
సి) ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు
డి) ఎస్సీ, ఎస్టీ కమిషన్ మొదటి చైర్మన్ రాంధాన్
- View Answer
- సమాధానం: సి
2. విధాన పరిషత్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది?
1) ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో ఉంది
2) దీని రద్దు లేదా ఏర్పాటు న్యాయ శాఖ పరిధిలోకి వస్తుంది
3) ప్రస్తుతం తెలంగాణ విధాన పరిషత్ ప్రతిపక్ష నేత షబ్బిర్ అలీ
4) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం
ఎ) 1, 3
బి) 2, 4
సి) 1, 2, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
3. కింది వాటిలో సరైంది ఏది?
1) 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు
2) పంచాయితీరాజ్ చట్టం ద్వారా గ్రామసభకు అత్యంత ప్రాముఖ్యత కల్పించారు
3) రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ట్రపతి
ఎ) 1
బి) 1, 3
సి) 2, 3
డి) 1, 2, 3
- View Answer
- సమాధానం: డి
4. కింది వాటిలో ఎన్నికల సంఘం విధి కానిది ఏది?
ఎ) అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు నిర్ణయించడం
బి) పార్లమెంట్ సభ్యుల అర్హతలను నిర్ణయించడం
సి) పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లను చైతన్యపరచడం
డి) రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయించడం
- View Answer
- సమాధానం: బి
5. లోక్‌సభ స్పీకర్లకు సంబంధించి సరైన వరుస క్రమం ఏది?
ఎ) జి.ఎం.సి. బాలయోగి, మనోహర్ జోషి, సోమనాథ్ ఛటర్జీ
బి) బలరాం జక్కర్, పి.ఎ. సంగ్మా, సోమనాథ్ ఛటర్జీ
సి) నీలం సంజీవరెడ్డి, బలరాం జక్కర్, జీవరాజ్ పాటిల్
డి) హుకుంసింగ్, బలరాం జక్కర్, బిలిరాం భగత్
- View Answer
- సమాధానం: ఎ
6. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని ‘మొదటి లిఖిత చట్టం’గా పేర్కొంటారు
బి) 1861 కౌన్సిల్ చట్టం ద్వారా తొలిసారిగా పోర్టు ఫోలియో విధానం ఏర్పాటు చేశారు
సి) 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా వైస్రాయ్ పదవి ఏర్పాటు చేశారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. భారతదేశంలో సమాఖ్య(ఫెడరల్) ప్రభుత్వ ఏర్పాటుకు మూలమైన చట్టం ఏది?
ఎ) 1909 మింటో-మార్లే సంస్కరణల చట్టం
బి) 1919 మాంటెగ్ - చెమ్స్ఫర్డ సంస్కరణల చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) 1947 భారత స్వతంత్ర చట్టం
- View Answer
- సమాధానం: సి
8. కేబినెట్ మిషన్ ప్లాన్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) తాత్కాలిక కేబినెట్
బి) ప్రొవిన్సియల్ గ్రూపింగ్
సి) రాజ్యాంగ హక్కు గుర్తించడం
డి) ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరించడం
- View Answer
- సమాధానం: డి
9. కింద పేర్కొన్నవారిలో రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసింది ఎవరు?
ఎ) హెచ్.సి. ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి
బి) హెచ్.సి. ముఖర్జీ, కె.టి. షా
సి) గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్
డి) ఫ్రాంక్ అంటోని, టి.టి. కృష్ణమాచారి
- View Answer
- సమాధానం: ఎ
10. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
బి) హెచ్.సి. ముఖర్జీ
సి) రాజేంద్రప్రసాద్
డి) బి.ఎన్. రావు
- View Answer
- సమాధానం: డి
11. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది?
ఎ) 1958
బి) 1860
సి) 1951
డి) 1876
- View Answer
- సమాధానం: బి
12. కింద పేర్కొన్నవారిలో రాజ్యాంగ ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివారెవరు?
ఎ) అంబేడ్కర్
బి) కె.ఎం. మున్షీ
సి) బి.ఎన్. రావు
డి) మాధవరావు
- View Answer
- సమాధానం: సి
13. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) దక్షిణాఫ్రికా
బి) కెనడా
సి) ఫ్రాన్స్
డి) ఐర్లాండ్
- View Answer
- సమాధానం: డి
14. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 24-1-1950
బి) 15-8-1947
సి) 26-1-1950
డి) 26-11-1949
- View Answer
- సమాధానం: డి
15. ‘లౌకిక తత్వం’ భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
ఎ) ఎస్.ఆర్. బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా
బి) భరత్ కుమార్ Vs కేరళ రాష్ట్రం
సి) ఉన్నికృష్ణన్ Vs ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
డి) కేశవానంద భారతి Vs కేరళ రాష్ట్రం
- View Answer
- సమాధానం: బి
16. ఏ కమిటీ సిఫారసుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ అనే పదాలను చేర్చారు?
ఎ) సంతానం కమిటీ
బి) రాజ్యాంగ సమీక్షా సంఘం
సి) స్వరణ్‌సింగ్ కమిటీ
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
17. రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలుపుతుంది?
ఎ) 2
బి) 3
సి) 4
డి) 7
- View Answer
- సమాధానం: సి
18. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించారు?
ఎ) 85వ సవరణ - 2000
బి) 84వ సవరణ - 2000
సి) 81వ సవరణ - 2000
డి) 79వ సవరణ - 1996
- View Answer
- సమాధానం: ఎ
19. పార్లమెంట్ రూపొందించిన ‘విద్యా హక్కు చట్టం’ సమాజంలో ఎవరికి దోహదపడుతుంది?
ఎ) కళాశాలలకు వెళ్లేవారికి
బి) సాంకేతిక విద్యలో ఉత్సాహం ఉన్న వారికి
సి) సీనియర్ సెకండరీ స్థాయి బాలికలకు
డి) 14 ఏళ్ల లోపు బాలబాలికలకు
- View Answer
- సమాధానం: డి
20. రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ ‘ద్వంద్వ శిక్ష’ను నిషేధిస్తుంది?
ఎ) 19(1((సి)
బి) 15(4)
సి) 20(2)
డి) 21
- View Answer
- సమాధానం: సి