Skip to main content

విద్యుత్ - 1

  • స్థిర విద్యుత్‌ను ఎవరు కనుగొన్నారు?
    థేల్స్ ఆఫ్ మిలిటస్
  • విద్యుత్‌ను కనుగొన్నవారు?
    విలియం బర్డ్స్
  • విద్యుత్‌కు ధన, రుణ అవేశాలు ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
    బెంజిమన్ ఫ్రాంక్లిన్ (అమెరికా)
  • చనిపోయిన కప్ప కాళ్లకు రెండు లోహపు పలకలను తాకించినప్పుడు అది ఎగిరిపోవడంతో జంతు దేహంలోనూ విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త ఎవరు?
    లూయీ గాల్వనీ (ఇటలీ)
  • విద్యుత్.. అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నవారెవరు?
    హన్స్ అయిర్‌స్టడ్ (డేనిష్)
  • విద్యుత్ మోటారు, జనరేటర్‌లను కనుగొన్న శాస్త్రవేత్త?
    మైకేల్ ఫారడే
  • ప్రయోగాత్మకంగా మొదటి విద్యుత్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
    ఇంగ్లండ్‌లోని గోడల్మింగ్
  • అమెరికాలోని మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎవరు స్థాపించారు?
    థామస్ అల్వా ఎడిసన్
  • విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త?
    థామస్ అల్వా ఎడిసన్
    (ఎడిసన్ సుమారు 1,000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశారు)
  • టార్‌‌చలైట్ ఘటం ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది?
    రసాయనశక్తి
  • ఎక్కువ సమాచారాన్ని సంక్షిప్త రూపంలో తెలపడానికి ఉపయోగపడేవి?
    సంకేతాలు
  • ఘటాలను ఏ సంధానం చేయడం ద్వారా బ్యాటరీ తయారవుతుంది?
    శ్రేణి సంధానం
  • విద్యుత్ అలంకరణ దీపాలను ఏ విధంగా సంధానం చేస్తారు?
    శ్రేణి సంధానం
  • ఇంటిలోని వివిధ విద్యుత్ పరికరాలను ఏ విధంగా సంధానం చేస్తారు?
    సమాంతర సంధానం
    నోట్ 1: శ్రేణి సంధానంలో వివిధ విద్యుత్ పరికరాలను(బల్బులను) కలిపినప్పుడు అందులో ఏదైనా ఒక పరికరం పనిచేయకపోతే మిగిలినవి కూడా పనిచేయవు.
    నోట్ 2: సమాంతర సంధానంలో వివిధ విద్యుత్ పరికరాలను(బల్బ్‌లను) కలిపినప్పుడు అందులో ఏదైనా ఒక పరికరం పనిచేయకపోయినప్పటికీ మిగిలినవి పనిచేస్తాయి.
  • ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలలో ఫిలమెంట్‌గా ఉపయోగించే పదార్థం ఏది?
    నిక్రోమ్
  • ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది?
    1) పదార్థ స్వభావం
    2) తీగ పొడవు
    3) మందం
  • వలయంలో ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రయాణించినప్పుడు వస్తువులు కాలిపోకుండా ఉండేందుకు రక్షణగా ఉపయోగపడే పదార్థం ఏది?
    ఫ్యూజ్
  • ఫ్యూజ్‌కు బదులుగా విస్తృతంగా దేన్ని ఉపయోగిస్తున్నారు?
    మినియేచర్ సర్య్కూట్ బ్రేకర్
    (MCB అనేది రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవహించినప్పుడు తనంతట తానుగా స్విచ్ ఆఫ్ అవుతుంది)
  • ఘట సంకేతంలో పొడవు గీత ఏ ధ్రువాన్ని సూచిస్తుంది?
    ధన ధ్రువాన్ని
  • ఘట సంకేతంలో చిన్నగీత ఏ ధ్రువాన్ని సూచిస్తుంది?
    రుణ ధ్రువాన్ని
  • LEDని విస్తరించండి?
    Light-Emitting Diode
    (LEDని మొబైల్ ఫోన్, టి.వి. ట్రాన్స్ ఫార్మర్ లాంటి పరికరాలు పనిచేస్తున్నాయా? లేదా తెలుసుకోవడానికి సూచిక (లేదా) టెస్టర్‌గా వాడుతారు)
  • స్వేదన జలం (స్వచ్ఛమైన నీరు) విద్యుత్ పరంగా ఎటువంటి పదార్థం?
    విద్యుత్ బంధకం
  • మొదటిసారిగా విద్యుత్ ఘటాన్ని ఎవరు తయారుచేశారు?
    వోల్టా
  • ఇనుము వంటి లోహాలు తుప్పుపట్టకుండా ఉండేందుకు వాటిపై పూతపూసే లోహాలు ఏవి?
    నికెల్ లేదా క్రోమియం
  • యంత్రాల భాగాలు తుప్పుపట్టకుండా ఉండటానికి, మెరవడానికి తరచుగా దేన్ని పూతపూస్తారు?
    క్రోమియం
  • సాధారణంగా తినుబండారాలను నిల్వ ఉంచడానికి దేనితో పూతపూసిన ఇనుప డబ్బాలను వాడుతారు?
    తగరం (Tin)
  • వెంట్రుకలు దుస్తులను ఆకర్షించడం, ఆకాశంలో మెరుపులు.. ఈ రెండూ ఒకే దృగ్విషయం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
    బెంజిమన్ ఫ్రాంక్లిన్
  • వస్తువు ఆవేశం కలిగి ఉందో లేదో తెలుసుకోవాడానికి ఉపయోగించే పరికరం ఏది?
    విద్యుద్దర్శిని
  • వస్తువుపై ఉన్న ఆవేశాలు భూమికి బదిలీ అయ్యే పద్ధతిని ఏమంటారు?
    ఎర్త్ చేయడం
  • ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరో మేఘం వచ్చినప్పుడు అది రెండో మేఘంపై ఏ ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది?
    వ్యతిరేక ఆవేశం
  • బ్యాటరీ నుంచి బల్బ్‌కు శక్తిని సరఫరా చేసే పదార్థాన్ని ఏమంటారు?
    వాహకం
  • ధనాత్మక అయాన్‌ల అమరికను ఏమంటారు?
    లాటిస్
  • విద్యుత్ ప్రవాహం అనగానేమి?
    ఆవేశాల క్రమవిచలనం
  • విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏమిటి?
    ఆంపియర్
  • విద్యుదావేశానికి ప్రమాణం ఏమిటి?
    కూలుంబ్
  • వాహకంలోని ఏకాంక ఘనపరిమాణంలో ఉన్న ఆవేశాల సంఖ్యను ఏమంటారు?
    ఆవేశ సాంద్రత
  • వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవ డానికి సాధారణంగా దేన్ని ఉపయోగిస్తారు?
    అమ్మీటర్
  • అమ్మీటర్‌ను వలయంలో ఏ విధంగా సంధానం చేస్తారు?
    శ్రేణి సంధానం
  • పొటెన్షియల్ భేదాన్ని ఏమని పిలుస్తారు?
    వోల్టేజ్
  • పొటెన్షియల్ భేదానికి ఎస్.ఐ. ప్రమాణం ఏమిటి?
    వోల్ట్
  • ద్రవాల్లో విద్యుత్ ప్రవాహం ఏ ఆవేశాల వల్ల జరుగుతుంది?
    ధన, రుణ ఆవేశాల చలనం
  • లోహ ఘనపదార్థ రూప వాహకంలో విద్యుత్ ప్రవాహం వేటివల్ల జరుగుతుంది?
    ఎలక్ట్రాన్ చలనం
  • ధనావేశపూరిత లోహ పలకను ఏమంటారు?
    ఆనోడ్
  • రుణావేశపూరిత లోహ పలకను ఏమంటారు?
    కాథోడ్
Published date : 06 Feb 2016 05:09PM

Photo Stories